Home /News /international /

FINLAND PM SANNA MARIN PARTY VIDEO GOES VIRAL SHE SAYS NOT SRUGGED PVN

PM Video : ప్రైవేట్ పార్టీలో రచ్చ రంభోలా చేసిన ప్రధాని..డ్రగ్స్ తీసుకుందా?

ఫిన్లాండ్ ప్రధాని సనా మారిన్‌ వీడియో వైరల్

ఫిన్లాండ్ ప్రధాని సనా మారిన్‌ వీడియో వైరల్

PM Dance Video : ప్రపంచంలోనే అత్యంత పిన్న వయస్కురాలైన ప్రధానిగా గుర్తింపు రికార్డులకెక్కిన ఫిన్లాండ్ ప్రధాని సనా మారిన్‌(Finland PM Sanna Marin)వివాదంలో చిక్కుకున్నారు. స్నేహితులతో కలిసి పార్టీ చేసుకున్న సందర్భంలో కేరింతలు, జోరుగా డ్యాన్స్ చేసిన సనా మారిన్‌ డ్యాన్స్(Sanna Marin Dance) చేస్తున్న వీడియో వైరల్(Video Viral)గా మారింది

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India
PM Dance Video : ప్రపంచంలోనే అత్యంత పిన్న వయస్కురాలైన ప్రధానిగా గుర్తింపు రికార్డులకెక్కిన ఫిన్లాండ్ ప్రధాని సనా మారిన్‌(Finland PM Sanna Marin)వివాదంలో చిక్కుకున్నారు. స్నేహితులతో కలిసి పార్టీ చేసుకున్న సందర్భంలో కేరింతలు, జోరుగా డ్యాన్స్ చేసిన సనా మారిన్‌ డ్యాన్స్(Sanna Marin Dance) చేస్తున్న వీడియో వైరల్(Video Viral)గా మారింది. 28 సెకన్ల నిడివి ఉన్న ఈ వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాలను చుట్టేస్తోంది. ఒక్క రోజు కూడా కాకుండానే ఏకంగా 3.1 మిలియన్ వ్యూస్ సొంతం చేసుకుంది ఈ వీడియో. ఆ పార్టీలో డెమోక్రటిక్‌ పార్టీకి చెందిన పార్లమెంట్‌ సభ్యురాలు ఇల్మారి నూర్మినెన్‌, ప్రముఖ గాయకులు, ప్రముఖ యూట్యూబర్‌, టీవీ యాంకర్లు తదితరులు ఉన్నారు.

అయితే ఈ వీడియో బయటకు రాగానే ప్రతిపక్షాలు తీవ్రస్థాయిలో ప్రధానిపై ఆరోపణలు గుప్పించాయి. పార్టీలో ప్రధని సనా మారిన్ డ్రగ్స్ తీసుకుని ఉండొచ్చని, అందుకే ఆమె అంతలా పార్టీలో చిందేశారని అనుమానం వ్యక్తం చేశాయి. ఆమెకు డ్రగ్ టెస్ట్ కూడా చేయించాలని డిమాండ్ చేశాయి. తనపై వస్తున్న ఆరోపణలపై ప్రధాని మారిన్ స్పందించారు. డ్రగ్స్ తీసుకున్నానన్న వార్తలను ఖండించారు. ఆ పార్టీలో తను ఆల్కహాల్ మాత్రమే తీసుకున్నానని తెలిపారు. వీడియో తీస్తున్న విషయం తనకు తెలుసన్న ప్రధాని సనా మారిన్... అది బహిరంగం కావడం మాత్రం విచారకరమన్నారు. ఓ రోజు సాయంత్రం మిత్రులందరం కలిసి పార్టీ చేసుకున్నామని, పాటలు పాడుతూ డ్యాన్స్ చేశామని పేర్కొన్నారు. అది చట్టబద్ధమేనని,తానెలాంటి తప్పు చేయలేదని స్పష్టం చేశారు. ప్రైవేటు వీడియో లీక్ కావడం మాత్రం దురదృష్టకరమన్నారు. ఈ మాత్రానికి తాను తన ప్రవర్తనను మార్చుకోవాల్సిన అవసరం లేదని, తానెప్పుడూ ఎలా ఉంటానో ఇకపై కూడా అలానే ఉంటానన్నారు.


Two planes collide : ల్యాండింగ్ టైంలో ఢీకొన్న రెండు విమానాలు..ఎంతమంది చనిపోయారంటే




ఇక,సోషల్ మీడియాలో నెటిజన్లు ఈ వీడియోను చూసి విభిన్నంగా స్పందించారు. కొందరూ ప్రధానమంత్రికి కూడా పార్టీలు సర్వసాధారణమైననవంటూ మారిన్‌కి మద్దతు ఇ‍వ్వగా ...మరికొందరూ ప్రధాని హోదాలో ఇవేమి పనులు అంటూ మండిపడుతున్నారు. 36 ఏళ్ల సనా తరచూ మ్యూజిక్ ఫెస్టివల్స్‌కు హాజరవుతుంటారు. ఫొటోలకు పోజులిస్తుంటారు. కాగా, గతంలో ఓ కరోనా రోగితో సన్నిహితంగా మెలిగిన సనా మారిన్.. ఆ తర్వాత ఓ క్లబ్‌కు వెళ్లినందుకు క్షమాపణలు చెప్పాల్సి వచ్చింది. కాగా, గత వారం జర్మనీకి చెందిన న్యూస్ అవుట్‌లెట్ బిల్డ్... మారిన్‌ను కూలెస్ట్ ప్రధానమంత్రి'గా అభివర్ణించింది
Published by:Venkaiah Naidu
First published:

Tags: Finland, Viral Video

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు