మనిషి ముఖాన్ని పోలిన అరుదైన చేప.. సోషల్ మీడియాలో వైరల్..

Fish with human like face : మొదట ఈ వీడియోను చైనీస్ సోషల్ మీడియా విబోలో పోస్ట్ చేశారు. ఆపై ట్విట్టర్,ఫేస్‌బుక్,యూట్యూబ్‌లలోనూ పోస్ట్ చేశారు.

news18-telugu
Updated: November 10, 2019, 3:13 PM IST
మనిషి ముఖాన్ని పోలిన అరుదైన చేప.. సోషల్ మీడియాలో వైరల్..
నీళ్లలో కనిపిస్తున్న చేప
  • Share this:
చైనాలోని మియావో అనే గ్రామంలో ఓ టూరిస్ట్ కెమెరాకు వింతైన చేప చిక్కింది. దాని ముఖం అచ్చు మనిషిని పోలినట్టే ఉండటంతో ఆమె ఆశ్చర్యపోయింది. ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో క్షణాల్లో వైరల్ అయిపోయింది.మనిషి తరహాలోనే ఆ చేపకు ముక్కు,కళ్లు,నోరు ఉండటం చూసి నెటిజెన్స్ షాక్ తింటున్నారు. మొదట ఈ వీడియోను చైనీస్ సోషల్ మీడియా విబోలో పోస్ట్ చేశారు. ఆపై ట్విట్టర్,ఫేస్‌బుక్,యూట్యూబ్‌లలోనూ పోస్ట్ చేశారు.ఈ చేప చూసేందుకే భయంగొల్పేదిగా ఉందని కొంతమంది నెటిజెన్స్ కామెంట్ చేశారు. ఈ చేపను తినాలంటే ధైర్యం కావాలని మరికొందరు కామెంట్ చేశారు. ఇంకొందరు నెటిజెన్స్ దీన్ని ఏలియన్ చేప అని కూడా పేర్కొంటున్నారు. మొత్తానికి వింతగా కనిపిస్తున్న ఈ చేప ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.


Published by: Srinivas Mittapalli
First published: November 10, 2019, 3:13 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading