Finland PM Drugs Test : ప్రపంచంలోనే అత్యంత పిన్న వయస్కురాలైన ప్రధానిగా గుర్తింపు రికార్డులకెక్కిన ఫిన్లాండ్ ప్రధాని సనా మారిన్(Finland PM Sanna Marin)వివాదంలో చిక్కుకున్నారు. స్నేహితులతో కలిసి పార్టీ చేసుకున్న సందర్భంలో కేరింతలు, జోరుగా డ్యాన్స్ చేసిన ప్రధాని సనా మారిన్ (Sanna Marin Dance)వీడియో బహిర్గతం కావడం ఆ దేశ రాజకీయాల్లో దుమారం రేపుతోంది. ఆ వీడియోలో ప్రధాని సనా మారిన్ నేలపై మోకాళ్ల మీద కూర్చొని ఓ పాటకు డ్యాన్స్ చేస్తున్నట్లు కనిపించారు. ఆ పార్టీలో డెమోక్రటిక్ పార్టీకి చెందిన పార్లమెంట్ సభ్యురాలు ఇల్మారి నూర్మినెన్, ప్రముఖ గాయకులు, ప్రముఖ యూట్యూబర్, టీవీ యాంకర్లు తదితరులు ఉన్నారు. అయితే ఈ ప్రైవేట్ పార్టీ వీడియో బయటకు రాగానే ప్రతిపక్షాలు తీవ్రస్థాయిలో ప్రధానిపై ఆరోపణలు గుప్పించాయి. పార్టీలో ప్రధని సనా మారిన్ డ్రగ్స్ తీసుకుని ఉండొచ్చని, అందుకే ఆమె అంతలా పార్టీలో చిందేశారని అనుమానం వ్యక్తం చేశాయి. ఆమెకు డ్రగ్ టెస్ట్ కూడా చేయించాలని డిమాండ్ చేశాయి. తనపై వస్తున్న ఆరోపణలపై ప్రధాని మారిన్ స్పందించారు. డ్రగ్స్ తీసుకున్నానన్న వార్తలను ఖండించారు. ఆ పార్టీలో తను ఆల్కహాల్ మాత్రమే తీసుకున్నానని తెలిపారు. వీడియో తీస్తున్న విషయం తనకు తెలుసన్న ప్రధాని సనా మారిన్... అది బహిరంగం కావడం మాత్రం విచారకరమన్నారు. ఓ రోజు సాయంత్రం మిత్రులందరం కలిసి పార్టీ చేసుకున్నామని, పాటలు పాడుతూ డ్యాన్స్ చేశామని పేర్కొన్నారు. అది చట్టబద్ధమేనని,తానెలాంటి తప్పు చేయలేదని స్పష్టం చేశారు. ప్రైవేటు వీడియో లీక్ కావడం మాత్రం దురదృష్టకరమన్నారు. ఈ మాత్రానికి తాను తన ప్రవర్తనను మార్చుకోవాల్సిన అవసరం లేదని, తానెప్పుడూ ఎలా ఉంటానో ఇకపై కూడా అలానే ఉంటానన్నారు.
అయితే పార్టీలో ప్రధాని డ్రగ్స్ తీసుకున్నారంటూ ప్రతిపక్ష నాయకులు ఆరోపణలు నేపథ్యంలో సనా మారిన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. విపక్షాల ఆరోపణల నేపథ్యంలో ప్రధాని సనా మారిన్ డ్రగ్స్ ఐడెంటిఫికేషన్ పరీక్ష చేయించుకున్నారు. అందరి అనుమానాలు నివృత్తి చేసేందుకు డ్రగ్స్ పరీక్ష చేయించుకున్నానని...ఒక వారంలో పరీక్షా ఫలితాలు వస్తాయని, వచ్చిన వెంటనే వాటిని మీడియాతో పంచుకుంటానని ప్రధాని సనా మారిన్ తెలిపారు.
Finland’s Prime Minister @MarinSanna is in the headlines after a video of her partying was leaked today.
— Visegrád 24 (@visegrad24) August 17, 2022
She has previously been criticized for attending too many music festivals & spending too much on partying instead of ruling.
The critics say it’s not fitting for a PM. pic.twitter.com/FbOhdTeEGw
Middle East : మిడిల్ ఈస్ట్ లో మారుతున్న వాతావరణం..అక్కడ మనిషి నివసించగలిగేది మరికొన్నేళ్లే!
36 ఏళ్ల సనా తరచూ మ్యూజిక్ ఫెస్టివల్స్‌కు హాజరవుతుంటారు. ఫొటోలకు పోజులిస్తుంటారు. కాగా, గతంలో ఓ కరోనా రోగితో సన్నిహితంగా మెలిగిన సనా మారిన్.. ఆ తర్వాత ఓ క్లబ్‌కు వెళ్లినందుకు క్షమాపణలు చెప్పాల్సి వచ్చింది. కాగా, ఇటీవల జర్మనీకి చెందిన న్యూస్ అవుట్‌లెట్ బిల్డ్... మారిన్‌ను కూలెస్ట్ ప్రధానమంత్రి'గా అభివర్ణించింది
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Drugs, Finland, Viral Video