హోమ్ /వార్తలు /అంతర్జాతీయం /

Food Crisis : ఆహార సంక్షోభం అంచున అగ్ర‌దేశం..! నిత్యావ‌స‌ర వ‌స్తువులు నిల్వ చేసుకోవాల‌ని సూచ‌న‌

Food Crisis : ఆహార సంక్షోభం అంచున అగ్ర‌దేశం..! నిత్యావ‌స‌ర వ‌స్తువులు నిల్వ చేసుకోవాల‌ని సూచ‌న‌

ప్ర‌తీకాత్మ‌క చిత్రం

ప్ర‌తీకాత్మ‌క చిత్రం

Food Crisis : అంత‌ర్జాతీయంగా ఆఫ్గ‌నిస్థాన్‌, ఉత్త‌ర కొరియా (North Korea) దేశాల్లో ఇప్ప‌టికే ఆహార సంక్షోభం ఛాయ‌లు క‌లుగుతున్నాయి. అదే బాట‌లో అదిపెద్ద దేశాల్లో ఒక్క‌టైన చైనా (China) కూడా ఆహార సంక్షోభంలోకి వెళ్ల‌నుందా అనే అనుమానం తావెత్తుతోంది. ఆ దేశ ప్ర‌భుత్వం ప్ర‌జ‌ల‌కు చేసి విజ్ఞ‌ప్తి కార‌ణంగా అంత‌ర్జాతీయంగా అనుమానాలు తలెత్తుతున్నాయి.

ఇంకా చదవండి ...

అంత‌ర్జాతీయంగా అఫ్గ‌నిస్థాన్‌(Afghanistan) , ఉత్త‌ర‌కొరియా (North Korea). రెండు దేశాల్లోనూ నిరంకుశ‌ ప్ర‌భుత్వ విధాన‌ల‌తో ఆ దేశాలు ప్ర‌మాద‌క‌ర ప‌రిస్థితుల్లోకి వెళ్తున్నాయి. ఆ దేశాల్లో ఇప్ప‌టికే ఆహార సంక్షోభం ఛాయ‌లు క‌లుగుతున్నాయి. అదే బాట‌లో అదిపెద్ద దేశాల్లో ఒక్క‌టైన చైనా (China) కూడా ఆహార సంక్షోభంలోకి వెళ్ల‌నుందా అనే అనుమానం తావెత్తుతోంది. ఆ దేశ ప్ర‌భుత్వం ప్ర‌జ‌ల‌కు చేసి విజ్ఞ‌ప్తి కార‌ణంగా అంత‌ర్జాతీయంగా అనుమానాలు తలెత్తుతున్నాయి. ఇప్ప‌టికే తాలిబ‌న్ల (Taliban) తిరుగుబాటు.. ప్ర‌భుత్వ ఏర్పాటుతో అఫ్ఘ‌నిస్తాన్లో గంద‌ర‌గోళ ప‌రిస్థితులు నెల‌కొన్నాయి. ఈ నేప‌థ్యంలో అక్క‌డి ప్ర‌భుత్వాన్ని ప్ర‌పంచ దేశాలు గుర్తించ‌డం లేదు. దీంతో ప్రపంచ వ్యా ప్తంగా వివిధ బ్యాంకుల్లో నిల్వ ఉంచిన ఆఫ్ఘ‌నిస్తాన్ డ‌బ్బుల‌ను ఆయా బ్యాంకులు తీసుకొనే హ‌క్కును నిలుపుదల చేశాయి. దీంతో అఫ్ఘ‌న్‌లో ఆర్థిక సంక్షోభం (Financial Crisis) ఏర్ప‌డే ప‌రిస్థితులు క‌లుగుతున్నాయి.

ఇక ఉత్త‌ర కొరియాకు వ‌స్తే నియంత కిమ్‌ జాంగ్‌ ఉన్‌ (Kim Jong un) పాలన లోపాల కార‌ణంగా ఉత్తర కొరియా ప్రస్తతం తీవ్ర ఆహార సంక్షోభంతో కొట్టుమిట్టాడుతోంది. కరోనా మొదలైనప్పుడు ఆ దేశం ప‌లు ఆంక్ష‌ల‌ను విధించింది. వాటిని ఇంకా కొన‌సాగిస్తోంది. సరిహద్దులను మూసి వేసింది.

Squid Game cryptocurrency: "స్క్విడ్‌ గేమ్" క్రిప్టో క‌రెన్సీ పేరుతో భారీ మోసం.. పెట్టుబ‌డిదారుల‌కు రూ.25 కోట్లు టోక‌రా

చైనా చేసిన ప్ర‌క‌ట‌న ఏంటీ..

చైనా (China) లోని కమ్యూనిస్ట్‌ ప్రభుత్వం (Communist Govt) చేసిన హెచ్చరిక, అక్కడి ప్రజలను, అంర్జాతీయ స‌మాజాన్ని ఆందోళనకు, అయోమయానికి గురిచేసింది. ఈ ప్ర‌క‌ట‌న‌తో అంతర్జాతీయంగా పలు అనుమానాలకు తావిస్తోంది. చైనా ప్ర‌భుత్వం ఎన్నడూ లేనివిధంగా, అత్యవసర పరిస్థితుల్లో ఉపయోగించుకునేందుకుగాను నిత్యావసర వస్తువుల (Essential commodities) ను నిల్వ చేసుకోవాలని ప్రజలకు ప్రభుత్వ యంత్రాంగం సూచించింది. ఇది అసాధార‌ణ ప్ర‌క‌ట‌ణ‌గా ప‌లువురు నిపుణులు అభిప్రాయ ప‌డుతున్నారు.

ఆహార సంక్షోభం రానుందా?

చైన ప్ర‌క‌ట‌న‌తో ఆ దేశంలో ఆహార కొరత రానుందా? అనే అనుమానం క‌లుగుతోంది. మ‌రో కోణం కోవిడ్‌ మళ్లీ ప్రబలే అవకాశాలు.. తైవాన్‌ను ఆక్రమించుకునేందుకు చైనా ఆర్మీ ప్రయత్నిస్తోంద‌న్న అనుమానాలు అంత‌ర్జాతీయ స‌మాజాన్ని ఆలోచింపజేస్తున్నాయి. చైనా వాణిజ్యశాఖ  న‌వంబ‌ర్ 1, 2021న ప్రజలకు పలు సూచనలు చేసింది. రాబోయే శీతాకాలంలో ప్రజలందరికీ కూరగాయలు, ఇతర నిత్యావసర వస్తువులను డిమాండ్‌ తగినట్లు అందుబాటు ధరల్లో సరఫరా చేస్తామని ప్రకటించింది. అయితే, అత్యవసర వినియోగ నిమిత్తం కొద్దిపాటి నిత్యావసరాలను నిల్వ ఉంచుకోవాలంటూ ఆ ప్రకటన చివర్లో పేర్కొనడం ప్రజల్లో, ఇటు అంత‌ర్జాతీయ స‌మాజంలో అనుమానాలకు కారణమయింది.

First published:

ఉత్తమ కథలు