హోమ్ /వార్తలు /అంతర్జాతీయం /

షాకింగ్.. సముద్రంలో బోల్తా ప‌డిన స్పీడ్ బోట్.. 17 మంది దుర్మరణం.. ఎక్కడంటే..

షాకింగ్.. సముద్రంలో బోల్తా ప‌డిన స్పీడ్ బోట్.. 17 మంది దుర్మరణం.. ఎక్కడంటే..

తమ వారి కోసం చూస్తున్న వలసదారులు

తమ వారి కోసం చూస్తున్న వలసదారులు

Bahamas: బహామాస్ సముద్రంలో ఆదివారం షాకింగ్ ఘటన జరిగింది. వలసదారులతో ప్రయాణిస్తున్న బోటు ఒక్క సారిగా కుదుపునకు గురైంది. దీంతో పడవ సముద్రంలో బోల్తా పడింది.

  ఫ్లోరిడాలో మయామికి వెళ్లే స్పీడ్ బోట్ సముద్రంలో బోల్తాపడింది. అందులో అనేక మంది వలస దారులు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఘటన ఆదివారం జరిగినట్టు సమాచారం. ఘటన ఆలస్యంగా వెలుగులోనికి వచ్చింది. బహామాస్‌ను తరచుగా మానవ స్మగ్లర్లు యునైటెడ్ స్టేట్స్ చేరుకోవాలనుకునే హైటియన్లకు ప్రమాదకరమైన సముద్ర ప్రయాణం కోసం రవాణా మార్గంగా ఉపయోగిస్తారు. హైతీ వలసదారులతో బహామాస్ సముద్రంలో ప్ర‌యాణిస్తున్న పడవ ఒక్కసారిగా బోల్తా ప‌డింది. దీంతో బోట్ లో ప్రయాణిస్తున్న వారంత సముద్రంలో పడ్డారు.

  ఈ ఘ‌ట‌నలో ఇప్ప‌టి వ‌ర‌కు బహామియా భద్రతా దళాలు 17 మంది మృతదేహాలను బైటకు తీశారు. అదే విధంగా మరో.. 25 మందిని రెస్క్యూ చేశారు. అయితే బోట్ మునగడానికి గల కారణాలపై అధికారులు విచారణ చేపట్టారు. ఈ ప్రమాదంలో.. ఇప్పటి వరకు 15 మంది మహిళలు, ఒక పురుషుడు, ఒక చిన్నారి ఉన్నారని అధికారులు వెల్లడించారు. ఘటనపై ఆ దేశ ప్రధాని ఫిలిప్ బ్రేవ్ డేవిస్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఈ ప్ర‌మాదం బారిన ప‌డి ప్రాణాల‌తో బ‌య‌ట‌ప‌డిన వారిని వెంట‌నే దగ్గరలోని ఆస్పత్రులకు తరలించామని అన్నారు. మంచి వైద్యం అందిచాలని డాక్టర్ లకు సూచించినట్లు తెలిపారు.

  ఇదిలా ఉండగా యూపీలో కూడా  ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.

  ఉత్తరప్రదేశ్ లో ఇటీవల పలు ఎక్స్ ప్రెస్ వేలు అందుబాటులోకి రాగా, వాటిలో అతి పెద్దదిగా ప్రత్యేకంగా నిలుస్తుంది పూర్వాంచల్ ఎక్స్‌ప్రెస్‌వే. 341 కిలోమీటర్ల ఈ రహదారి దాదాపు 10 జిల్లాలను కలుపుతూపోతుంది. బారాబంకి జిల్లాలో లోని కత్రా పోలీస్ స్టేషన్ పరిధిలోకి వచ్చే నారాయణ్ పూర్ గ్రామం వద్ద సోమవారం తెల్లవారుజామున ఘోర ప్రమాదం జరిగింది.

  వేగంగా వెళుతోన్న రెండు డబుల్ డెక్కర్ బస్సులు ఢీకొనడటంతో వాటిలో ప్రయాణిస్తోన్న 8 మంది స్పాట్ లోనే చనిపోయారు. రెండు బస్సులు ధ్వంసమైపోగా, 20 మందికిపైగా గాయపడ్డారు. ప్రమాద సమాచంరం తెలిసిన వెంటనే వైద్య, పోలీస్ సిబ్బంది ఘటనా స్థలికి చేరుకున్నారు.

  పూర్వాంచల్ ఎక్స్‌ప్రెస్‌వే బస్సు ప్రమాద బాధితులను లక్నోలోని ఆస్పత్రికి తరలించారు. అయితే, చికిత్స పొందుతున్నవారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. ఇదే ఎక్స్‌ప్రెస్‌వే సరిగ్గా ఐదు రోజుల కిందట స్కార్పియో వాహనం టైరు పేలి బోల్తాపడిన ఘటనలో ఇద్దరు చనిపోగా, ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. తాజా ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

  Published by:Paresh Inamdar
  First published:

  Tags: Boat accident, Florida, Ocean

  ఉత్తమ కథలు