పాకిస్థాన్ ప్రధాని కార్యాలయంలో మంటలు... ఇమ్రాన్‌ ఖాన్‌కు తప్పిన ముప్పు

సిబ్బందిని సురక్షితంగా బయటికి పంపించాలని ఇమ్రాన్‌ ఆదేశాలు ఇచ్చారు. ఈ ఘటనపై ప్రధాని మంత్రి కార్యాలయం స్పందించింది.

news18-telugu
Updated: April 8, 2019, 5:54 PM IST
పాకిస్థాన్ ప్రధాని కార్యాలయంలో మంటలు... ఇమ్రాన్‌ ఖాన్‌కు తప్పిన ముప్పు
పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్
news18-telugu
Updated: April 8, 2019, 5:54 PM IST
పాకిస్థాన్‌ ప్రధాని కార్యాలయంలో అగ్ని ప్రమాదం జరిగింది. పీఎంవో ఆఫీసులోని ఆరవ అంతస్తులో మంటలు చెలరేగాయి. ఆ సమయంలో ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌.. బిల్డింగ్‌లోని అయిదవ అంతస్తుల్లో ఉన్నట్లు తెలిసింది. దీంతో పీఎం ఆఫీసు నుంచి ఉద్యోగులను హుటాహుటిన తరలించారు. రంగంలోకి దిగిన అగ్నిమాపక అధికారులు మంటల్ని ఆర్పేందుకు ప్రయత్నించారు. అగ్ని ప్రమాదం జరిగిన సమయంలో ప్రధాని ఇమ్రాన్‌ ఓ సమావేశంలో ఉన్నట్లు తెలుస్తోంది. అగ్నిప్రమాదం వార్త తెలియగానే.. సిబ్బందిని సురక్షితంగా బయటికి పంపించాలని ఇమ్రాన్‌ ఆదేశాలు ఇచ్చారు. ఈ ఘటనపై ప్రధాని మంత్రి కార్యాలయం స్పందించింది. ప్రమాదంలో ఎవరికి ఎలాంటి గాయాలు కాలేదని తెలిపింది. అయితే పీఎం ఆఫీసులో మంటలు ఎలా చెలరేగాయన్న దానిపై విచారణ జరుపుతున్నామని తెలిపారు అధికారులు.



First published: April 8, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...