హోమ్ /వార్తలు /అంతర్జాతీయం /

Food cancil : సిల్లీ రిజన్... ఐస్‌క్రీం చల్లగా ఉందని ఫుడ్ ఆర్డర్ కాన్సిల్ చేశాడు.. !

Food cancil : సిల్లీ రిజన్... ఐస్‌క్రీం చల్లగా ఉందని ఫుడ్ ఆర్డర్ కాన్సిల్ చేశాడు.. !

ice cream

ice cream

Food cancil : ఆన్‌లైన్‌లో ఫుడ్ ఆర్డర్ చేసిన ఓ వినియోగదారుడు .. మరి సిల్లి రీజన్‌తో ఆ ఫుడ్‌ను కాన్సిల్ చేశాడు.. దీంతో ఆ రెస్టారెంట్ యజమాని దెబ్బకు నిబంధనలు మార్చుకున్నాడు.

  కొద్ది సంవత్సరాలుగా ఆన్‌లైన్‌ వ్యాపారం ప్రపంచవ్యాప్తంగా పాపులర్ అయింది. దీంతో ప్రతి వస్తువును ఆన్‌లైన్‌లో ఆర్డర్ పెట్టి తెప్పించుకోవడం ప్రపంచ దేశాల్లో చాలామందికి అలవాటుగా మారింది. మరి ముఖ్యంగా కోవిడ్ తర్వాత ఆన్‌లైన్ వ్యాపారం మరింత అభివృద్ది చెందింది. దీంతో ఇంటినుండి కదలకుండానే అన్ని వస్తువులు సులభంగా తెచ్చుకుంటున్నారు. ముఖ్యంగా కరోనా తర్వాత ఫుడ్‌కు సంబంధించి వినియోగ దారుడు ఎక్కువగా ఆన్‌లైన్ మీద ఆధారపడుతున్నారు. దీంతో ఆయా కంపనీల మధ్య వినియోగదారులకు గిఫ్టులు,ఆఫర్లు ప్రకటించి వారిని తమవైపు తిప్పుకుంటున్నారు. ఇదంతా బాగానే ఉన్నా... కొంతమంది నిజంగా తమ అవసరాలు వాటి ద్వారా తీర్చుకుంటున్న పరిస్థితి ప్రపంచ వ్యాప్తంగా కొనసాగుతోంది.

  అయితే ఆన్‌లైన్ ఫుడ్‌తో సరఫరాలో ఇటివల పోటి పెరగడంతో... ఆయా సంస్థలు ప్రకటిస్తున్నాయి.. వినియోగదారులకు మంచి సర్వీసు అందించేందుకు ముందుకు వస్తున్నాయి.. ఫుడ్‌కు సంబంధించి కాన్సలేషన్‌తో పాటు బాగా లేకపోయినా దాన్ని వాపస్ తీసుకోవడంతో పాటు వినియోగదారులకు ప్రోత్సహాకంగా మరో కాంప్లిమెంట్ ఫుడ్ సప్లై ( Food suply ) చేయడం లాంటివి చేస్తున్నారు.. అయితే ఈ ఆఫర్లను కొంతమంది వినియోగదారులు తమకు అనుకూలంగా మల్చుకుంటున్నారు. ముఖ్యంగా ఫుడ్‌కు సంబంధించి పలు ఆర్డర్లు పెడుతున్న వినియోగదారులు ప్రతి చిన్న విషయానికే వాటిని రద్దు చేస్తారు. తాము ఊహించినట్టు ఏమాత్రం లేకపోయినా వెంటనే దాన్ని కాన్సిల్ చేసి ఇతర నజరానాలు పొందుతున్నారు. ఇలా చాలా సిల్లి కారణాలకు ఫుడ్‌ను వాపస్ చేయడం కొన్ని దేశాలతోపాటు ప్రాంతాల్లో కామన్‌గా మారింది.

  Revanthreddy : అమర వీరుల స్థూపం నిర్మాణంలో అక్రమాలు... అమరుల స్థూపం నిర్మాణం ఆంధ్రా కాంట్రాక్టర్లకు... ? ఆందుకే ఆలస్యం


  ఇలా యూకేలోని ( UK ) ఓల్డ్‌హోమ్ అనే ప్రాంతంలో ఉన్న రేస్టారెంట్ ( Restaurent ) నడుపుతున్నాడు.. ఆ రేస్టారెంట్‌కు ఓ వినియోగదారుడు ఫుడ్‌తో పాటు ఐస్‌క్రీం ( Icecream ) ఆర్డర్ చేశాడు. అయితే వినియోగ దారుడు తాను ఆర్డర్ పెట్టిన ఫుడ్‌లో ఐస్ క్రీం చల్లగా ఉందంటూ ఆ ఫుడ్‌ ఆర్డర్ కాన్సిల్ ( Cancil ) చేశాడు.. మరి ఇంతకి ఐస్ క్రీం చల్లగా ఉండకపోతే ఎలా ఉంటుందనేది ఇక్కడ ప్రశ్న... దీంతో కావాలనే కొంతమంది ఇలా చేస్తుండడాన్ని ఆ యజమాని గమనించాడు.. దీంతో తన రెస్టారెంట్‌లో ఫుడ్ కాన్సిల్ చేయాడానికి కొంత డబ్బులు పెట్టాడు. అది కూడా ఒకవేళ కాన్సిల్ అయిన నెల రోజుల తర్వాత వినియోగదారుడికి డబ్బులు చేరేవిధంగా నిబంధనల్లో పేర్కోన్న పరిస్థితిని కల్పించాడు. దీంతో వినియోగదారులు ఎంత సిల్లి రీజన్స్‌తో రద్దు చేసుకుంటున్నారో అర్థం అవుతుందని పలువురు రెస్టారెంట్స్ యజమానులు వాపోతున్నారు.

  Odisha : సెలవుల కోసం.. నీళ్లలో విషం కలిపిన విద్యార్థి... చివరికి ఇలా అయింది...!


  Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News

  Published by:yveerash yveerash
  First published:

  Tags: Online business, Online food delivery

  ఉత్తమ కథలు