Billionaire fishermen: ఓ చేప.. ఆ జాలర్లను కోటీశ్వర్లను చేసింది.. అదెలా అనుకుంటున్నారా.. ఇది చదివేయండి మరి..

ప్రతీకాత్మక చిత్రం

Billionaire fishermen: అదృష్టం ప్రతీ మనిషికి ఏదో ఒక టైంలో తలుపు తడుతుందట. ఆ టైంలో తలుపులు తెరిచి ఉంచకపోతే మళ్లీ అదృష్టం పట్టడం చాలా కష్టం అంటారు. అయితే ఆ అదృష్టం జాలర్లకు పట్టింది. ఒక్కసారిగా వాళ్లంతా రాత్రికి రాత్రే కోటీశ్వర్లు అయ్యారు. అసలేం జరిగింది.. ఎలా జరిగిందో తెలియాలంటే.. ఇది చదవాల్సిందే.

 • Share this:
  పశ్చిమ యెమెన్‌కు చెందిన 35 మంది జాలర్లు రోజూలానే సముద్రంలో చేపల వేటకు వెళ్లారు. ఎప్పుడూ వాళ్లు చేపలను పట్టుకొని తెల్లారేసరికి ఇంటికి వెళ్తుంటారు. అయితే సముద్రంలో తిమింగలాలు ఎక్కువగా ఉంటాయనే విషయం తెలిసిందే. వారు వెళ్తున్న పడవకు ఒక్కసారిగి భారీ వస్తువు ఏదో తగిలి ఒక్కసారిగి పడవలో అలజడి ఏర్పడింది. వారు ఒక్కసారిగా భయపడ్డారు. ఏదైనా ఇసుక మేట తగిలిందేమోనని అనుకున్నారు. అంతా ఒకదగ్గరుకు వచ్చి ఏమై ఉంటుందో అని చూశారు. చనిపోయిన ఓ స్పెర్మ్‌ తిమింగలం వారి పడవకు ఎదురుపడింది. ఆ తిమింగల కళేబరమే జాలర్లను కోటీశ్వరులని చేసింది. సాధారణంగా తిమింగలాలు చనిపోతే సముద్రం గర్భంలోనే కలిసిపోతాయి. కానీ ఓ భారీ తిమింగలం కళేబరం మాత్రం సముద్రంలో తేలియాడుతూ జాలర్లకు కనిపించింది. దానిని 35 మంది జాలర్లు ఆ కళేబరాన్ని ఎంతో కష్టబడి ఒడ్డుకు తీసుకొచ్చారు.  అలా వారు ఒడ్డుకు తీసుకురావడమే వారిని కోటీశ్వరులని చేసింది. ఒడ్డుకు తీసుకొచ్చిన తిమింగలం శరీరాన్ని కోయగా ‘వేల్‌ వొమిట్‌ లే’ అని పిలిచే వస్తువు వారికి దొరికింది. ఆ పదార్థాన్ని ‘అంబగ్రీస్‌’ అని పిలుస్తారు. అది కిలో, 10 కిలోలు ఉంటుందని అనుకుంటే పొరపాటే.

  అది ఏకంగా 127 కిలోల బరువు ఉంటుంది. దీనికి మార్కెట్లో మంచి విలువ ఉంటుందనే విషయం వారికి తెలియదు. తెలిసిన వారికి ఈ విషయాన్ని చెప్పగా వారు దీనికి మార్కెట్లో మంచి గిరాకీ ఉంటుందని తెలిపారు. దీంతో వారు అప్పటికప్పుడే దానిని మార్కెట్‌కు తీసుకెళ్లగా రూ.10 కోట్లు పలుకుతుందని వ్యాపారులు చేప్పారు. దీంతో జాలర్లంతా పట్టరాని సంతోషంలో మునిగిపోయారు. తిమింగలాల్లో భారీ సైజులో ఉండే జాతికి చెందిన ఈ తిమింగలం స్మర్మ్‌ వేల్‌ జాతికి చెందింది. ఈ తిమింగలం యెమెన్‌కు చెందిన అల్‌-ఖైసా గ్రామానికి చెందిన జాలర్లు పట్టుకున్నారు. తిమింగలం కళేబరంలో దొరికిన అంబగ్రీస్‌ వస్తువును జాలర్లందరూ పంచుకోవాలని నిర్ణయించుకున్నారు. అంబగ్రీస్‌ పదార్థం సాధారణంగా తిమింగలం వాంతి చేసుకున్నప్పుడు, ఉమ్మినప్పుడు బయటకు వస్తుంది. కానీ అది చినిపోయింది కాబట్టి వారికి సలువుగా బయటకు తీశారు. అంబగ్రీస్‌ సెంట్ల తయారీలో దీనికి విపరీతమైన డిమాండ్‌ ఉంటుంది. అందుకే దానికి ఎక్కువ ధర చెల్లించైనా తీసుకుంటారు.

  తేలియాడే బంగారం
  అంబగ్రీస్‌ ను తేలియాడే బంగారం లేదా సముద్రపు నిధి అంటారు. స్పర్మ్ వేల్ జాతి తిమింగళాల జీర్ణ వ్యవస్థ దీన్ని ఉత్పత్తి చేస్తుంది. ఇది తిమింగళాల జీర్ణాశయంలోకి పదునైన వస్తువులు సులభంగా వెళ్లేలా, అవి జీర్ణమయ్యేలా చేస్తుంది. ఈ స్రావాలు బయటకు వచ్చిన తరువాత గడ్డకట్టుకుపోతాయి. మొదట్లో ఇవి దుర్వాసనను కలిగి ఉంటాయి. కానీ పూర్తిగా ఎండిపోయిన తరువాత సువాసనలు వెదజల్లుతుంది. అందుకే దీనికి సౌందర్య ఉత్పత్తుల్లో, పెర్ఫ్యూమ్ పరిశ్రమలో దీనికి మంచి విలువ ఉంటుంది.
  ఇదే మొదటిసారి కాదు
  గతంలో అంబగ్రీస్‌ లు బయట పడిన సందర్భాలు ఎన్నో వెలుగు చూశాయి. గత ఏడాది డిసెంబర్లో కూడా ఒక జాలరికి సుమారు 100 కేజీల అంబగ్రీస్‌ దొరికింది. దక్షిణ థాయ్‌లాండ్‌లోని నఖోన్ సి తమ్మారత్ బీచ్‌లో నడుస్తున్నప్పుడు అతడు దాన్ని గుర్తించాడు. ఇప్పటి వరకు వెలుగు చూసిన అతిపెద్ద అంబగ్రీస్‌ లలో ఇది ఒకటి కావడం విశేషం.
  Published by:Veera Babu
  First published: