అమ్మో మొసలి.. అసలేం జరిగిదంటే..

పోల్క్ కౌంటీ ప్రాంతంలో కారు గ్యారేజీని నిర్వహిస్తోన్న ఓ మహిళ.. రోజులాగే గ్యారేజీకి వెళ్లి తలుపులు తీయగానే లోపల ఓ మొసలిని(ఎలిగేటర్) చూసి భయపడింది. ఏం చేయాలో అర్థంకాక పోలీసులకు ఫోన్ చేసింది.

news18-telugu
Updated: September 11, 2020, 6:46 PM IST
అమ్మో మొసలి.. అసలేం జరిగిదంటే..
మొసలితో ఫొటోకు పోజుచ్చిన అధికారి
  • Share this:
అమెరికాలో ఫ్లోరిడాలో ఓ మహిళ పోలీసులను బెంబేలెత్తించింది. అక్కడి పోల్క్ కౌంటీ ప్రాంతంలో నివాసముంటున్న ఓ మహిళ స్థానికంగా ఓ కారు గ్యారేజీని నిర్వహిస్తోంది. రోజులాగే గ్యారేజీకి వెళ్లిన ఆమె.. తలుపులు తీయగానే లోపల ఓ మొసలిని(ఎలిగేటర్) చూసి భయపడింది. ఏం చేయాలో అర్థంకాక పోలీసులకు ఫోన్ చేసింది. హుటాహుటిన అక్కడికి చేరుకున్న పోలీసులు అక్కడి దృష్యాన్ని చూసి అవాక్కయ్యారు. ముందు పెద్ద ప్రమాదం ఏమీ లేదని సంతోషించారు. ఆ తరువాత తేరుకుని నవ్వడం వారి వంతయింది. ఎందుకంటే అది నిజమైన మొసలి కాదు. స్విమింగ్ పూల్లో తేలియాడే బెలూన్ వంటి ఫ్లోటింగ్ ఎలిగేటర్ బొమ్మ. ఆ బొమ్మతో కలిసి ఫొటోకు పోజులిచ్చిన ఓ అధికారి ఈ సంఘటనను అధికారిక ట్విటర్ ద్వారా వెల్లడించాడు. ఇప్పడు ఈ సంఘటన సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది.

ఈ ఘటనపై పోల్క్ కౌంటీ పోలీసు అధికారి స్పందించాడు. అధికారిక ట్విట్టర్లో ఫోటోను నకిలీదిగా వివరిస్తూ ఓ పోస్ట్ చేశాడు. ఆ పోలీసు అధికారి నకిలీ ఎలిగేటర్తో పాటు ఇతర పూల్ ఫ్లోటింగ్ బొమ్మలను ఒకేదగ్గర ఉంచి ఫొటో తీశాడు. దీన్ని ట్విట్టర్‌లో పోస్ట్ చేశాడు. చిత్రంతో ఉన్న క్యాప్షన్‌లో.. “ఆఫీసర్ డిప్యూటీ ట్రెక్స్లర్ అత్యవసర కాల్ వచ్చిన తర్వాత గ్యారేజీకి వెళ్లాడు… చూశాడు… అతడు మృగాన్ని జయించాడు...” అని రాశారు.




ఈ ఫన్నీ ఇన్సిడెండ్పై నెటిజన్లు స్పందిస్తూ పోస్ట్లు చేస్తున్నారు. గొప్ప వేటగాడు, మొసలిని జయించాడు, క్రికీ, పీసీఎస్ఓ, అతడు ఓ వీరుడు అని అర్థం వచ్చేలా ట్విటర్లో పెడుతున్న హాష్ ట్యాగ్లు ట్రెండింగ్లో నిలుస్తున్నాయి. క్రికీ అనే పదాన్ని ఎక్కువగా మొసళ్ల వేటగాడు అయిన ఆస్ట్రేలియా టీవీ స్టార్ స్టీవ్ ఇర్విన్ ఉపయోగించాడు. అతడు 2006 లో ఓ ప్రమాదంలో మరణించాడు.
Published by: Sumanth Kanukuka
First published: September 11, 2020, 6:31 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading