క్రిస్మస్ వేడుకల్లో (Christmas celebrations) విషాదం అలుముకుంది. బ్యాండ్ వాయిస్తూ ర్యాలీగా వెళుతూ, శాంటాక్లాజ్ టోపీలతో చిన్నారుల కేరింతలతో సందడిగా ఉన్న క్రిస్మస్ పరేడ్ (Christmas parade) ఒక్క క్షణంలో భయానకంగా మారిపోయింది. ర్యాలీలో పాల్గొన్న వారిపై నుంచి ఎస్‌యూవీ (SUV) వాహనం దూసుకెళ్లింది. ఈ భయంకర ఘటనలో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. మరో 40 మందికి పైగా గాయాలపాలయ్యారు. అమెరికా (America)లోని విస్కాన్‌సిన్ రాష్ట్రంలోని మిల్‌వాకీ పట్టణం సమీపంలోని వాకేషా (Waukesha) అనే ప్రాంతంలో ఆదివారం ఈ ఘటన జరిగింది. గమనించిన పోలీసులు వాహనంపైకి కాల్పులు (firing) సైతం జరిపారు. అయితే అంతలోనే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఈ ఘటనలో ఎస్‌యూవీ నడిపిన వ్యక్తిగా భావిస్తున్న ఒక వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకొన్నారు. విస్కాన్సిన్‌లోని చిల్డ్రన్స్ హాస్పిటల్‌లో 18 మంది పిల్లలు చికిత్స పొందుతున్నారని అధికారులు తెలిపారు.
ర్యాపర్ కారుగా అనుమానం..
విచారణలో కారు నడిపిన వ్యక్తి ర్యాపర్ (rapper) డారెల్ బ్రూక్స్ (Darrel brooks)గా తెలిసింది. అతను అసలు ఎందుకు అలా చేశాడో పోలీసులు ప్రశ్నిస్తున్నారు. డారెల్ బ్రూక్స్ MathBoi Fly పేరుతో ప్రదర్శనలు ఇచ్చాడు దాడిలో ఉపయోగించిన SUVతో ఓ మ్యూజిక్ వీడియో (music video)లో ఉన్నాడు.
సీసీకెమెరాలు పరిశీలించిన అధికారులు మిల్వాకీలోని కారు ఉన్న చిరునామాను పరిశీలించారు, అక్కడ విధ్వంసం సృష్టించిన SUV కారు ఆ ఇంటి ఆవరణలో ఉంది. వాహనం ముందు భాగం దాని బంపర్, లైసెన్స్ ప్లేట్ ఆఫ్ వేలాడుతూ విండ్‌స్క్రీన్ వరకు పలిగింది. దీంతో బ్రూక్స్‌ను అక్కడే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే ఆ సమయంలో తన భుజం నొప్పిగా ఉందని ర్యాపర్ ఫిర్యాదు చేయడం గమనార్హం.
ఏం జరిగింది..?
వచ్చే నెలలో జరగబోయే క్రిస్మస్ (Christmas) పర్వదినాన్ని పురస్కరించుకుని విస్కాన్‌సిన్ రాష్ట్రంలోని మిల్‌వాకీ వాసులు క్రిస్మస్ వార్షిక పరేడ్‌ను చేసుకుంటున్నారు. అదే సమయంలో ఒక వ్యక్తి ఎస్‌యూవీ వాహనంలో వచ్చి అడ్డుగా ఉన్న బారీకేడ్లను అత్యంత వేగంతో కారుతో ధ్వంసం చేసి వాకీషాలో పరేడ్ (Waukesha parade)గా వెళ్తున్న జనం మీదుగా పోనిచ్చాడు దుండగుడు. దీంతో జనం హాహాకారాలతో పరుగులు తీశారు. ఐదుగురు మరణించారు. మరో 40 మందికిపైగా గాయపడ్డారు.
? SENSITIVE CONTENT: Corporate Media does not want you to talk about the Christmas Parade Attack in Waukesha.
They want you to think that Darrell Brooks Jr was just “fleeing a knife fight” and that killing 5 and injuring 40+ was an accident
Join us here in ➣ @TheTrumpist pic.twitter.com/0mAQYjfoRX
— Pman-News2 (@News2Pman) November 22, 2021
వెంటనే తేరుకున్న అక్కడి పోలీసులు ఆ వాహనంపైకి పలుమార్లు కాల్పులు జరిపారు. ఆగంతకుడు ఆ కారులో వెంటనే అక్కడి నుంచి పరారయ్యాడు. క్రిస్మస్ పరేడ్ (parade) కోసం ఏర్పాటు చేసిన ప్రత్యక్ష ప్రసార కార్యక్రమాల్లో, స్థానికుల సెల్‌ఫోన్లలో ఈ దారుణ ఘటన అంతా రికార్డయింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Christmas