Flying Taxis : ఫ్లైయింగ్ టాక్సీలు... ఫ్యూచర్ వాటిదేనా?

Flying Taxis : ఒకప్పటి ఊహలు ఇప్పుడు వాస్తవాలు. సెల్‌ఫోన్ ఒకప్పుడు ఊహ మాత్రమే ఇప్పుడు అది కామన్. ఫ్లైయింగ్ టాక్సీలు కూడా మొన్నటి వరకూ ఊహల్లోనే ఉండేవి. ఇప్పుడవి నిజంగానే తిరిగేస్తున్నాయి. వాటి విశేషాల్ని అలా అలా తెలుసుకుందాం.

news18-telugu
Updated: October 25, 2019, 9:09 AM IST
Flying Taxis : ఫ్లైయింగ్ టాక్సీలు... ఫ్యూచర్ వాటిదేనా?
ఫ్లైయింగ్ టాక్సీలు... ఫ్యూచర్ వాటిదేనా?
  • Share this:
Singapore Flying Taxis : రోజులు మారిపోతున్నాయ్ బాస్... బైకులు, బస్సుల ప్లేస్‌లో మెట్రో రైళ్లు వచ్చేశాయి. ఇప్పుడు కార్లు గాల్లో ఎగురుకుంటూ వెళ్లిపోతున్నాయి. ఇక ఫ్యూచర్ ట్రాఫిక్ జామ్ ఆకాశంలోనే. సింగపూర్‌కి చెందిన రెండు కంపెనీలు... తమ ఫ్లైయింగ్ టాక్సీలను రంగంలోకి దింపాయి. అవి రివ్వున ఎగురుతూ... అందర్నీ ఆశ్చర్యపరుస్తున్నాయి. నిజానికి ఈ ఫ్లైయింగ్ టాక్సీల ఆలోచన దాదాపు 30 ఏళ్లుగా ఉన్నదే. చిన్న సైజు కారులో గాల్లో ఎగురుతూ వెళ్లాలి. అందుకు తక్కువ ఖర్చు అవ్వాలి. బ్యాటరీ పవర్ ఎక్కువ సేపు రావాలి. ఇలా ఎన్నో కండీషన్లు ఫ్లైయింగ్ కార్ల కాన్సెప్ట్‌కి సవాళ్లుగా నిలిచాయి. కాలం మారుతుంటే... టెక్నాలజీ అప్‌గ్రేడ్ అవుతూ... ఇప్పటికి సైన్స్ ఫిక్షన్ కాస్తా నిజమైపోయింది. పవర్‌ఫుల్ బ్యాటరీలతో, సరికొత్త డిజైన్లలో, తక్కువ ఖర్చులో, ఎక్కువ క్లీన్ అండ్ సైలెంట్ మోడ్‌లో గాల్లో ఎగరేసుకుపోయే ఫ్లైయింగ్ టాక్సీలు వచ్చేశాయి. వచ్చే దశాబ్దాంతానికి ఎయిర్ టాక్సీల అమ్మకాల బిజినెస్ రూ.35వేల కోట్లకు చేరుతుందని అంచనా. 2030 నాటికి ఏటా 20 వేల ఫ్లైయింగ్ కార్లు అమ్ముడవుతాయనే అంచనా ఉంది.


సింగపూర్‌లో ఇంటెలిజెంట్ ట్రాన్స్‌పోర్ట్ సిస్టమ్స్ వరల్డ్ కాంగ్రెస్ అనే సదస్సు జరిగింది. ఇందులో బ్రిటన్‌కి చెందిన స్కైపోర్ట్స్ లిమిటెడ్ తన మోడల్ ఫ్లైయింగ్ టాక్సీ స్టేషన్‌ని ప్రదర్శించింది. అలాగే జర్మనీకి చెందిన వోలోకాప్టర్ GmbH కూడా తన ఎలక్ట్రిక్ వెహికిల్‌ని ప్రదర్శించింది. ఈ రెండు టాక్సీల ఇంజినీర్లూ... అవి ఎలా పనిచేస్తాయో వివరించారు. వీటిలో ప్రయాణించాలనుకునేవారు... యాప్ ఓపెన్ చేసి... ఫలానా సిటీలో ఎక్కడి నుంచీ ఎక్కడికి వెళ్లాలో వివరాలు ఇవ్వాలి. అంతే... ట్రావెలర్ చెప్పిన టైమ్‌కి ఎగురుకుంటూ ఫ్లైయింగ్ టాక్సీ వచ్చేస్తుంది. అది ఎక్కగానే... ఎక్కడికి చేర్చాలో అక్కడికి పైలట్ చేర్తేస్తారు. తక్కువ ఖర్చుతోనే ఈ ఫెసిలిటీ అందుబాటులోకి వస్తుందని ఆ రెండు కంపెనీలూ తెలిపాయి.


ఏదైనా కొత్తగా మొదలుపెడితే అది ప్రజలకు అలవాటు అయ్యేందుకు టైమ్ పడుతుంది కదా. ఫ్లైయింగ్ టాక్సీలను ప్రజలు బాగా అర్థం చేసుకునేందుకు ఇలా ప్రదర్శనలు పెడుతున్నారు. వీటిని చూడటానికి వచ్చిన వారికి వీటి ఉపయోగాల్ని ఇంజినీర్లు వివరిస్తున్నారు. ప్రస్తుతం ఈ రెండు మోడళ్లలో... డ్రైవర్‌తోపాటూ... ఇద్దరు మాత్రమే కూర్చునే వీలుంది. ఈ టాక్సీలో స్లో మోడ్, మీడియం మోడ్, స్పీడ్ మోడ్ అని మూడు రకాల ప్రయాణ వేగాలున్నాయి. ఎవరికి ఎలాంటి వేగం కావాలంటే దాన్ని ఎంచుకోవచ్చు. త్వరగా వెళ్లాలనుకునేవారు స్పీడ్ మోడ్‌ని ఉపయోగించుకోవచ్చు.


ప్లైయింగ్ టాక్సీల్లో ఛార్జీ ప్రస్తుతం కిలోమీటర్‌కి రూ.150 దాకా అవుతుంది. అదే ఏ మెట్రో రైలో ఎక్కితే కిలోమీటర్‌కి రూ.10 లోపే అవుతుంది. అంటే ఛార్జీ అనేది పెద్ద సమస్యే. దీన్ని అధిగమించాలంటే... మరింత తక్కువ ఖర్చులో ప్రయాణించేందుకు వీలుగా ఫ్లైయింగ్ టాక్సీలను డెవలప్ చెయ్యాల్సిందే. 2025 నాటికి కచ్చితంగా తక్కువ ఖర్చులోనే ఫ్లైయింగ్ టాక్సీలను ఎగరేస్తామంటున్నాయి కంపెనీలు. ఉబెర్ కంపెనీ 2023లో లాస్ ఏంజిల్స్, డల్లాస్, మెల్‌బోర్న్‌లో ఫ్లైయింగ్ టాక్సీలను తెస్తామంటోంది.

 

Video : వావ్.. గ్రేట్... ఏనుగును భలే రక్షించారుగా...

ఇవి కూడా చదవండి :

యువతి హత్య కేసులో సంచలన తీర్పు... 16 మందికి మరణశిక్ష

ఆ లారీలో 39 మృతదేహాలు చైనావేనా..? మిస్టరీ వీడినట్లేనా?

కర్తార్‌పూర్ అంటే ఏంటి? ఆ యాత్ర ఎలా చెయ్యాలి? కండీషన్లేంటి?

మార్కెట్లలో దీపావళి వస్తువుల కళకళ... చైనాకు షాక్

ఆర్టీసీ సమ్మె విషయంలో కేసీఆర్ భయపడ్డారా... వ్యూహాత్మకంగా వ్యవహరించారా?
Published by: Krishna Kumar N
First published: October 25, 2019, 9:09 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading