వారానికి మూడు రోజులు వీకాఫ్... అదే బెటరంటున్న కంపెనీలు...

ఇండియా ఉష్ణమండల దేశం. ఇక్కడ మనం ఎక్కువ గంటలు పని చెయ్యలేం. అలా చేస్తే టెన్షన్ ఎక్కువై, లేనిపోని రోగాలొస్తాయి అంటున్నారు మానసిక నిపుణులు.

Krishna Kumar N | news18-telugu
Updated: July 1, 2019, 6:50 AM IST
వారానికి మూడు రోజులు వీకాఫ్... అదే బెటరంటున్న కంపెనీలు...
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
వారంలో ఎన్ని రోజులు పని చెయ్యాలి? ఎన్ని రోజులు వీకాఫ్ తీసుకోవాలి అన్న అంశం మరోసారి చర్చకు వస్తోంది. ప్రస్తుతం ఐటీ ఉద్యోగులకు వారానికి రెండు రోజులు వీకాఫ్ ఉంటోంది. మిగతా ఉద్యోగాలకు వారానికి ఒక రోజు వీకాఫ్ ఇస్తున్నారు. ఐతే... విదేశాల్లోని కొన్ని కంపెనీలు... వారానికి మూడు రోజులు వీకాఫ్ ఇచ్చి, ఎలాంటి ఫలితాలు వస్తున్నాయో తెలుసుకున్నాయి. మంచి ఫలితాలే వస్తున్నాయని ఇంటర్నేషనల్ వర్క్ ప్లేస్ గ్రూప్ చేసిన సర్వేలో తేలింది. ఐతే... ఇండియాలో మాత్రం పరిస్థితి ఏమీ బాలేదనీ, ఇక్కడి ప్రజలు విపరీతంగా పనిచేస్తూ ఒత్తిడి, టెన్షన్ ఇతరత్రా మానసిక సమస్యలు ఎదుర్కొంటున్నారని తెలిపింది.

అమెరికా, బ్రిటన్‌ సహా 8 దేశాల్లోని 3 వేల మంది ఉద్యోగులపై అధ్యయనం చేసింది ఆ కంపెనీ. సాధారణంగా... మన ఇండియన్ కంపెనీలు ఎలా ఆలోచిస్తాయంటే... ఉద్యోగులకు ఎక్కువ వీకాఫ్‌లు ఇస్తే, చేయాల్సిన పని పెరిగిపోతుందనీ, దాని వల్ల ఎక్కువ ఒత్తిడికి లోనవుతారని భావిస్తుంటాయి.

విదేశాల్లో కంపెనీల ఆలోచన మరోలా ఉంది. ఉద్యోగులకు ఎక్కువ వీకాఫ్‌లు ఇస్తే, వారు తన సొంత సమస్యల్ని పరిష్కరించేసుకొని... ఆఫీసులకు ఫ్రెష్ మూడ్‌తో వస్తారనీ, అప్పుడు వేగంగా, తప్పులు లేకుండా పనిచేస్తారని భావిస్తున్నాయి. అందుకే మూడు రోజులు వీకాఫ్ విధానానికి మద్దతు పెరుగుతోంది.

మానసిక వేత్తలు కూడా మూడు రోజులు వీకాఫ్ ఇస్తే మంచిదే అంటున్నారు. ఇండియా లాంటి దేశంలో మెంటల్ స్ట్రెస్ ఎక్కువగా ఉంటుందనీ, అందువల్ల మూడు రోజులు వీకాఫ్ ఉంటే, ఉద్యోగుల్లో టెన్షన్లు తగ్గి... మానసికంగా ఫిట్‌గా ఉంటారని అంటున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి ఉండేందుకు ఎక్కువ సమయం వారికి దొరుకుందని చెబుతున్నారు. ఐతే... వీకాఫ్ వచ్చినప్పుడు ఇంట్లోనే ఉండిపోకుండా... ఏదైనా లాంగ్ జర్నీకి వెళ్లడమో, టూరిజం, ఇతరత్రా కొత్త ప్రదేశాలకు వెళ్లి ఎంజాయ్ చేస్తే, ఎక్కువ ఫలితం ఉంటుందంటున్నారు.
Published by: Krishna Kumar N
First published: July 1, 2019, 6:50 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading