హోమ్ /వార్తలు /అంతర్జాతీయం /

Plane Crash : నేపాల్ లో ప్రయాణికుల విమానం క్రాష్!..అందులో పలువురు భారతీయులు

Plane Crash : నేపాల్ లో ప్రయాణికుల విమానం క్రాష్!..అందులో పలువురు భారతీయులు

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Nepal Plane Crash : నేపాల్​లో ఇవాళ ఉదయం ఆచూకీ గల్లంతైన విమానం కూలిపోయింది. నలుగురు భారతీయులు సహా 22 మందితో ప్రయాణిస్తూ గల్లంతైన నేపాల్ తారా ఎయిర్‌లైన్స్ విమానం కూలిపోయినట్టు అధికారులు నిర్ధారించారు.

Nepal Plane Crash : నేపాల్​లో ఇవాళ ఉదయం ఆచూకీ గల్లంతైన విమానం కూలిపోయింది. నలుగురు భారతీయులు సహా 22 మందితో ప్రయాణిస్తూ గల్లంతైన నేపాల్ తారా ఎయిర్‌లైన్స్ విమానం కూలిపోయినట్టు అధికారులు నిర్ధారించారు. పర్యాటక నగరమైన పోఖ్రా నుంచి ఇవాళ ఉదయం 9.55 గంటలకు టేకాఫ్ అయిన విమానం జోమ్సోమ్ విమానాశ్రయంలో ఉదయం 10:15 గంటలకు ల్యాండ్ కావాల్సి ఉంది. అయితే పోఖ్రా నుంచి టేకాఫ్ అయిన 15 నిమిషాల తర్వాత కంట్రోల్ టవర్‌తో సంబంధాలు కోల్పోయింది.

రెండు ఇంజిన్లు కలిగిన ఈ చిన్న విమానం మిస్సయిన వెంటనే సెర్చ్ ఆపరేషన్ కోసం రెండు హెలికాప్టర్లు రంగంలోకి దిగాయి. ఈ విమానంలో ముంబైకి చెందిన అశోక్ కుమార్ త్రిపాఠి, ధనుష్ త్రిపాఠి, రితికా త్రిపాఠి, వైభవి త్రిపాఠిలతో పాటు ఇద్దరు జర్మన్లు, 13 మంది నేపాలి ప్రయాణికులు ఉన్నారు. తాజాగా ఈ విమాన శకలాలను కోవాంగ్ గ్రామంలో గుర్తించారు. స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు మనపతి మనపథి హిమల్​ పర్వత శ్రేణుల్లోని లమ్​చే నది వద్ద విమానం కూలిపోయింది. సమాచారం అందుకున్న వెంటనే నేపాల్ ఆర్మీ రోడ్డు, వాయు మార్గాల్లో ఘటనా స్థలానికి బయలుదేరినట్టు ఆర్మీ అధికార ప్రతినిధి నారాయణ్ సిల్వాల్ తెలిపారు. నేపాల్​ సైన్యం రోడ్డు, ఆకాశమార్గాన ఘటనా స్థలానికి వెళ్తోందని వెల్లడించారు.

Published by:Venkaiah Naidu
First published:

Tags: Nepal, Plane Crash

ఉత్తమ కథలు