UNSCలో శాశ్వత సభ్యత్వం దిశగా భారత్... ఐతే ఏంటి? మనకేంటి లాభం?

ప్రపంచంలో దాదాపు 16 శాతం జనాభా మన దేశంలో ఉన్నారు. కానీ మనకు ఐక్యరాజ్యసమితిలో శాశ్వత సభ్యత్వం ఇప్పటివరకూ లేదు. ఇప్పుడా కల నెరవేరేలా కనిపిస్తోంది.

news18-telugu
Updated: September 22, 2020, 1:46 PM IST
UNSCలో శాశ్వత సభ్యత్వం దిశగా భారత్... ఐతే ఏంటి? మనకేంటి లాభం?
UNSCలో శాశ్వత సభ్యత్వం దిశగా భారత్...
  • Share this:
ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి (UN Security Council - UNSC)లో భారత్‌కు శాశ్వత సభ్యత్వం కల్పించేందుకు కౌన్సిల్‌లో ఉన్న నాలుగు సభ్యదేశాలు మద్దతు ఇస్తున్నాయని కేంద్ర ప్రభుత్వం సోమవారం తెలిపింది. UNSCలో భారత్‌కు శాశ్వత సభ్యత్వం అధిక ప్రాధాన్యం కలిగిన అంశమని కేంద్రమంత్రి వి.మురళీధరణ్ చెప్పారు. భద్రతా మండలి సభ్యత్వంపై లోక్‌సభలో అడిగిన ఓ ప్రశ్నకు సమాధానంగా ఆయన ఈ వివరాలు చెప్పారు. "మండలిలో ఉన్న 5 శాశ్వత సభ్యదేశాల్లో 4 భారత్‌కు మద్దతు ఇవ్వడం ద్వైపాక్షిక విజయం అని ఆయన అన్నారు. ఏయే దేశాలు భారత్‌కు మద్దతిస్తున్నాయనేది మంత్రి సభకు తెలపలేదు. ఓ అంచనా ప్రకారం... అమెరికా, బ్రిటన్, రష్యా, ఫ్రాన్స్... మద్దతిచ్చినా... చైనా ఇవ్వలేదని తెలుస్తోంది. ఐదు దేశాలూ ఒప్పుకుంటేనే ఏ నిర్ణయమైనా అమలవుతుంది.

"2015 మేలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చైనాలో పర్యటించినప్పుడు రెండు దేశాలు సంయుక్త ప్రకటన విడుదల చేశాయి. అభివృద్ధి చెందుతున్న, పెద్ద దేశంగా ఉన్న భారత్‌కు అంతర్జాతీయ వ్యవహారాల్లో ప్రాధాన్యం పెరగాలని రెండు దేశాలు అభిప్రాయపడ్డాయి. భారతదేశం ఆకాంక్షను అర్థం చేసుకున్న చైనా ఇందుకు మద్దతు ఇస్తున్నట్టు ప్రకటించింది. భద్రతా మండలితో సహా ఐక్యరాజ్యసమితి (ఐరాస)లో భారత్ ప్రధాన పాత్ర పోషిస్తుంది" అని మంత్రి సభలో తెలిపారు.

* శాశ్వత సభ్య దేశాలు ఐదే:
ప్రస్తుతం UNSCలో ఐదు శాశ్వత సభ్య దేశాలు, 10 సభ్య దేశాలు ఉన్నాయి. UN జనరల్ అసెంబ్లీ రెండు సంవత్సరాల కాలానికి సభ్య దేశాలను ఎన్నుకుంటుంది. అమెరికా, రష్యా, బ్రిటన్, చైనా, ఫ్రాన్స్... ఈ ఐదూ మండలిలో శాశ్వత సభ్య దేశాలు. ఏదైనా తీర్మానాన్ని వీటో(తిరస్కరణ) చేసే అధికారం ఈ దేశాలకు ఉంది. మారిన అంతర్జాతీయ పరిస్థితుల వల్ల UNSCలో శాశ్వత సభ్య దేశాల సంఖ్యను పెంచాలనే డిమాండ్ పెరుగుతోంది.

* మద్దతు ఉన్నా ఆలస్యం ఎందుకు?
భద్రతా మండలిని విస్తరించాలని భారత్ మొదటి నుంచి కోరుతోంది. సభ్య, శాశ్వత సభ్య దేశాల సంఖ్యను పెంచి మరిన్ని దేశాలకు UNSCలో అవకాశం కల్పించే దిశగా కృషిచేస్తున్నామని, ఇందుకోసం భారత్ ఇతర దేశాల మద్దతు సైతం కూడగడుతోందని విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇతర దేశాల మద్దతు ఉన్నా సభ్యత్వం ఎందుకు ఆలస్యమవుతుంది అనే ప్రశ్నకూ మంత్రి సమాధానం ఇచ్చారు. "భద్రతామండలి విస్తరణకు ఐక్యరాజ్యసమితి ఒక చార్టర్ను రూపొందించాలి. దాంట్లో విస్తరణకు సంబంధించిన వివరాలు, నియమ నిబంధనలు పొందుపరచాలి. ఆ చార్టర్‌కు యూఎన్ సభ్య దేశాల్లో మూడింట రెండొంతుల మంది అనుకూలంగా ఓటేయాలి. ఆ తరువాతే పని మెదలవుతుంది" అని ఆయన వివరించారు.

* ప్రపంచ శాంతికి కృషి చేస్తున్న భారత్... మండలిలో శాశ్వత సభ్యత్వాన్ని ఆశించడం తప్పు కాదని మనకు మద్దతిస్తున్న దేశాలు చెబుతున్నాయి. 2009 నుంచి ప్రపంచ దేశాలు భద్రతా మండలిలో సంస్కరణలు కోరుతున్నాయి. కొన్ని దేశాలు మాత్రం... కేవలం నాన్ పర్మినెంట్ సభ్య దేశాల సంఖ్యను పెంచితే చాలని, శాశ్వత సభ్యత్వాన్ని ఇతర దేశాలకు ఇవ్వాల్సిన అవసరం లేదని చెబుతున్నాయి.

భారత్‌కి శాశ్వత సభ్య దేశం గుర్తింపు వస్తే... చైనా పని అయిపోయినట్లే. ఇన్నాళ్లూ దీన్ని అడ్డం పెట్టుకొనే... చైనా అంతర్జాతీయ స్థాయిలో ఇండియా కంటే పెద్ద దేశంగా చెలామణీ అవుతోంది. లేని డాంబికాలు ప్రదర్శిస్తూ... ఇండియాకి అడుగడుగునా ఇబ్బందులు కలిగిస్తోంది. ఇండియా పర్మనెంట్ సీటు దక్కించుకుంటే... తన ఆటలు సాగవన్న ఉద్దేశంతోనే కుళ్లు డ్రాగన్... దశాబ్దాలుగా... ఈ కల నెరవేరకుండా అడ్డుకుంటోంది. అందుకే ఈ కల నేరవేరాలి. అంతర్జాతీయ ఒప్పందాలు, తీర్మానాల్లో భారత్ కూడా వీటో పవర్ ఉపయోగించే పరిస్థితి రావాలి.
Published by: Krishna Kumar N
First published: September 22, 2020, 1:46 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading