• Home
  • »
  • News
  • »
  • international
  • »
  • FAMOUS JAKARTA SOCIALITE RICHARD MULJADI BOOKS ENTIRE FLIGHT TO BALI TO PROTECT HIMSELF FROM COVID 19 HSN

ఓరి నాయనో.. భార్యాభర్తలిద్దరూ ఏకంగా విమానాన్నే బుక్ చేసుకున్నారు..!

Richard Muljadi

ఓ వ్యక్తి కరోనా నుంచి తనను, తన భార్యను కాపాడుకోవడానికి చేసిన ఓ ప్రయత్నం సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది. ఎవరికి కరోనా ఉందో, ఎవరికి కరోనా లేదో గుర్తుపట్టడం కష్టం కాబట్టి తను, తన భార్య ప్రయాణం చేయడానికి ఏకంగా ఓ విమానాన్నే బుక్ చేసి పారేశాడు. దీనికి సంబంధించిన వివరాలను ఆ వ్యక్తి తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేశాడు. ఇది కాస్తా వైరల్ గా మారింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే..

  • Share this:
    ప్రస్తుతం ప్రపంచాన్నంతా బయపెడుతున్న అంశం కరోనా. దీని బారి నుంచి తప్పించుకోవడానికి ప్రపంచదేశాలు తీవ్ర ప్రయాసపడుతున్నాయి. చైనా నుంచి మొదలుకుని ప్రపంచంలోని ప్రతీ మూలకు ఈ కరోనా వ్యాపించింది. దీనికి వేక్సిన్ ఇప్పుడిప్పుడే కొన్ని దేశాలు తీసుకొస్తున్నాయి కానీ, వాటి పనితీరుపై ఇంకా అనుమానాలు నివృత్తి కాలేదు. మొత్తానికి కరోనా నుంచి తమను తామురక్షించుకునేందుకు ఉన్న ఏకైక మార్గం సామాజిక దూరం పాటించడమే. మాస్కులు వాడటమే. ఈ రెండు తప్ప మరో మార్గం కనిపించడం లేదని వైద్యులు చెబుతూనే ఉన్నారు. ఈ నేపథ్యంలో ఓ వ్యక్తి కరోనా నుంచి తనను, తన భార్యను కాపాడుకోవడానికి చేసిన ఓ ప్రయత్నం సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది. ఎవరికి కరోనా ఉందో, ఎవరికి కరోనా లేదో గుర్తుపట్టడం కష్టం కాబట్టి తను, తన భార్య ప్రయాణం చేయడానికి ఏకంగా ఓ విమానాన్నే బుక్ చేసి పారేశాడు. దీనికి సంబంధించిన వివరాలను ఆ వ్యక్తి తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేశాడు. ఇది కాస్తా వైరల్ గా మారింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే..

    ’నేను, నా భార్య మాత్రమే ఈ విమానంలో ప్రయాణం చేస్తున్నాం. కరోనా వాహకుల నుంచి మమ్మల్ని మేం రక్షించుకునేందుకు సామాజిక దూరం పాటిస్తున్నాం. అందుకే మొత్తం విమానాన్ని బుక్ చేసుకున్నా. మేం మాత్రమే ఈ విమానంలో ప్రయాణించాం. ఇతర కరోనా వాహకుల నుంచి మమ్మల్ని మేం రక్షించుకున్నాం..‘ ఇదీ జకర్తా దేశానికి చెందిన రిచర్డ్ ముల్జాది తన ఇన్ స్టా గ్రామ్ లో చేసిన ఓ పోస్ట్. జనవరి 4వ తారీఖఉన జకర్తా నుంచి బాలీకి ప్రాంతానికి రిచర్డ్ ముల్జాది, అతడి భార్య షాల్వినే ఛాంగ్ మాత్రమే ప్రయాణించారు. దీనికి సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఎంత కరోనా ఉంటే మాత్రం ఇంత సామాజిక దూరం పాటించాలా..? అంటూ నెటిజన్లు ట్వీట్లు చేస్తున్నారు. డబ్బుుంటే ఏదైనా సాధ్యమేనంటూ కామెంట్లు పెడుతున్నారు.

    ఇదిలా ఉంటే రిచర్డ్ ముల్జాది, అతడి భార్య ఛాంగ్ ప్రయాణించిన విమాన సంస్థ లయన్ ఎయిర్ గ్రూప్ ఈ ఘటనపై స్పందించింది. ’ఆ విమానంలో ప్రయాణించడానికి కేవలం ఇద్దరు మాత్రమే టికెట్లను బుక్ చేసుకున్నారు. అందుకే విమానంలో ఇద్దరు మాత్రమే ఉన్నారు.‘ అని లయన్ గ్రూప్ విమానయాన సంస్థ ప్రతినిధులు చెప్పుకొచ్చారు. అతడు కనుక నిజంగా మొత్తం విమానాన్నే బుక్ చేయాలంటే కనుక ఆ విమానయాన సంస్థకు ఏకంగా 7895 డాలర్లను చెల్లించాల్సి వచ్చేది. అంటే ఏకంగా 5 లక్షల 78వేల రూపాయలన్నమాట. ఆ విమానంలో మొత్తం 150 ఎకానమీ సీట్లు, 12 బిజినెస్ క్లాస్ సీట్లు ఉన్నాయి. అయితే రిచర్డ్ ముల్జాది ఉన్న ఆస్తులు, అతడు గడిపే రిచ్ లైఫ్, అతడి వ్యాపారాల లెక్కలను బట్టి, అతడు నిజంగానే మొత్తం విమానాన్ని బుక్ చేసి ఉంటాడని నెటిజన్లు చెప్పుకుంటున్నారు.
    Published by:Hasaan Kandula
    First published: