Trump Covid 19: రెచ్చిపోయిన డొనాల్డ్ ట్రంప్ వ్యతిరేకులు... అలా చేయొద్దన్న ట్విట్టర్, ఫేస్‌బుక్, టిక్‌టాక్

Trump Covid 19: అసలే కరోనా సోకి ఇబ్బంది పడుతున్న ట్రంప్‌కి ఆయన వ్యతిరేకులు సోషల్ మీడియాలో పెడుతున్న కామెంట్లు మరింత ఇబ్బంది పెడుతున్నాయి. దీనిపై ట్విట్టర్, ఫేస్‌బుక్, టిక్‌టాక్ కండీషన్లు పెట్టాల్సి వచ్చింది.

news18-telugu
Updated: October 3, 2020, 1:43 PM IST
Trump Covid 19: రెచ్చిపోయిన డొనాల్డ్ ట్రంప్ వ్యతిరేకులు... అలా చేయొద్దన్న ట్విట్టర్, ఫేస్‌బుక్, టిక్‌టాక్
Trump Covid 19: రెచ్చిపోయిన ట్రంప్ వ్యతిరేకులు... అలా చేయొద్దన్న ట్విట్టర్, ఫేస్‌బుక్ (credit - twitter - reuters)
  • Share this:
Trump Covid 19: మన శత్రువైనా సరే... కష్టాల్లో, అనారోగ్యంతో ఉన్నప్పుడు మనం ఏం చేస్తాం... త్వరగా కోలుకోవాలని కోరుకుంటాం. శత్రుత్వాన్ని పక్కన పెడతాం. కానీ... అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విషయంలో... ఆయన వ్యతిరేకులు ఇలా ఆలోచించట్లేదు. ట్రంప్ దంపతులకు కరోనా సోకిందని తెలిసిన వెంటనే వాళ్లంతా పార్టీలు చేసుకున్నారు. సోషల్ మీడియాలో... అలాగే జరగాలి అంటూ శాపనార్థాలు పెట్టారు. నిన్నటి నుంచి ట్విట్టర్, ఫేస్‌బుక్, టిక్‌టాక్‌లో ఇలాంటి పోస్టులు, కామెంట్లు, మీమ్స్ ఎక్కువైపోయాయి. దీంతో ఈ సంస్థల యాజమాన్యాలు వెంటనే స్పందించాల్సి వచ్చింది. ఇలా ట్రంప్‌ అనారోగ్యంపై వ్యతిరేక కామెంట్లు, పోస్టులూ పెట్టడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు తెలిపాయి. ఎవరైనా ఇలా చేస్తే... అకౌంట్లు సస్పెండ్ చేస్తామనీ... ఇది సంస్థల కంటెంట్ పాలసీలకు వ్యతిరేకం అని తెలిపాయి.

"ట్రంప్ కరోనా నుంచి కోలుకోకూడదు" "ట్రంప్ కరోనాతో చనిపోవాలి" అంటూ నిన్నటి నుంచి నెటిజన్లు పెట్టిన ట్వీట్లను తీసేసినట్లు ట్విట్టర్ తెలిపింది. ఇలాంటి ట్వీట్లు ఎక్కువగా పెట్టినది చైనా ప్రజలే. మొదటి నుంటి ట్రంప్... చైనాను వ్యతిరేకించడం, కరోనాను చైనా వైరస్ అనడంతో... చైనీయులు ట్రంప్‌పై ఆగ్రహంతో రగిలిపోతున్నారు. ఇలాంటి సమయంలో... ట్రంప్ దంపతులకు కరోనా సోకిందనే వార్త వారిలో రాక్షసానందాన్ని పెంచింది, సైకో మనస్తత్వాన్ని నిద్రలేపింది. ఫలితంగా తుఫానులా ట్రంప్ వ్యతిరేక పోస్టులు, కామెంట్లూ పుట్టుకొచ్చాయి. ట్రంప్ ట్విట్టర్ పేజీలో కూడా ఆయనకు వ్యతిరేకంగా కామెంట్లు రాశారు చాలా మంది.

మెరుగైన ఆరోగ్యం:
తాజా పరిస్థితుల్లో... తన ప్రత్యర్థులకు షాక్ ఇచ్చే విషయం ఒకటి ట్రంప్ చెప్పారు. తాను, తన భార్యా... కరోనా వైరస్ నుంచి కోలుకుంటున్నామనీ... అంతా సవ్యంగా సాగుతోందని ట్రంప్ తన తాజా ట్వీట్‌లో తెలిపారు. తాము కోలుకుంటూ ఉండటానికి ప్రజల ప్రేమే కారణం కావచ్చని అనుకుంటున్నానని ట్రంప్ తెలిపారు.





ట్రంప్ విధానాలు, పాలనా పరమైన నిర్ణయాల్ని వ్యతిరేకించడంలో తప్పు లేదు. వ్యక్తిగతంగా ట్రంప్‌ని విమర్శించడం, ఆయన కరోనా నుంచి కోలుకోకూడదని కోరుకోవడాన్ని తాము అనుమతించేది లేదని ఫేస్‌బుక్, ట్విట్టర్, టిక్ టాక్ తెలిపాయి. ఇంత చెప్పినా... ఎవరైనా ఇలాంటి ట్వీట్లు పెడితే... అకౌంట్‌ని సస్పెండ్ చేస్తామని స్పష్టం చేశాయి. ఓ యూజర్... "ట్రంప్ చచ్చిపోవాలి, ఆయన బాడీకి తీవ్ర నష్టం జరగాలి, వ్యాధితో ప్రాణం పోవాలి" అని పెట్టిన ట్వీట్‌ని ఉదాహరణగా చెప్పిన ట్విట్టర్... ఇది అత్యంత తీవ్రమైన బిహేవియర్ అని మండిపడింది.

ఎలాంటి పోస్టులను అనుమతించాలి, ఎలాంటి కండీషన్లు పెట్టొచ్చు అనే నిర్ణయాధికారం ఈ సోషల్ మీడియా సైట్లకు అమెరికాలోని కమ్యూనికేషన్స్ డీసెన్స్ యాక్ట్... సెక్షన్ 230 కలిగిస్తోంది. ఈ సెక్షన్ ద్వారా... ఈ సంస్థలు ఎప్పటికప్పుడు తమ పాలసీలను మార్చుకోగలవు.
Published by: Krishna Kumar N
First published: October 3, 2020, 1:43 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading