అమెరికా మాజీ అధ్యక్షుడు జార్జ్‌బుష్ కన్నమూత

జార్జ్ హెచ్ డబ్ల్యూ బుష్ సీనియర్ అమెరికాకు 41వ అధ్యక్షుడిగా వ్యవహరించారు.

news18-telugu
Updated: December 1, 2018, 11:46 AM IST
అమెరికా మాజీ అధ్యక్షుడు జార్జ్‌బుష్ కన్నమూత
జార్జ్ బుష్ సీనియర్ (Reuters)
  • Share this:
అమెరికా మాజీ అధ్యక్షుడు సీనియర్ జార్జ్‌బుష్ కన్నుమూశారు. ఆయన వయసు 94 సంవత్సరాలు. కొంతకాలంగా అనారోగ్యంతో ఉన్న జార్జ్ బుష్.. శక్రవారం రాత్రి తుదిశ్వాస విడిచారు. అమెరికా 41వ అధ్యక్షుడిగా వ్యవహరించారు జార్జ్‌బుష్. ‘జేబ్, నీల్, మార్విన్, డోరో, నేను.. అందరం బాధపడుతున్నాం. 94 సంవత్సరాల అమోఘమైన సేవలతర్వాత మా నాన్న చనిపోయారు. బెస్ట్ డాడ్‌కి కావాల్సిన అన్ని క్వాలిటీలు ఆయనలో ఉన్నాయి.’ అని మరో మాజీ అధ్యక్షుడు, జూనియర్ జార్జ్ బుష్ తెలిపినట్టు ఆయన అధికార ప్రతినిధి ట్వీట్ చేశారు. ఈ ఏడాది ఏప్రిల్‌లో సీనియర్ జార్జ్ బుష్ భార్య బార్బరా బుష్ చనిపోయారు. వారి పెళ్లయి అప్పటికి 73 సంవత్సరాలు. సీనియర్ జార్జ్ బుష్‌కి ఐదుగురు పిల్లలు, 17 మంది మనవలు, మనవరాళ్లు. జార్జ్ బుష్ అంత్యక్రియలకు సంబంధించిన ఏర్పాట్లపై వివరాలు త్వరలో తెలియజేస్తామని అధికార ప్రతినిధి తెలిపారు.

జార్జ్ బుష్ సీనియర్ మృతిపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంతాపం వ్యక్తం చేశారు. యేల్ బేస్‌బాల్ జట్టులో ఆటగాడి స్థాయి నుంచి నేవీలో అత్యంత పిన్న వయస్కుడిగా రెండో ప్రపంచ యుద్ధంలో పాల్గొన్న ఘనత ఆయనకు దక్కుతుందన్నారు. టెక్సాస్ నుంచి ఎన్నికైన అమెరికన్ కాంగ్రెస్‌కు ఎన్నికైన జార్జ్ బుష్ సీనియర్ ఆ తర్వాత చైనాలో రాయబారిగా పనిచేశారు. సెంట్రల్ ఇంటెలిజెన్స్ డైరెక్టర్‌గా విధులు నిర్వర్తించారు. రొనాల్డ్ రీగన్ ప్రెసిడెంట్‌గా ఉన్నప్పుడు ఎనిమిదేళ్లపాటు వైస్ ప్రెసిడెంట్‌గా సేవలు అందించారు. అనంతరం నాలుగేళ్లు అమెరికా అధ్యక్షుడిగా పనిచేశారు.
ఇవి కూడా చదవండి
Published by: Ashok Kumar Bonepalli
First published: December 1, 2018, 11:14 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading