FOETUS FOUND INSIDE WOMANS LIVER IN EXTREMELY RARE ECTOPIC PREGNANCY IN CANAD HERE IS WAHAT DR MICHAEL NARVEY DID MKS
shocking : మహిళ కాలేయం(Liver)లో పిండం పెరుగుదల -అత్యంత అరుదైన Pregnancy.. ప్రమాదమా? కాదా?
మహిళ కాలేయంలో పిండాన్ని గుర్తించిన డాక్టర్
కొన్ని సార్లు పిండం.. గర్భాశయానికి బయట ఏర్పడుతుంది. దాన్ని వైద్య పరిభాషలో ఎక్టోపిక్ గర్భం (Ectopic Pregnancy) అంటారు. అయితే, అసాధారణ రీతిలో ఓ మహిళకు కాలేయం(లివర్)లో పిండం పెరగడాన్ని గుర్తించిన డాక్టర్లు షాకయ్యారు. కెనడాలో చోటుచేసుకున్న ఈ ఘటనకు సంబంధించి ఫొటోలు వైరల్ అయ్యాయి..
మానవ మనుగడకు అతి ప్రధానమైన పునరుత్పత్తి ప్రక్రియలో అత్యంత అరుదైన ఘటన ఇది. పునరుత్పత్తి సామర్థ్యం కలిగిన మహిళలు నిర్ణీత వయసు తర్వాత గర్భం దాల్చడం, గర్భాశయంలో పిండం పెరిగి శిశుగా మారడం మనందరికీ తెలిసిందే. కొన్ని సార్లు పిండం.. గర్భాశయానికి బయట ఏర్పడుతుంది. దాన్ని వైద్య పరిభాషలో ఎక్టోపిక్ గర్భం (Ectopic Pregnancy) అంటారు. అయితే, అసాధారణ రీతిలో ఓ మహిళకు కాలేయం(లివర్)లో పిండం పెరగడాన్ని గుర్తించిన డాక్టర్లు షాకయ్యారు. కెనడాలో చోటుచేసుకున్న ఈ ఘటనపై డాక్టర్ల వివరణ, దానికి సంబంధించి ఫొటోలు వైరల్ అయ్యాయి.
ప్రెగ్నెన్సీకి సంబంధించి అత్యంత అరుదైన కేసును కెనడా డాక్టర్లు గుర్తించారు. తూర్పు కెనడాలోని మానిటోబాలో గల చిల్డ్రన్స్ హాస్పిటల్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌కి చెందిన శిశువైద్యుడు డాక్టర్ మైఖేల్ నార్వే ఈ అరుదైన ప్రెగ్నెన్సీని గుర్తించారు. మానిటోబా సిటీకి చెందిన 33 ఏళ్ల మహిళ ఇటీవలే గర్భం దాల్చింది. అయితే ప్రెగ్నెన్సీ ఖరారైన 49 రోజుల తర్వాత ఆమెకు రుతుస్త్రావం అయింది. దీంతో కంగారుగా ఆమె డాక్టర్లను సంప్రదించింది. ఆల్ట్రా స్కాన్ పరీక్షలు నిర్వహించిన డాక్టర్లు.. ఆ మహిళ కాలేయంలో పిండాన్ని గుర్తించారు.
డాక్టర్ మైఖేల్ నార్వే ఈ అరుదైన కేసుకు సంబందించిన వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ‘14 రోజులుగా రుతుస్రావం అవుతుండటంతో ఓ 33 ఏళ్ల మహిళ ఆసుపత్రికి వచ్చారు. 49 రోజుల తర్వాత ఆమెకు రుతుస్రావమైనట్లు చెప్పారు. దీంతో వైద్య పరీక్షలు నిర్వహించగా ఆమె కాలేయంలో పిండాన్ని గుర్తించాం..’అని డాక్టర్ వెల్లడించారు. కొన్ని సార్లు మహిళలకు పొత్తికడుపులో ప్రెగ్నెన్సీ వస్తుంటుందని.. కానీ ఇలా కాలేయంలో ప్రెగ్నెన్సీని చూడటం ఇదే మొదటిసారి ఆయన చెప్పారు.
గర్భాశయంలో కాకుండా ఇతర భాగాల్లో ఏర్పడే ప్రెగ్నెన్సీని ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీగా పేర్కొంటారని, ఫెలోపియన్ ట్యూబ్‌లో అండం, శుక్ర కణంతో కలిశాక ఫలదీకరణం చెందుతుందని.. అక్కడి నుంచి అది గర్భాశయంలోకి కాకుండా ఇతర భాగాల్లోకి చేరడం, లేదా ట్యూబ్‌లోనే ఉండిపోతే దాన్ని ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీగా పరిగణిస్తారని, అయితే, ఈ కేసులో మాత్రం అసాధారణ రీతిలో కాలేయంలో పిండం అభివృద్ధి చెందిందని డాక్టర్ మైఖేల్ తెలిపారు.
మహిళ కాలేయంలో పిండం పెరగడానికి ఏమాత్రం అవకాశం లేదని, తాము గుర్తించే సమయానికే అది చనిపోయి ఉందని, ఆపరేషన్ చేసి చనిపోయిన పిండాన్ని బయటికి తీసి, మహిళ ప్రాణాలు కాపాడామని డాక్టర్ మైఖేల్ చెప్పారు. కెనడా నేషనల్ సెంటర్ ఫర్ బయోటెక్నాలజీ ఇన్ఫర్మేషన్ రికార్డుల ప్రకారం.. 1964-1999 మధ్య 14 ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ కేసుల్లో కాలేయ భాగంలో ప్రెగ్నెన్సీని గుర్తించినట్లు రుజువులున్నాయి. ఇలాంటి కేసుల్లో ప్రెగ్నెన్సీని త్వరగా గుర్తించి తొలగించకపోతే చాలా సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుందని డాక్టర్లు చెబుతున్నారు.
Published by:Madhu Kota
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.