• HOME
  • »
  • NEWS
  • »
  • INTERNATIONAL
  • »
  • FORMER ADIDAS OWNER BERNARD TAUPIE AND HIS WIFE BEATEN BY ROBBERS IN THE LATE NIGHT BURGLARY AT THEIR HOME GH SRD

భార్యభర్తలిద్దరిపై దాడిచేసి దోపిడీకి పాల్పడ్డ దొంగలు..ఆ ఇల్లు ఎవరిదో తెలిస్తే షాకవుతారు..

భార్యభర్తలిద్దరిపై దాడిచేసి దోపిడీకి పాల్పడ్డ దొంగలు..ఆ ఇల్లు ఎవరిదో తెలిస్తే షాకవుతారు..

ప్రతీకాత్మక చిత్రం

ఓ ఇంట్లోకి దొంగలు చొరబడ్డారు. ఆ ఇంట్లో ఉంటున్న భార్యభర్తలిద్దర్ని తాళ్లతో బంధించి.. వారిపై తీవ్రంగా దాడి చేసి అందిన కాడికి మొత్తం దోచేసుకున్నారు. ఇది మాములు వార్తే కదా అనుకుంటే పొరపాటే.. ఈ దొంగతనం జరిగింది మాములు వ్యక్తి ఇంట్లో కాదు. అసలు ఈ కథేంటో తెలుసుకోవాలంటే ఇది చదవాల్సిందే..

  • Share this:
సాధారణంగా వ్యాపారవేత్తలు, మాజీ మంత్రుల ఇళ్లలో కఠినమైన భద్రత ఉంటుంది. పాశ్చాత్య దేశాల్లో ఇలాంటి ప్రముఖుల ఇళ్లలో దొంగతనాలు జరగడం చాలా అరుదు. కానీ ఫ్రాన్స్‌కు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త, నటుడు, మాజీ మంత్రి, అడిడాస్ (Adidas) షూ కంపెనీ మాజీ యజమాని బెర్నార్డ్ తాపీ (Bernard Taupie) ఇంటిని దొంగలు దోచుకున్నారు. బెర్నార్డ్ , అతడి భార్య డొమిన్ క్యూ లపై దాడి చేయడంతో పాటు.. వారి కాళ్లు, చేతులు కట్టేసి మరీ చోరీకి పాల్పడ్డారు. ఈ ఘటన ఆదివారం జరిగింది. బెర్నార్డ్ దంపతులు పారిస్ సమీపంలోని కాంబ్స్-లా-విల్లేలో ఉంటున్నారు. ఆదివారం తెల్లవారుజామున నలుగురు వ్యక్తులు వీరి ఇంట్లోకి చొరబడ్డారు. వారిని దారుణంగా కొట్టి విద్యుత్ వైర్లతో కట్టేశారు. అనంతరం అందినంత దోచుకొని పారిపోయారు. ఆ తరువాత ఎలాగోలా కట్లు విప్పుకున్న డొమిన్‌క్యూ స్థానికుల సహాయంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు.బెర్నార్డ్ తలకు గాయాలు అయినట్లు పోలీసులు తెలిపారు. అతడు హాస్పిటల్‌లో చికిత్స తీసుకోవడానికి నిరాకరించాడని చెప్పారు. స్వల్పంగా గాయపడిన డొమిన్‌క్యూ తాపీని ఆస్పత్రికి తరలించారు. బెర్నార్డ్ గతంలో ఫ్రాన్స్‌ ప్రభుత్వంలో మంత్రిగా కూడా పనిచేశారు. ఈ దోపిడీ విలువ ఎంత మొత్తంలో ఉంటుందనే వివరాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

* ఎన్నో వివాదాలు
బెర్నార్డ్ స్పోర్ట్స్, మీడియా రంగంలో అడుగుపెట్టి ఉన్నత స్థాయికి చేరుకున్నారు. 1992లో ఫ్రాంకోస్ మిటర్రాండ్ ప్రభుత్వంలో పట్టణ వ్యవహారాల శాఖ మంత్రిగా పనిచేశారు. తక్కువ సమయంలోనే కోట్ల విలువైన సంపదను సృష్టించారు. కెరీర్ ప్రారంభంలో నష్టాల్లో ఉన్న, మూతపడిన కంపెనీలను కొని, వాటి ద్వారా లాభాలను ఆర్జించారు. విలాసవంతంగా జీవించడం ఆయనకు అలవాటు. బెర్నార్డ్‌కు సొంతంగా ఒక 72 మీటర్ల పొడవైన పడవ (yacht), ఒక ఫుట్ బాల్ క్లబ్ ఉండేవి. కానీ క్రమంగా ఆయన ఎన్నో వివాదాల్లో చిక్కుకున్నారు. వివిధ ఆరోపణలపై న్యాయ విచారణను సైతం ఎదుర్కొన్నారు. లంచాలు, ట్యాక్స్ ఎగవేతకు సంబంధించిన కేసులో ఐదు నెలల పాటు జైల్లో గడిపారు. ఆ తరువాత ఫ్రాన్స్‌లో ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆయన్ను అనర్హుడిగా ప్రకటించారు.

అడిడాస్ మాజీ ఓనర్ బెర్నాడ్ తాపీ (Photo Source : Twitter)


కొన్నేళ్ల క్రితం బెర్నార్డ్ మీడియా రంగంలోకి అడుగు పెట్టారు. కొన్ని రేడియో, టీవీ కార్యక్రమాల్లో కూడా పాల్గొన్నారు. ఇటీవల ఆయన క్యాన్సర్ బారిన పడ్డారు. ఇప్పటికీ కొన్ని కేసుల విచారణలో భాగంగా కోర్టులకు వెళ్తున్నారు. ఫ్రాన్స్‌ ఫుట్‌బాల్ లీగ్‌లో మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలు, ఒక ఫ్రెంచ్ గవర్నమెంట్ ఆర్బిట్రేషన్ ప్యానెల్ ద్వారా 400 మిలియన్ యూరోలను సెటిల్మెంట్‌గా పొందడం వంటి ఆరోపణలు ఆయనకు అపఖ్యాతి తీసుకువచ్చాయి.
Published by:Sridhar Reddy
First published:

అగ్ర కథనాలు