చైనాలో (China) ఈ సంవత్సరం ప్రారంభంలో ఘోర విమానం ప్రమాదం జరిగింది. కున్మింగ్ నుంచి గ్వాంగ్ జౌకి ప్రయాణిస్తున్న మార్చిలో విమానం.. కున్మింగ్ నుండి గ్వాంగ్‌జౌకి వెళుతున్న బోయింగ్ 737-800 విమానం గ్వాంగ్జీ పర్వతాలలో కుప్ప కూలిపోయింది. ఇది 28 సంవత్సరాలలో చైనా ప్రధాన భూభాగంలో జరిగిన అత్యంత ఘోరమైన విమాన ప్రమాదమని అధికారులు తెలిపారు.
ఈ ఘటనలో 123 మంది ప్రయాణికులు చనిపోయారు. వీరితో పాటు విమానంలో ఉన్న తొమ్మిది మంది భద్రత సిబ్బంది కూడా చనిపోయారు. ఈ సంవత్సరం ప్రారంభంలో క్రాష్ అయిన చైనా ఈస్టర్న్ జెట్ నుండి రికవరీ చేయబడిన బ్లాక్ బాక్స్ నుండి ఫ్లైట్ డేటా కాక్‌పిట్‌ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దీన్ని డీకొడ్ చేస్తే ఎవరో కావాలనే ఉద్దేశపూర్వకంగా జెట్‌ను క్రాష్ చేసినట్లు తెలుస్తుందని వాల్ స్ట్రీట్ జర్నల్ మంగళవారం నివేదించింది. ప్రస్తుతం నివేదిక తీవ్ర దుమారాన్ని రేపింది.
గతంలో.. పౌర విమానయాన చరిత్రలో మరో ఘోర ప్రమాదం నమోదైంది.
నైరుతి చైనాలో 133 మందితో ప్రయాణిస్తోన్న బోయింగ్ విమాంనం పర్వతాల్లోకి కుప్పకూలింది. ఒక్కసారిగా విమానం నేల కూలడంతో భారీగా మంటలు చెలరేగాయి. అవికాస్తా అడవంతా వ్యాపించి అడవి మటలుగా మారాయి. దీంతో బాధితుల రెస్క్యూ కష్టంగా మారింది. సోమవారం మధ్యాహ్నం 1గంట తర్వాత ఈ ఘటన చోటుచేసుకున్నట్లు చైనా అధికారిక మీడియా వెల్లడించింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: China, Plane Crash