పాకిస్థాన్‌లో కూలిన విమానం... 107 మంది మృతి ?

Pakistan Flight Crash: పాకిస్థాన్‌లోని కరాచీలో ఘోర విమానం ప్రమాదం జరిగింది.

news18-telugu
Updated: May 22, 2020, 8:30 PM IST
పాకిస్థాన్‌లో కూలిన విమానం... 107 మంది మృతి ?
విమానం కూలిన అనంతరం వెలువడుతున్న దట్టమైన పొగలు
  • Share this:
పాకిస్థాన్‌లో ఘోర విమాన ప్రమాదం జరిగింది. లాహోర్ నుంచి కరాచీ వెళుతున్న పాకిస్థాన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానం కరాచీ సమీపంలోని నివాస ప్రాంతాల్లో కుప్పకూలిపోయింది. ప్రమాదం సమయంలో విమానంలో 99 మంది ప్రయాణికులు ఉన్నట్టు రేడియో పాకిస్తాన్ ట్విట్టర్ ఖాతాలో పేర్కొంది. అందులో మరో 8 మంది విమాన సిబ్బంది ఉన్నట్టు తెలుస్తోంది. ఎయిర్‌బస్ 320 మోడల్‌కు సంబంధించిన ఫ్లైట్ నంబర్ పీకే 8303… కరాచీ విమానాశ్రయం సమీపంలోని నివాసాల్లోకి దూసుకెళ్లినట్టు అక్కడి స్థానిక మీడియా వెల్లడించింది. విమానం కుప్పకూలిన వెంటనే భారీగా మంటలు, పొగలు వచ్చాయి.

విమానం కూలిపోయిన మోడల్ కాలనీ ఎక్కువగా పేదల నివసించే ప్రాంతం కావడం, ఎక్కువగా జనసాంద్రత ఉండే ప్రాంతం కావడంతో... ఘటనపై ఆందోళన మరింత ఎక్కువైంది. పోలీసులు, మిలిటరీ ఆ ప్రాంతాన్ని తమ అదుపులోకి తీసుకున్నారు. స్థానికంగా ఉండే అబ్దుల్ రెహమాన్ అనే వ్యక్తి ఈ ఘటనపై స్పందించాడు. విమానం కూలిపోవడానికి ముందు ఎయిర్ పోర్ట్‌లో ల్యాండ్ అయ్యేందుకు ప్రయత్నించిందని తెలిపాడు. ప్రమాదం జరిగిన తీరును బట్టి విమానంలోని వాళ్లెవరూ సజీవంగా ఉండే అవకాశం లేదని తెలుస్తోంది. అయితే ఈ ఘటనపై ఎయిర్ బస్ కంపెనీ ఇంకా స్పందించలేదు.

విమాన ప్రమాదంపై పాక్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. పాకిస్తాన్ ఇంటర్నేషనల్ ఎయిర్ లైన్స సీఈవో అర్షద్ మాలిక్‌తో తాను మాట్లాడి వివరాలు తెలుసుకుంటున్నట్టు చెప్పారు. బాధితులను వెంటనే రక్షించి సురక్షిత ప్రాంతాలకు తరలించాలని అధికారులను ఆదేశించానన్నారు. ప్రమాద ఘటనపై వెంటనే విచారణ జరుపుతామని చెప్పారు.

Published by: Kishore Akkaladevi
First published: May 22, 2020, 4:10 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading