Imran Khan Lauded India : భారత్ పై మరోసారి ప్రశంసలు కురిపించారు పాకిస్తాన్(Pakistan)మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్(Imran Khan).శనివారం భారత ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ ధరలపై భారీగా ఎక్సైజ్ పన్ను తగ్గించిన విషయం తెలిసిందే. పెట్రోల్, డీజిల్‌పై పన్ను తగ్గిస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. దీంతో దేశవ్యాప్తంగా పెట్రోలు, డీజిల్ ధరలు(Oil Prices)తగ్గాయి. ఈక్రమంలోనే మరోసారి భారత్‌ను పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ప్రశంసించారు. పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గిస్తూ నిర్ణయం తీసుకోవడమే కాకుండా.. రష్యా చమురును తగ్గింపు రేటుతో కొనుగోలుచేయాలనే భారత దేశ నిర్ణయాన్ని ఇమ్రాన్ ఖాన్ పొగిడారు. క్వాడ్‌లో భారత్ సభ్య దేశం అయినప్పటికీ అమెరికా సహా అగ్ర దేశాల నుంచి ఒత్తిడి ఉన్నా..రష్యా నుంచి చమురును రాయితీతో దిగుమతి చేసుకోగలిగిందని ప్రశంసించారు. స్వతంత్ర విదేశాంగ విధానంతో భారత్ ముందుకు వెళ్తోందన్నారు.
క్వాడ్‌లో భారత్ సభ్య దేశం అయినప్పటికీ అమెరికా ఒత్తిడిని తట్టుకుని ప్రజలకు ఉపశమనం కలిగించేందుకు రష్యా నుంచి చమురును రాయితీతో దిగుమతి చేసింది. భారత్ స్వతంత్ర విదేశాంగ విధానంలో పనిచేస్తోంది అని ఇమ్రాన్ ట్వీట్‌లో పేర్కొన్నారు. కాగా గతంలో పాకిస్థాన్‌లో తమ ప్రభుత్వం కూడా ఇలాగే ప్రజల ప్రయోజనాల కోసమే కృషి చేసిందని ప్రస్తావించారు. ఇమ్రాన్ ఖాన్ పేర్కొన్నారు. ఇదే సందర్భంంలో ప్రస్తుతం ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. ప్రస్తుతం ఆర్థిక వ్యవస్థ తల లేని కోడిలా నడుస్తోందని విమర్శించారు.షెహబాబ్ షరీఫ్ ప్రభుత్వంలోని కొందరూ ఇతరులకు లొంగిపోయారని మండిపడ్డారు.
ALSO READ Trending: పాకిస్థాన్‌లోనూ శ్రీలంక కష్టాలు.. దేశం ముందు 3 మార్గాలు.. లాక్‌డౌన్ పెట్టబోతున్నారా ?
పాకిస్థాన్ ముస్లిం లీగ్ నేతృత్వంలోని ప్రభుత్వం వల్ల పాకిస్థాన్ ఆర్థిక వ్యవస్థ దెబ్బతిందని ఇమ్రాన్ ఖాన్ మండిపడ్డారు.షెహబాజ్ షరీఫ్ ప్రభుత్వంలోని మీర్ జాఫర్లు, మీర్ సాదిక్‌లు బాహ్య దేశాల బలవంతపు ఒత్తిళ్లకు తలొగ్గుతున్నారని విమర్శించారు. కాగా అంతకముందు కూడా ఇమ్రాన్ ఖాన్ భారత్‌ను పలుమార్లు ప్రశంసించారు. భారత్‌ను ఏ దేశం శాసించలేదని, అక్కడి రాజకీయాల్లోనూ బయటి శక్తుల జోక్యం ఉండదన్నారు. భారత్‌కు తమ దేశ ప్రజల సంక్షేమమే ముఖ్యమని వ్యాఖ్యానించారు. రష్యా-ఉక్రెయిన్ యుద్ధ సమయంలోనూ భారత్ తెలివిగా వ్యవహరించిందన్నారు. అగ్ర రాజ్యాలు సైతం ఏమి అనలేకపోయాయన్నారు. భారతీయుల్లో విపరీతమైన ఆత్మగౌరవం ఉంటుందన్నారు. దీనిపై అప్పట్లో పెను దుమారం రేగింది. ఇమ్రాన్ ఖాన్ వ్యాఖ్యలపై పాక్ నేతలు మండిపడ్డారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Imran khan, India, Oil prices, Pakistan