పాక్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్‌కు సతీవియోగం

ప్రస్తుతం అక్రమాస్తుల కేసులో నవాజ్ షరీఫ్, ఆయన కుమార్తె పాకిస్థాన్‌లో జైలు శిక్షను అనుభవిస్తున్నారు.

news18-telugu
Updated: September 11, 2018, 5:24 PM IST
పాక్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్‌కు సతీవియోగం
పాక్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ సతీమణి కుల్సూమ్ నవాజ్ షరీఫ్(ఫైల్ ఫోటో)
  • Share this:
పాకిస్థాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్‌కు సతీవియోగం కలిగింది. దీర్ఘకాల వ్యాధితో బాధపడుతూ నవాజ్ షరీఫ్ సతీమణి కుల్సూమ్ నవాజ్ లండన్‌లో కన్నుమూశారు. ఆమె వయస్సు 68 ఏళ్లు. దీర్ఘకాల వ్యాధితో ఆమె 2014 జూన్ నుంచి లండన్‌లోని హార్లీ స్ట్రీట్ క్లినిక్‌లో చికిత్స పొందుతూ వచ్చారు. ఆమెకు గొంతు క్యాన్సర్ సోకినట్లు 2017 ఆగస్టులో  వైద్య పరీక్షల్లో నిర్ధారణ అయ్యింది.

గత కొంత కాలంగా ఆమె ఆరోగ్యం క్రమంగా క్షీణిస్తూ వచ్చింది. మరింత విషమంగా మారడంతో మంగళవారం ఉదయం నుంచి ఆమెకు కృత్రిమ శ్వాసను సమకూర్చుతూ వచ్చారు. చికిత్సా ఫలితం లేకుండా ఆమె లండన్‌లో మంగళవారం తుదిశ్వాస విడిచినట్లు పాకిస్థాన్ ముస్లీం లీగ్-నవాజ్ అధ్యక్షుడు షెబాజ్ షరీఫ్ వెల్లడించారు.

నవాజ్ షరీఫ్, ఆయన కుమార్తె ప్రస్తుతం అక్రమాస్తుల కేసులో పాకిస్థాన్‌లో జైలు శిక్షను అనుభవిస్తున్నారు. కుల్సూమ్ నవాజ్‌ను నవాజ్ షరీఫ్ 1971 ఏప్రిల్‌లో వివాహం చేసుకున్నారు.

First published: September 11, 2018
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు