పాకిస్థాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ పరిస్థితి విషమం...ఆందోళనలో పార్టీ శ్రేణులు

రక్తంలో ప్లేట్‌లెట్‌ల సంఖ్య భారీగా పడటంతో నవాజ్ షరీఫ్‌ను ఆసుపత్రికి తరలించినట్లు తెలుస్తోంది. డెంగ్యూ జ్వరం సోకిందని మొదట భావించినప్పటికీ, రక్త పరీక్షల్లో డెంగ్యూ జ్వరం లేనట్లు తేలింది.

news18-telugu
Updated: October 22, 2019, 3:55 PM IST
పాకిస్థాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ పరిస్థితి విషమం...ఆందోళనలో పార్టీ శ్రేణులు
నవాజ్ షరీఫ్ (File)
  • Share this:
పాకిస్తాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్‌ తీవ్ర అస్వస్థతకు గురై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. రక్తంలో ప్లేట్‌లెట్‌ల సంఖ్య భారీగా పడటంతో ఆయనను ఆసుపత్రికి తరలించినట్లు తెలుస్తోంది. డెంగ్యూ జ్వరం సోకిందని మొదట భావించినప్పటికీ, రక్త పరీక్షల్లో డెంగ్యూ జ్వరం లేనట్లు తేలింది. నవాజ్ షరీఫ్ తాజా ఆరోగ్య పరిస్థితిపై ఆయన వ్యక్తిగత వైద్యుడు అద్నాన్ ఖాన్ స్పందించారు. నవాజ్ షరీఫ్ ప్లేట్‌లెట్ కౌంట్ భారీగా పడిపోయిందని అయితే దీనికి కారణం గతంలోని అనారోగ్య కారణాల వల్లనే ఈ సమస్య తలెత్తిందని ఆయన తెలిపారు. లాహోర్‌‌లోని ప్రముఖ ఆసుపత్రిలో నవాజ్ షరీఫ్‌కు చికిత్స అందిస్తున్నారు. ప్రత్యేక వైద్యుల బృందం ఆయనను పర్యవేక్షిస్తోంది. ప్రస్తుతం షరీఫ్ ఆరోగ్యం పరిస్థితి నిలకడగానే ఉందని వైద్యులు వెల్లడించారు. ఇదిలా ఉంటే నవాజ్ షరీఫ్ ఓ అవినీతి కేసులో పోలీసు కస్టడీలో ఉన్నారు. ప్రస్తుతం ఆయన బెయిల్ పై విడుదలై ఉన్నారు.

First published: October 22, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>