Home /News /international /

FOUR YEAR OLD GIRL DISCOVERS 220 MILLION YEAR OLD DINOSAUR FOOTPRINT AT BEACH BENDRICKS BAY IN WALES KRS

Dinosaur: 22కోట్ల సంవత్సరాల కిందటి డైనోసర్ కాలి గుర్తులు కనుగొన్న బాలిక.. దాని పొడవు ఎంతంటే 

Instagram image

Instagram image

డైనోసర్ల మనుగడపై సాగుతున్న పరిశోధనలకు ఇది సాయం చేస్తుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ కాలి ముద్రలు ఎక్కడ కనిపించాయంటే..

    డైనోసర్లు అత్యంత పురాతనమైన జీవాలు. అత్యంత భారీగా ఉండి కోటానుకోట్ల సంవత్సరాల క్రితమే భూమిపై జీవించి.. కాల క్రమేణా అంతరించిపోయాయి. అయితే వీటి మనుగడ ఎప్పుడు మొదలైందో.. ఎప్పుడు అంతమైదో ఇప్పటికీ కచ్చితంగా తెలియదు. పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి. ఎప్పుడైనా శిలాజాలు, ఏవైనా గుర్తులు దొరికినప్పుడు ఆ డైనోసర్ ఎప్పటిదో గుర్తిస్తున్నారు. తాజాగా ఓ నాలుగేళ్ల పాపకు రాయిపై ముద్రించుకుపోయిన డైనోసర్ కాలి ముద్రలు కనిపించాయి. అవి ఏకంగా 220 మిలియన్ సంవత్సరాల క్రితం డైనోసర్​వి అని తేలింది. ​

    బ్రిటన్​ సౌత్​వేల్స్​లోని బెన్​డ్రిక్స్​ బీచ్​బేలో నాలుగేళ్ల లిలీ విల్డర్​కు ఈ డైనోసర్ కాలి ముద్రలు కనిపించాయి. లిలీ, ఆమె తండ్రి తమ పెంపుడు కుక్కతో పాటు నడుచుకుంటూ వెళ్లగా ఇది కనిపించిందట.

    “అది రాయి పైన కనిపించింది. ఆ రాయి లిలీ భుజాల ఎత్తు ఉంది. ఆమె ఆ కాలిముద్ర చూసిన వెంటనే తన నాన్నకు చెప్పింది. పాప దీన్ని చూసి ఆశ్చర్యపోయింది. అయితే నిజంగా ఇది ఎంతో అద్భుతమైన విషయమో తనకు తెలియదు” అని లిలీ తల్లి సాలీ చెప్పారు.

    కాగా చిన్నారి గుర్తించిన డైనోసర్​ కాలి ముద్రను ఆమె తండ్రి ఫొటోలు తీసి చుట్టుపక్కల వారితో పాటు నిపుణులకు పంపాడు. ఈ ఫొటోలను మ్యూజియం వేల్స్ ఇన్​స్టాగ్రామ్​లో పోస్ట్ చేసింది.




    “డైనాసర్ల గురించి కనుగొనేందుకు ప్రయత్నిస్తున్న శాస్త్రవేత్తలకు ఇది మరింత సాయపడుతుంది” అని పేర్కొంది. అలాగే ఈ కాలిముద్ర ఉన్న డైనోసర్​ 220 ఏళ్ల క్రితం జీవించి ఉంటుందని తన వెబ్​సైట్లో వెల్లడించింది.

    గ్రాలేటర్​ అని పిలిచే ఈ డైనోసర్ కాలి ముద్ర 10 సెంటీమీటర్లకు పైగానే ఉంది. దీన్నిబట్టి ఆ డైనోసర్ 75 సెంటీమీటర్ల ఎత్తు, 8 అడుగుల వెడల్పు ఉండేదని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు.
    Published by:Krishna P
    First published:

    Tags: Dinosaur

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు