పాక్ ప్రధాని కార్యాలయంలో అగ్ని ప్రమాదంపై విచారణ

పాకిస్థాన్ ప్రధాని కార్యాలయంలో సోమవారం అగ్ని ప్రమాదం సంభవించింది. ప్రమాద సమయంలో మంటలు చెలరేగిన అంతస్థుకు దిగువున అంతస్థులోనే ఇమ్రాన్ ఖాన్ సమావేశం నిర్వహిస్తున్నారు. అదృష్టవశాత్తు ఈ ప్రమాదం నుంచి ఇమ్రాన్ ఖాన్ క్షేమంగా బయటపడ్డారు.

news18-telugu
Updated: April 8, 2019, 5:49 PM IST
పాక్ ప్రధాని కార్యాలయంలో అగ్ని ప్రమాదంపై విచారణ
పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ (File photo/AP)
news18-telugu
Updated: April 8, 2019, 5:49 PM IST
పాకిస్థాన్ ప్రధానమంత్రి కార్యాలయంలో సంభవించిన అగ్ని ప్రమాదంపై విచారణ జరుగుతోంది. సోమవారం పాక్ ప్రధాని కార్యాలయంలో జరిగిన అగ్నిప్రమాదంలో  అదృవశాత్తు పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్  క్షేమంగా బయటపడ్డారు. ఈ ప్రమాదంలో కీలకమైన డాక్యుమెంట్లు కాలిబూడిదైనట్లు తెలుస్తోంది. పాకిస్థాన్ మీడియా సమాచారం మేరకు అగ్ని ప్రమాదం జరిగిన సమయంలో ఇమ్రాన్ ఖాన్ ఆ భవనంలోనే ఉన్నారు. ఆ సమయంలో ప్రమాదం జరిగిన అంతస్థుకు దిగువు అంతస్థులో ఇమ్రాన్ ఖాన్ సమావేశం నిర్వహిస్తున్నారు. అగ్ని ప్రమాదం ఆరో అంతస్థులో జరగ్గా...ఐదో అంతస్థులో ఇమ్రాన్ ఖాన్ సమావేశం నిర్వహిస్తున్నట్లు మీడియా వర్గాల సమాచారం. మంటలు చెలరేగిన వెంటనే ఇమ్రాన్ ఖాన్‌ను భద్రతా సిబ్బంది అక్కడి నుంచి క్షేమంగా బయటకు తీసుకొచ్చారు.

వెంటనే రంగంలోకి దిగిన ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా భావిస్తున్నారు. అయితే కుట్ర కోణం ఏమైనా ఉందా? అన్న కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. మంటల్లో  కీలక డాక్యుమెంట్లు దగ్ధమైనట్లు తెలుస్తోంది. అయితే డాక్యుమెంట్లు దగ్ధమైనట్లు ఎలాంటి సమాచారం లేదని ప్రధానమంత్రి కార్యాలయ అధికార ప్రతినిధి మీడియాకు తెలిపారు. అగ్ని ప్రమాద ఘటనపై  విచారణ తర్వాత వివరాలు వెల్లడిస్తామని చెప్పారు.

First published: April 8, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...