పలుమార్లు అరెస్ట్ చేసిన పోలీసు ప్రాణాలు నిలబెట్టిన మహిళ..

news18-telugu
Updated: September 14, 2020, 8:55 AM IST
పలుమార్లు అరెస్ట్ చేసిన పోలీసు ప్రాణాలు నిలబెట్టిన మహిళ..
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
గతాన్ని మనసులో పెట్టుకోకుండా.. ఓ మహిళ నిండు ప్రాణాన్ని కాపాడింది. ఎనిమిదేళ్ల కిందట తనను పలుమార్లు అరెస్ట్ చేసిన పోలీసులకు కిడ్నీ దానం చేసి అతని ప్రాణం నిలబెట్టింది. వివరాలు.. అలబామాకు చెందిన జోసెలిన్ జేమ్స్ చాలా కాలంగా డ్రగ్స్‌కు బానిసగా ఉంది. డ్రగ్స్ వాడకంలో 2007-2012 మధ్య కాలంలో ఆమె 16 సార్లు అరెస్ట్ అయింది. పలుమార్లు జైలుకు కూడా వెళ్లింది. ఆమెను అరెస్ట్ చేసిన అధికారుల్లో టెర్రెల్ పాటర్ కూడా ఉన్నారు. ఆయన ఒకటి కంటే ఎక్కువ సార్లు జోసెలిన్‌ను అరెస్ట్ చేశాడు. ఆ తర్వాత జరిగిన పరిణామాల్లో కొన్నేళ్ల నుంచి ఆమె డ్రగ్స్‌కు దూరంగా ఉంటున్నారు.

అయితే 2019 డిసెంబర్‌లో గతంలో తనను పలుమార్లు అరెస్ట్ చేసి పాటర్ అనారోగ్యంతో బాధపడుతున్నాడని.. అతని కిడ్నీ ట్రాన్స్‌ప్లాంట్ చేయాల్సి ఉందని జోసెలిన్‌కు తెలిసింది. ప్రస్తుతం రిటైర్డ్ అయిన ఆ అధికారికి కిడ్నీ దానం చేసేందుకు.. ఆమె ముందుకు వచ్చింది. వెంటనే పాటర్ కూతరు కాంటాక్ట్ అయి.. కిడ్నీ దానం చేసి అతని ప్రాణం నిలబెట్టింది. జూలై 21న విజయవంతంగా కిడ్నీ మార్పిడి చికిత్స జరగగా.. పాటర్ ప్రసత్తం పూర్తిగా కోలుకుని ఆరోగ్యంగా ఉన్నాడు.
Published by: Sumanth Kanukula
First published: September 14, 2020, 8:55 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading