
ప్రతీకాత్మక చిత్రం
బార్ నిర్వాహకులు చెప్పినదాని ప్రకారం నిందితుడు స్పానిష్ అయి ఉంటాడని పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు.సీసీటీవి ఫుటేజీ ఆధారంగా నిందితుడిని గుర్తించే ప్రయత్నం చేస్తున్నట్టు చెప్పారు.
అమెరికాలో మరోసారి కాల్పులు చోటు చేసుకున్నాయి. కాన్సస్ సిటీ బార్లో ఓ దుండగుడు కాల్పులకు పాల్పడ్డాడు. ఈ ఘటనలో నలుగురు మృతి చెందగా,9మంది గాయపడ్డారు. అర్ధరాత్రి తర్వాత 1.27గంటల సమయంలో కాల్పుల ఘటనపై తమకు సమాచారం అందిందని కాన్సస్ సిటీ పోలీసులు తెలిపారు. హుటాహుటిన అక్కడికి చేరుకుని క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించినట్టు చెప్పారు.బార్ నిర్వాహకులు చెప్పినదాని ప్రకారం నిందితుడు స్పానిష్ అయి ఉంటాడని అనుమానం వ్యక్తం చేశారు.సీసీటీవి ఫుటేజీ ఆధారంగా నిందితుడిని గుర్తించే ప్రయత్నం చేస్తున్నట్టు చెప్పారు. ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
Published by:Srinivas Mittapalli
First published:October 06, 2019, 17:03 IST