ఆస్ట్రేలియాలో ఘోర విమానం ప్రమాదం జరిగింది. రెండు తేలికపాటి విమానాలు గాల్లో ఎదురెదురుగా ఢీకొన్నాయి. అనంతరం ఆకాశం నుంచి నుంచి భూమి మీదకు పడిపోయాయి. ఈ ప్రమాదంలో నలుగురు చనిపోయారు. సెంట్రల్ విక్టోరియాలోని మంగలూరు ఎయిర్‌పోర్టుకు కిలోమీటర్ దూరంలో ఈ ఘటన జరిగింది. ప్రమాదం జరిగిన వెంటనే రెస్క్యూ టీమ్స్ అక్కడికి చేరుకున్నాయి. అప్పటికే విమానంలో ఉన్నవారంతా చనిపోయారు. నాలుగు మృతదేహాలను స్వాధీనం చేసుకొని మార్చురీకి తరలించారు. భూమికి 4వేల అడుగులు ఎత్తులో ప్రయాణిస్తున్న సమయంలో విమానాలు ఢీకొన్నాయని అధికారులు తెలిపారు. దట్టమైన మేఘాల గుండా వెళ్లడంతో.. రెండు విమానాల్లోని పైలెట్లకు ఎదురుగా ఉన్నవి సరిగా కనిపించలేదని వెల్లడించారు. ఈ క్రమంలో ప్రమాదం జరిగి ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఒక్కో విమానంలో ఇద్దరేసి చొప్పున ఉన్నారని.. మొత్తం నలుగురు వ్యక్తులు ప్రమాదంలో చనిపోయారని చెప్పారు. ఘటనపై ఏవియేషన్ ఉన్నతాధికారులు దర్యాప్తు చేస్తున్నారని తెలిపారు.
#Australia horrific plane crash kills 4 after mid-air collision.#planecrash pic.twitter.com/Nz4PzHSfIS
— 5 News Australia (@5NewsAustralia) February 19, 2020
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Australia, Plane Crash