అమెరికా (America) మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) సంచలన ప్రకటన చేశారు. 2024లో జరగబోయే అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో (US President Elections) పోటీచేస్తానని ప్రకటించారు. అమెరికాకు పూర్వ వైభవం తెచ్చేందుకు, మళ్లీ గొప్పగా నిలిపేందుకు.. వచ్చే అధ్యక్ష ఎన్నికల్లో పోటీచేస్తానని ప్రకటిస్తున్నట్లు అని డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు. 2024లో అమెరికా అధ్యక్ష పదవికి రిపబ్లికన్స్ పార్టీ తరపున ట్రంప్ పోటీ చేస్తున్నట్లు ఫెడరల్ ఎలక్షన్ కమిషన్‌లో ట్రంప్ మద్దతుదారులు పత్రాలను దాఖలు చేశారు. ట్రంప్ రాజకీయ సంస్థల కోసం పనిచేసిన బ్రాడ్లీ క్రేట్.. US ఫెడరల్ ఎలక్షన్ కమిషన్‌లో పేపర్ వర్క్‌ని పూర్తి చేశారు. అలాగే డొనాల్డ్ ట్రంప్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఫండ్ రైజింగ్ ఖాతాను కూడా ఏర్పాటు చేయబోతున్నారని చెప్పారు. ట్రంప్ సలహాదారు జాసన్ మిల్లర్ రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిగా బరిలోకి దిగబోతున్నారని వార్తలొచ్చాయి. కానీ అనూహ్యంగా తానే పోటీ చేస్తున్నట్లు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించుకున్నారు.
Former US President Donald Trump announces his bid for the 2024 presidency post "In order to make America great and glorious again, I am tonight announcing my candidacy for President of the United States," he says pic.twitter.com/JQeTFHmVpR
— ANI (@ANI) November 16, 2022
కాగా, డొనాల్డ్ ట్రంప్ గతంలో అమెరికా అధ్యక్షుడిగా పనిచేసిన విషయం తెలిసిందే. 2016లో జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఆయన విజయం సాధించారు. డెమోక్రటిక్ పార్టీ నేత హిల్లరీ క్లింటన్‌పై ఆయన గెలిచారు. అనంతరం 2017, జనవరి 20 నుంచి 2012, జనవరి 2020 వరకు అమెరికా అధ్యక్షుడిగా పనిచేశారు. ఐతే 2020 నవంబరులో జరిగిన ఎన్నికల్లో మాత్రం ఓటమి పాలయ్యారు. డొనాల్డ్ ట్రంప్‌పై డెమెక్రాటిక్ పార్టీ నేత జో బైడెన్ విజయం సాధించారు. 2023లో మళ్లీ ఎన్నికలు జరగనున్నాయి. అందుకోసం ఇప్పటి నుంచే సన్నద్ధమవుతున్నారు డొనాల్డ్ ట్రంప్. వచ్చే ఎన్నికల్లో పోటీచేస్తుననట్లు ప్రకటించి..నేటి నుంచే ప్రచారానికి శ్రీకారం చుట్టారు.
అమెరికాలో ఇటీవల మధ్యంతర ఎన్నికలు జరిగాయి. ఆ ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీపై డమోక్రటిక్ పార్టీ పైచేయి సాధించింది. ఎన్నికల్లో ఓటమికి ట్రంప్ కారణమని.. ఆ పార్టీలోని నేతలు విమర్శిస్తున్నారు. ఐనప్పటికీ..తగ్గేదేలే అన్నట్లుగా వచ్చే ఎన్నికల్లో పోటీచేస్తున్నట్లు ప్రకటించారు ట్రంప్. ఇక మధ్యంతర ఎన్నికలకు ముందు నిర్వహించిన ఓ సర్వేలో ఆసక్తికరమైన ఫలితాలు వచ్చాయి. అమెరికాలో 53శాతం మంది ట్రంప్ అంటే ఇష్ట లేదని తేలింది. అంతేకాదు రిపబ్లికన్ పార్టీలో కూడా ప్రతి నలుగురులో ఒకరికి ట్రంప్‌పై వ్యతిరేకత ఉంది. అంతేకాదు అమెరికా అధ్యక్ష పదవికి జో బైడెన్‌ను కూడా సరైన వ్యక్తిగా అక్కడి ప్రజలు భావించడం లేదు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: America, Donald trump, Us news, USA