ఇటీవల సోషల్ మీడియా ఫేక్ వార్తలకు వేధికగా మారింది. జాతీయ, అంతర్జాతీయ అంశాలపై సైతం కొందరు దొంగ వార్తలను తయారు చేసి సోషల్ మీడియాలో ఉంచుతున్నారు. ఆసక్తి కలిగించిన అమెరికా ఎన్నికల్లో జో బిడెన్ అగ్రరాజ్యం అధ్యక్షుడిగా ఎన్నికైన విషయం తెలిసిందే. వచ్చే ఏడాది జనవరి 20న ఆయన అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అయితే ఈ ప్రమాణ స్వీకర కార్యక్రమానికి భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ హాజరు కానున్నారన్న వార్త సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. తమ నాయకుడికి అరుదైన గౌరవం దక్కిందని కొందరు కాంగ్రెస్ నేతలు గర్వంగా చెప్పుకున్నారు.
అయితే మన్మోహన్ కు అందిన ఈ ఆహ్వానం వార్తను పరిశీలిస్తే అది అవాస్తవమని తెలుస్తోంది. ఇప్పటివరకు ఇలాంటి ఆహ్వానమేదీ మన్మోహన్ కు అందలేదని ఆయన కార్యాలయ వర్గాలు తెలిపాయి. దీన్ని బట్టి సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం అవాస్తవమన్న విషయం అర్థమవుతోంది. అయితే అధ్యక్ష ప్రమాణ స్వీకరంలో వేధికపై ఇతర దేశాలకు చెందిన ప్రముఖులు ఉండే అవకాశంపై ఇంకా చర్చించలేదని అమెరికా అధికార వర్గాలు తెలిపాయి. ఈ అంశాల ఆధారంగా మాజీ ప్రధాని మన్మోహన్ కు బిడెన్ ప్రమాణ స్వీకారానికి హాజరయ్యే అవకాశం లేదని తెలుస్తోంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Fact Check, Joe Biden, Manmohan singh