Home /News /international /

UK Family: కొత్త ఇంట్లోకి అడుగుపెట్టిన ఫ్యామిలీ.. గోడలపై రాతలు చూసి షాక్.. అక్కడ ఏముందంటే..

UK Family: కొత్త ఇంట్లోకి అడుగుపెట్టిన ఫ్యామిలీ.. గోడలపై రాతలు చూసి షాక్.. అక్కడ ఏముందంటే..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

కొత్త ఇంట్లోకి మారడమంటే 4 గోడలు ఉన్న ఇంటికి వెళ్లడమే కాదు.. మీకంటే ముందు అందులో నివసించిన వ్యక్తుల గుర్తులు, జ్ఞాపకాలు కూడా అక్కడక్కడా కనిపిస్తుంటాయి. బ్రిటన్‌కు చెందిన ఓ కుటుంబానికి కూడా ఇలాంటి అనుభవమే ఎదురైంది.

టైమ్ ట్రావెల్.. ఇది ఎప్పటికీ ఇంటెరెస్టింగ్ సబ్జక్టే. హాలీవుడ్, బాలీవుడ్‌తో పాటు తెలుగులోనూ సినిమాలు వచ్చాయి. 90ల్లో వచ్చిన ఆదిత్య 369 మూవీ ఇప్పటికీ ఎంతో మంది ఆసక్తిగా చూస్తుంటారు. భూతకాలం, భవిష్యత్ కాలంలోకి వెళ్లి రావడం..నిజంగా సాధ్యమేనా? అని ఇప్పటికీ ఎన్నో ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఐతే తాజాగా ఓ ఫ్యామిలీకి టైమ్ ట్రావెలింగ్ అనుభవం కలిగింది. కొత్త ఇంటికి వెళ్లిన  తర్వాత..  గోడలపై ఉన్న రాతలను చూసి కుటుంబ సభ్యులంతా షాక్ తిన్నారు. చివరకు  అసలు విషయం తెలిసి ఆశ్చర్యపోయారు.

మనం ఏదైనా కొత్త ఇంటిలోకి అద్దెకు దిగినప్పుడు సరికొత్త అనుభూతి కలుగుతుంది. కొత్త వాతావరణం, కొత్త పరిచయాలు ఇలా ఎన్నో విషయాలు అద్భుతంగా అనిపిస్తాయి. కొత్త ఇంట్లోకి మారడమంటే 4 గోడలు ఉన్న ఇంటికి వెళ్లడమే కాదు.. మీకంటే ముందు అందులో నివసించిన వ్యక్తుల గుర్తులు, జ్ఞాపకాలు కూడా అక్కడక్కడా కనిపిస్తుంటాయి. బ్రిటన్‌కు చెందిన ఓ కుటుంబానికి కూడా ఇలాంటి అనుభవమే ఎదురైంది. మర్ఫీ అనే వ్యక్తి యూకేలోని లాంక్‌షైర్‌లో ఒక పాత ఇంటిని కొనుగోలు చేశారు. ఆ ఇంటి రినోవేషన్​ పనులు ప్రారంభించారు. పాత గోడలను కూల్చివేసి కొత్త గోడలను ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నారు. ఇలా చేస్తున్న క్రమంలో గదిలోని గోడ వెనుక భాగంలో ఒక సీక్రెట్ 'టైమ్ ట్రావెల్' కవితను కనుగొన్నారు.

ఆ గోడపై ఇలా రాసి ఉంది.. “నేను ఇక్కడ ఉన్నాను. నీవు అక్కడ ఉన్నావు. కాలానుగుణంగా ఇద్దరం వేర్వేరు ప్రదేశాల్లో ఒంటరిగా మిగిలిపోయాం. భవిష్యత్తులో కలుస్తామా? నేను నీ జీవితంలో ఇక గతమేనా?.. కాదు, నీవు నా భవిష్యత్తు. నేను నీకు గతం. మనకు మంచి రోజులొస్తాయి 1975 ఎలీన్ వాల్మ్స్లీ.’’ అని సంతకం చేసి ఉన్న కవిత కనిపించింది. ఈ అద్భుతమైన కవిత మర్ఫీ కుటుంబాన్ని ఎంతగానో ఆకర్షించింది. అసలు ఈ కవిత రాసిన ఎలీన్ వాల్మ్స్లీ ఎవరో కనుగొనాలనే ఆసక్తి వారిలో పెరిగింది. దీంతో ఆమెను ఎలాగైనా ట్రాక్​ చేయాలని నిర్ణయించుకున్నారు. అయితే వారు ఈ ప్రాంతానికి కొత్త కాబట్టి ఆమెను ట్రాక్​ చేయడం కాస్త కష్టంగానే మారింది. అయినా సరే ఆమె కోసం శతవిధాలా ప్రయత్నించారు.

1975లో రాసిన ‘టైమ్​ ట్రావెల్’​ కవిత..
ఎట్టకేలకు ఆ కవితలో ఉన్న పేరు, మునుపటి ఇంటి యజమాని ఇద్దరి ఇంటి పేరు ఒకేలా ఉందని గుర్తించారు. వెంటనే ఆ కవిత ఫోటో తీసి ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేశారు. ఆశ్చర్యకరంగా, వారి పోస్ట్​ను చూసిన ఎలీన్ పాల్మర్ అనే మహిళ మర్ఫీకి కాల్ చేసింది. ఆ కవిత నేనే రాశానని, యుక్తవయసులో ఉండగా తన సోదరిపై ప్రేమతో గోడపై అలా రాసినట్లు చెప్పింది. కాగా, ఎలీన్​ పాల్మర్​కు ఇప్పుడు 62 ఏళ్లు. ఎలీన్ 14 లేదా 15 సంవత్సరాల వయస్సులో ఉన్నప్పుడు ఈ కవిత రాసినట్లు తెలిపింది. ఆమె 1960 నుంచి 1970 మధ్య కాలంలో ఈ ఇంట్లో తన కుటుంబంతో కలిసి నివసించేది. ప్రస్తుతం మర్ఫీ కుమార్తె ఉంటున్న గదిలోనే ఎలీన్, ఆమె సోదరి ఇద్దరూ ఉండేవారు.
Published by:Shiva Kumar Addula
First published:

Tags: International, International news, United Kingdom, VIRAL NEWS

తదుపరి వార్తలు