34 ఏళ్లకే దేశ ప్రధానిగా బాధ్యతలు..ప్రపంచ రికార్డు సృష్టించిన ఫిన్లాండ్ యువతి

ప్రపంచ వ్యాప్తంగా చూసినట్లయితే న్యూజిలాండ్ ప్రధాని జెసిండా ఆర్ డెర్న్36 ఏళ్లు కాగా, ఉక్రెయిన్ ప్ర‌ధాని ఒలేక్క్‌సీ హోంచార్కు వయస్సు 35 ఏళ్లు. ఆ రికార్డును ప్రస్తుతం సన్నా మారిన్ చెరిపివేయడం విశేషం.

news18-telugu
Updated: December 9, 2019, 6:15 PM IST
34 ఏళ్లకే దేశ ప్రధానిగా బాధ్యతలు..ప్రపంచ రికార్డు సృష్టించిన ఫిన్లాండ్ యువతి
34 ఏళ్లకే దేశ ప్రధానిగా బాధ్యతలు..ప్రపంచ రికార్డు సృష్టించిన ఫిన్లాండ్ యువతి (Image: CNN)
  • Share this:
ప్రపంచంలోనే అతి చిన్న వయస్సులోనే దేశ ప్రధానిగా ఎన్నికైన ఘనత సన్నామారిన్ సొంతం చేసుకుంది. కేవలం 34 సంవత్సరాల వయస్సు కలిగిన సన్నామారిన్ అతి చిన్న వయస్సులోనే ఫిన్ లాండ్ దేశ ప్రధానిగా బాధ్యతలు చేపట్టి రికార్డు సృష్టించారు. ఇదిలా ఉంటే దేశంలో పోస్టల్ సమ్మెను సరిగా నియంత్రించలేకపోవడంతో గత ప్రధాని ప్రధాని అంటి రిన్నే తన పదవికి రాజీనామా చేయగా, మరో సభ్యుడిని ప్రధానిగా ఎంపిక చేయాల్సిన అవసరం ఏర్పడింది. దీంతో రవాణా శాఖ మంత్రిగా ఉన్న సన్నా మారిన్ ను ప్రధానిగా ఎన్నుకున్నట్లు ఫిన్లాండ్ సోషల్ డెమోక్రటిక్ పార్టీ నిర్ణయం తీసుకుంది. ఫిన్లాండ్ ప్రధాని కోసం జరిగిన ఓటింగ్ లో మారిన్ మాజీ ప్రధాని అంటీ రీనేపై అతి తక్కువ ఓట్ల తేడాతో విజయం సాధించింది. మారిన్ త్వరలో ప్రధాని బాధ్యతలను స్వీకరించనున్నారు. ఇదిలా ఉంటే ప్రపంచ వ్యాప్తంగా చూసినట్లయితే న్యూజిలాండ్ ప్రధాని జెసిండా ఆర్ డెర్న్36 ఏళ్లు కాగా, ఉక్రెయిన్ ప్ర‌ధాని ఒలేక్క్‌సీ హోంచార్కు వయస్సు 35 ఏళ్లు. ఆ రికార్డును ప్రస్తుతం సన్నా మారిన్ చెరిపివేయడం విశేషం.

First published: December 9, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు