• Home
  • »
  • News
  • »
  • international
  • »
  • FOR THE WOMEN AND BY THE WOMEN LADIES BUILD CITY IN VIENNA AIMS TO CREATE SPACE FOR ITS WOMEN BA GH

Women Build the City: ఇది మహిళల కోసం మహిళలతో నిర్మిస్తున్న నగరం.. ఎక్కడో చూడండి

వియన్నాలో మహిళలు నిర్మించే నగరం (Image: @loopdiloop/Twitter)

ఆస్ట్రియా రాజధాని అయిన వియన్నా శివారు ప్రాంతంలో ఈ పట్టణాన్ని అభివృద్ధి చేస్తోంది. మహిళా ఆర్కిటెక్టులు, డిజైనర్లు ఈ ప్రాజెక్టును ముందుకు నడిపిస్తున్నారు. కొత్త ఏర్పాటు చేస్తున్న ఈ సీస్టాడ్ట్ జిల్లా(Seestadt district)ను 2012 నుంచి అభివృద్ధి చేస్తోంది అక్కడి ప్రభుత్వం.

  • Share this:
మహిళలు సాధికారిత సాధించాలి.. వారికి అవకాశాలు కల్పించాలని నేతలు గొప్పగా ప్రసంగాలు ఇస్తారు. కానీ వాస్తవం మాత్రం మరోలా ఉంటుంది. చాలా రంగాల్లో ఇంకా మహిళలు వెనుకబడే ఉన్నారు. ఈ విషయంపైనే దృష్టిపెట్టింది ఆస్ట్రియా దేశం. వియన్నాలోని ఓ విజనరీ ప్రాజెక్టును మహిళలతో, మహిళల కోసం రూపకల్పన చేయాలని తలపెట్టింది. ఆస్ట్రియా రాజధాని అయిన వియన్నా శివారు ప్రాంతంలో ఈ పట్టణాన్ని అభివృద్ధి చేస్తోంది. మహిళా ఆర్కిటెక్టులు, డిజైనర్లు ఈ ప్రాజెక్టును ముందుకు నడిపిస్తున్నారు. కొత్త ఏర్పాటు చేస్తున్న ఈ సీస్టాడ్ట్ జిల్లా(Seestadt district)ను 2012 నుంచి అభివృద్ధి చేస్తోంది అక్కడి ప్రభుత్వం.

ప్రస్తుతం ఈ పట్టణం జనాభా 8300గా నమోదైంది. 2030 నాటికి జనాభాను 20 వేలకు పెంచాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఇక్కడ 'మహిళలు పట్టణాన్ని నిర్మిస్తున్నారు' అనే అక్షరాలు హోర్డింగులపై కనిపిస్తాయి. పట్టణ రూపకల్పనలో మహిళల పాత్రపై దృష్టి పెట్టడం ద్వారా సానుకూల వాతావరణాన్ని రూపొందించి ఆస్ట్రియా ప్రభుత్వం. పట్టణాభివృద్ధి విషయానికి వస్తే తరచూ కీలకమైన నిర్ణయాలు తీసుకునే డెవలపర్లు, బ్యాంకర్లలో ఇప్పటికీ మగవారే ఉన్నారని సబినా రిస్ అనే ఆర్కిటెక్ట్ చెబుతున్నారు. చాలా దేశాల్లో నిర్ణయాత్మక ప్రక్రియలో మహిళలు 5 నుంచి 10 శాతం మధ్యే ఉన్నారని ఆమె అంచనా వేశారు.

వీధుల పేర్లు కూడా మహిళలవే..
పట్టణంలోని భవనాల రూపకల్పనలో మహిళలే భారీగా పాలుపంచుకోవడంతో పాటు వీధులకు కూడా ప్రముఖ స్త్రీల పేర్లను పెడుతున్నారు. ఫిలాసఫర్ హన్నా ఆరెండ్ట్, సింగర్ జానిస్ జోప్లిన్, కథానాయిక పిప్పి లాంగ్ స్టాకింగ్ లాంటి పేర్లు వీధులకు పెట్టారు. అక్టోబరు 15 వరకు మహిళా ఆర్కిటెక్ట్‌లతో ఎగ్జిబిషన్ ను ఏర్పాటు చేశారు సీస్టాడ్ట్ జిల్లా అధికారులు. చాలా దేశాల్లో గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణాలకు వలసలు పెరుగుతున్న విషయంపై ఈ ఎగ్జిబిషన్ లో హైలెట్ చేశారు. 2018లో ఈ హౌసింగ్ విభాగానికి అధిపతిగా కాథ్రిన్ గాల్ వచ్చినప్పటి నుంచి వియన్నా తన విధానాలను రిఫ్రెష్ చేసిందని చెబుతున్నారు ప్రాజెక్టు ఆర్కిటెక్ట్ కార్లా లో.

సురక్షితమైన నగరం..
మహిళల అవసరాలను తీర్చాలనే కోరిక వియన్నా ఆధునిక నగర ప్రణాళిక కోణాల్లో చూడవచ్చు. ప్రకాశవంతమైన వీధి దీపాలు, క్రీడా వేదికల్లో ఎగ్జిట్లతో పాటు మరుగుదొడ్డి సదుపాయాలు ఏర్పాటు చేశారు. ధరలను తక్కువగా ఉంచడానికి, పిల్లల సంరక్షణ కోసం సహకరించడానికి కుటుంబాలను ప్రోత్సహించడానికి అనే ఫ్లాట్ల మధ్య సాధారణ గదులు వంటి ఆవిష్కరణలు ఇక్కడ ఉన్నాయి. ఎగ్జిబిషన్ లో ప్రపంచవ్యాప్తంగా ఉన్న 18 మంది మహిళా ఆర్కిటెక్టులు, కళాకారులు, అర్బన్ ప్లానర్ల విజయాల గురించి సందర్శకులు తెలుసుకోవచ్చు. వియన్నాలో 92 శాతం వీధులకు పురుషుల పేర్లు పెట్టారని ఈ ఎగ్జిబిషన్ కో-క్యూరేటర్ వోజ్సీచ్ క్జాజా అన్నారు. ఇది చరిత్రను, వర్తమానాన్ని ప్రతిబింబించదని, అందుకే ఇక్కడ మహిళల పేర్లు పెట్టామని స్పష్టం చేశారు.

అర్బన్ ఆర్కిటెక్ట్‌లో స్థానం ఎక్కడ?
ఇతర రంగాల మాదిరిగానే మహిళలు పట్టణాల రూపకల్పనలో చాలా కాలం నుంచి చురుకుగా ఉన్నారు. అయితే పురుషులకు వచ్చే క్రెడిట్, కీర్తి వారికి చాలా అరుదుగా లభిస్తుంది. 1912లో ఆస్ట్రేలియా రాజధాని కాన్ బెర్రా డిజైన్ కోసం నిర్వహించిన అంతర్జాతీయ పోటీలో ఓ గార్డెన్ సిటీ ప్రాజెక్టు విజేతగా నిలిచింది. అమెరికన్ ఆర్కిటెక్ట్ మారియన్ మహోనీ గ్రిఫిన్ అనే మహిళ జ్యూరీని ఆకట్టుకున్నప్పటికీ క్రెడిట్ చాలా వరకు ఆమె భర్తకు దక్కింది.

25 ఏళ్లుగా ప్రిట్జికర్ బహుమతులన్నీ పురుషులకే వస్తుండగా.. మొదటి సారిగా 2004లో ఆంగ్లో-ఇరాకీ ఆర్కిటెక్ట్ జహా హదీద్ ఓహియోలోని సిన్సినాటిలోలో ఆర్ట్ సెంటర్ రూపకల్పనలో ఈ అవార్డు దక్కించుకుంది. ఆ తర్వాత చాలా మంది ఆమెను అనుసరించారు. 2010లో కజుయే సెజిమా, 2017లో కార్మ్ పిగెమ్, 2020లో వైవోన్నె ఫారెల్, షెల్లీ మెక్ నమారా, 2021లో అన్నే లాకటన్ విజేతలుగా నిలిచారు. టెహ్రాన్ లో లీలా ఆర్ఘియన్ సృష్టించిన 270 మీటర్ల పొడవైన పాదచారుల వంతెనను 2014 నాటికి 40 లక్షల మంది ఉపయోగించారు. అప్పటి నుంచి ఆమె అనేక బహుమతులు గెలుచుకున్నారు.
Published by:Ashok Kumar Bonepalli
First published: