సీరియల్ కిల్లర్‌కి ఆ శిక్ష వేసి చంపేశారు... అసలు కథ ఆసక్తికరం...

ఫ్లోరిడాలో గేలను చంపుతున్న సీరియల్ కిల్లర్‌ని... విషపు ఇంజెక్షన్ ఇవ్వడం ద్వారా చంపేశారు పోలీసులు.

Krishna Kumar N | news18-telugu
Updated: August 23, 2019, 1:30 PM IST
సీరియల్ కిల్లర్‌కి ఆ శిక్ష వేసి చంపేశారు... అసలు కథ ఆసక్తికరం...
ప్రతీకాత్మక చిత్రం
Krishna Kumar N | news18-telugu
Updated: August 23, 2019, 1:30 PM IST
గ్యారీ రే బొవెల్స్... అమెరికా... ఫ్లోరిడా తూర్పు తీరంలో... తిరిగే గేలను టార్గెట్ చేసి మరీ చంపేవాడు. అతన్ని పట్టుకున్న పోలీసులు... సుప్రీంకోర్టులో ప్రవేశపెట్టగా సంచలన తీర్పు ఇచ్చింది. విషపు ఇంజెక్షన్ ఇచ్చి... అతన్ని చంపేయమని ఆదేశించింది. దీనిపై గ్యారీ ఎన్నిసార్లు అభ్యర్థనలు పెట్టుకున్నా సుప్రీంకోర్టు తిరస్కరించింది. ఫలితంగా శిక్ష అమలైంది. 1994 నుంచీ గ్యారీ... మొత్తం ఆరుగురు గేలను చంపేశాడు. అప్పట్లో అతన్ని "ఐ 95 కిల్లర్" అని పిలిచేవాళ్లు. ప్రస్తుతం గ్యారీ వయసు 57 ఏళ్లు. వెస్ట్ వర్జీనియాకు చెందినవాడు. ఇంతకీ అతను ఎందుకు గేలను చంపేవాడు. వాళ్లపై అతనికి ఎందుకు పగ. ఎందుకు సైకో కిల్లర్ అయ్యాడు అన్నది ఆసక్తికర అంశం.

గ్యారీని చిన్నప్పుడే అతని తల్లిదండ్రులు వదిలేశారు. ఆ తర్వాత... గేలకు ప్రాస్టిట్యూట్ (వ్యభిచారుడు)గా పనిచేశాడు. కొన్నేళ్లపాటూ ఇలా పనిచేశాక... రెండుసార్లు జైలుకెళ్లొచ్చాడు. అతనిపై దొంగతనం, దోపిడీ, దాడి, రేప్ వంటి కేసులున్నాయి. 1993లో వర్జీనియా నుంచీ డేటోనా బీచ్‌కి మకాం మార్చాడు.

అక్కడికి వెళ్లాక కూడా ప్రాస్టిట్యూట్‌గానే పనిచేశాడు. ఐతే... ఆ విషయం తెలియనివ్వకుండా... ఓ అమ్మాయిని లవ్ చేశాడు. ఆమెను పెళ్లి చేసుకుందామనుకున్నాడు. అంతలోనే ఆమెకు అసలు విషయం తెలిసింది. అతన్ని వదిలి వెళ్లిపోయింది. తన బ్రేకప్‌కి గేలే కారణమని అనుకున్నాడు. కొన్ని నెలల తర్వాత అతనికి మరో విషయం తెలిసింది. అతని గర్ల్‌ఫ్రెండ్ అబార్షన్ చేయించుకుందని. తట్టుకోలేకపోయాడు. అంతే... గేలపై కక్ష పెంచుకొని... వాళ్లను వన్ బై వన్ చంపడం మొదలుపెట్టాడు. అలా సైకో కిల్లర్ అయిపోయాడు.

1976 నుంచీ ఫ్లోరిడాలో మరణ శిక్ష పడిన వారిలో గ్యారీ 99వ వాడు. అమెరికాలో ఈ ఏడాది మరణ శిక్ష అమలైన వారిలో గ్యారీ 13వ వాడు. టెక్సాస్‌లో 19 ఏళ్ల విద్యార్థిని చంపిన వ్యక్తిని ఉరితీసిన మర్నాడే... ఫ్లోరిడాలో గ్యారీని విషపు ఇంజెక్షన్ ఇచ్చి చంపేశారు.

First published: August 23, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...