హోమ్ /వార్తలు /అంతర్జాతీయం /

Afghanistan:దేశానికి ఐటీ మంత్రి..ఇప్పుడు పిజ్జా డెలివరీ బాయ్..తలకిందులైన జీవితం..ఎందుకిలా?

Afghanistan:దేశానికి ఐటీ మంత్రి..ఇప్పుడు పిజ్జా డెలివరీ బాయ్..తలకిందులైన జీవితం..ఎందుకిలా?

 సయ్యద్ అహ్మద్ షా సాదత్ (Image: Al Jazeera)

సయ్యద్ అహ్మద్ షా సాదత్ (Image: Al Jazeera)

Afghanistan: దేశానికి ఐటీ మంత్రిగా పనిచేసిన నాయకుడు.. ఇప్పుడు పిజ్జా డెలివరీ బాయ్‌గా మారారు. ఉన్నత పదవుల్లో పనిచేసిన ఆయనకు ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది? తాలిబన్ల (Taliban)కు భయపడే దేశం విడిచి వెళ్లిపోయారా?

జీవితం ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియదు. కొన్ని రోజులు సుఖ పడితే.. మరికొన్నాళ్లు కష్టాలు వస్తాయి. ఓడలు బండ్లు అవుతాయి. బండ్లు ఓడలు అవుతాయి.  సాధారణ ప్రజలకు మాత్రమే కాదు.. పెద్ద పెద్ద పదవుల్లో ఉన్న అధ్యక్షులు, మంత్రులకు కూడా ఇది వర్తిస్తుంది. అందుకు ఈయనే ప్రత్యక్ష ఉదాహరణ. పక్కన ఫొటోల్లో కనిపిస్తున్న ఈయన పేరు సయ్యద్ అహ్మద్ షా సాదత్. ప్రస్తుతం జర్మనీలో నివసిస్తూ పిజ్జా డెలివరీ బాయ్‌గా పనిచేస్తున్నారు. ఇప్పుడైతే లీప్‌జిత్ నగర వీధుల్లో డెలివరీ బాయ్‌గా పనిచేస్తున్నారు గానీ.. ఒకప్పుడు ఈయన అప్ఘానిస్తాన్ ఐటీ మంత్రిగా పనిచేశారు. 2018 వరకు ఆ పదవిలో ఉన్నారు. దేశంలో ఐటీ రంగ  అభివృద్ధికి, టెలికం సేవల విస్తరణకు ఎంతో కృషి చేస్తారు. మరి అలాంటి నేతకు ఇలాంటి దుస్థితి ఎందుకు? మంత్రిగా పనిచేసిన ఆయన ఇప్పుడు డెలివరీ బాయ్‌గా ఎందుకు మారాల్సి వచ్చింది?

2018లో అప్ఘానిస్తాన్‌లో తాలిబాన్ల అజెండాను చూసి సయ్యద్ అహ్మద్ షా సాదత్ భయపడిపోయారు. అంతేకాదు దేశాధ్యక్షుడు అష్రఫ్ ఘనీతో విబేధాలు తలెత్తాయి. ఈ క్రమంలోనే మంత్రి పదవికి రాజీనామా చేసి జర్మనీకి వెళ్లిపోయారు. అప్పటి నుంచి అక్కడే ఉంటున్నారు. జర్మనీలో ఎన్నీ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్నారు. కానీ అనుకున్న ఉద్యోగం ఒక్కటీ రాలేదు. మరోవైపు కుటుంబ ఆర్థిక పరిస్థితి బాగాలేదు. చేతిలో చిల్లి గవ్వ లేదు. చివరకు దిక్కు తోచని స్థితిలో.. కుటుంబాన్ని పోషించుకునేందుకు.. పిజ్జా డెలివరీ బాయ్‌గా మారారు సాదత్.

Exclusive |పాకిస్తాన్, అమెరికా వల్లే ఈ దుస్థితి..CNN-News18తో అప్గాన్ తాత్కాలిక అధ్యక్షుడు

సయ్యద్ అహ్మద్ షా సాదత్ ఓ అంతర్జాతీయ మీడియాతో మాట్లాడతూ... ‘'ప్రస్తుతం జర్మనీలో లీప్ జిగ్‌లో నా ఫ్యామిలీతో కలిసి సంతోషంగా నివసిస్తున్నా. ప్రస్తుతం క్షేమంగానే ఉన్నా. ఉన్నంతలో ఆనందంగా..  చాలా సింపుల్‌గా బతుకుతున్నాం. పిజ్జా డెలివరీ ద్వారా వచ్చిన డబ్బును వృథా చేయడం లేదు. ఇక్కడే ఉంటూ.. జర్మనీ కోర్స్‌ చేస్తూ చదువుకోవాలని భావిస్తున్నా.  చాలా ఉద్యోగాలకు దరఖాస్తు చేశా.  కానీ ఏదీ రాలేదు. అందుకే పిజ్జాలు అమ్ముతున్నా. ఎలాగైనా సరే టెలికాం కంపెనీలో పనిచేయాలన్నదే నా కోరిక. ఆ లక్ష్యాన్ని ఖచ్చితంగా చేరుకుంటా. '' అని పేర్కొన్నారు’’

Pandemic Alert: కరోనా వైరస్‌ కంటే మరో తీవ్రమైన వైరస్‌ పొంచి ఉందా..?

సయ్యద్‌ అహ్మద్ ఏదో సాదా సీదా చదువు చదవలేదు. ఉన్నత విద్యావంతుడు. ప్రపంచ ప్రఖ్యాతవిశ్వవిద్యాలయాల్లో ఒకటైన ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీ నుంచి ఎలక్ట్రానిక్‌ ఇంజినీరింగ్‌లో మాస్టర్స్ చేశారు. దానితో పాటు పాటు కమ్యూనినికేషన్‌ డిగ్రీ కూడా పొందారు. 13 దేశాల్లో కమ్యూనికేషన్‌ విభాగంలో 23 ఏళ్ల పాటు పనిచేసిన అనుభవం ఉంది. కానీ జర్మనీలో పరిస్థితులు అనుకూలించలేదు. మంచి ఉద్యోగం కోసం ఎంత కష్టపడినా.. రాలేదు. పరిస్థితుల దృష్ట్యా ఆయన జీవితం ఇలా తలకిందులయింది. అందుకే పిజ్జా డెలివరీ బాయ్‌గా పనిచేస్తున్నారు.

Heather: కర్వీ ఫిగర్‌తో కోట్లు సంపాదిస్తోంది.. కానీ ఒక్కటే సమస్య!

కాగా, అప్ఘానిస్తాన్‌ను తాలిబన్లు ఆక్రమించుకున్న విషయం తెలిసిందే. ఆగస్టు 15న తాలిబన్లు దేశ రాజధాని కాబూల్‌లోకి ప్రవేశించిన వెంటనే.. దేశాధ్యక్షుడు అష్రఫ్ ఘనీ అప్ఘాన్ విడిచి పారిపోయారు. ప్రస్తుతం యూఏఈలో తలదాచుకుంటున్నారు. తాలిబన్ల రాక.. అష్రఫ్ ఘనీ పరారీతో .. అప్ఘానిస్తాన‌లో పరిస్థితులు దారుణంగా మారాయి. తాలిబన్ల రాక్షస పాలనను తలచుకొని.. చాలా మంది పౌరులు దేశం విడిచి వెళ్లిపోతున్నారు. భారత్, అమెరికా, కెనడా, యూకే సహా పలు దేశాలకు శరణార్థులుగా తరలి వెళ్తున్నారు. కాబూల్ ఎయిర్‌పోర్టు నుంచి ఇప్పటికీ అప్ఘన్ పౌరుల తరలింపు కొనసాగుతోంది.

First published:

Tags: Afghanistan, Germany, Kabul, Pizza, Taliban

ఉత్తమ కథలు