• HOME
  • »
  • NEWS
  • »
  • INTERNATIONAL
  • »
  • FACEBOOK GIVES DOUBLE SHOCK TO TRUMP ONCE AGAIN AFTER HE POSTED VIDEO FROM HIS DAUGHTER IN LAW ACCOUNT HSN

Donald Trump: అధ్యక్ష పీఠం దిగిన తర్వాత.. డోనాల్డ్ ట్రంప్ మరో నిర్వాకం.. డబుల్ షాకిచ్చిన ఫేస్ బుక్..!

Donald Trump: అధ్యక్ష పీఠం దిగిన తర్వాత.. డోనాల్డ్ ట్రంప్ మరో నిర్వాకం.. డబుల్ షాకిచ్చిన ఫేస్ బుక్..!

డొనాల్డ్ ట్రంప్

అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కు ఫేస్ బుక్ సంస్థ డబుల్ షాకిచ్చింది. ఆయన చేసిన నిర్వాకానికి ఆయన కోడలి అకౌంట్ ప్రమాదంలో పడింది. ఇంతకీ అసలేం జరిగిందంటే..

  • Share this:
    అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ పదవి పోయినా తన తీరు మాత్రం మారనట్టు కనిపిస్తోంది. అధ్యక్ష పదవిలో ఉండగా నిత్యం వివాదాస్పద పోస్టులు, నెట్టింట వింత వింత వ్యాఖ్యానాలతో ట్రంప్ తెగ హడావిడీ చేసిన సంగతి తెలిసిందే. ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత జరిగిన పరిణామాల నేపథ్యంలో ట్విటర్, ఫేస్ బుక్ వంటి సోషల్ మీడియా ప్లాట్ ఫార్మ్స్ అన్నీ ట్రంప్ పై నిషేధం విధించాయి. ఆయన చేసే పోస్టుల వల్ల విద్వేషపూరిత ఘటనలు జరుగుతున్నాయనీ, అవాస్తవ ప్రచారాలు చేస్తున్నారని ఈ నిర్ణయం తీసుకున్నాయి. తమ మాధ్యమంలో ట్రంప్ ను నిషేధిస్తున్నట్టు ఏకంగా ఫేస్ బుక్ సీఈవో జుకర్ బర్గే స్వయంగా ప్రకటించడం గమనార్హం. తాజాగా మరోసారి అగ్రరాజ్య మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కు ఫేస్ బుక్ డబుల్ షాకిచ్చింది. ఇంతకీ అసలేం జరిగిందంటే..

    అధికారం కోల్పోయిన తర్వాత ట్రంప్ తన వ్యాపారాలను చూసుుంటారని అంతా అనుకున్నారు. ట్రంప్ కూడా అదే పనిలో ఉన్నప్పటికీ సోషల్ మీడియాను మాత్రం తెగ మిస్ అవుతున్నట్టు ఆయన ఫీలవుతున్నారనుకుంటా. అందుకే అప్పుడప్పుడు నెట్టింట ప్రత్యక్షమవడానికి, నెటిజన్ల రియాక్షన్లు తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. తనకు ఎలాగో ఫేస్ బుక్ ఖాతా లేదు, నిషేధించారు కాబట్టి ట్రంప్ రూటు మార్చారు. తన కుమారుడు ఎరిక్ ట్రంప్ భార్య అయిన లారా ట్రంప్ ఫేస్ బుక్ ఖాతాను ట్రంప్ దుర్వినియోగం చేసేందుకు యత్నించారు. ఆమె ఖాతాలో ట్రంప్ ఇంటర్వ్యూకు సంబంధించిన ఓ వీడియో పోస్ట్ ఒకటి సడన్ గా ప్రత్యక్షమయింది.

    అంతే, వెంటనే ఫేస్ బుక్ యాజమాన్యం రియాక్టయింది. ’మీరు పోస్ట్ చేసిన కంటెంట్ ను మేము తొలగించాం. డోనాల్డ్ ట్రంప్ నకు సంబంధించిన వీడియో పోస్టులు మళ్లీ మీ ఖాతాలో పోస్టు చేసినట్టయితే చర్యలు తీసుకోక తప్పదు. మా రూల్స్ ను పాటించకపోతే మీ ఖాతాను రద్దు చేయకతప్పదు‘ అనే అర్థంలో ఓ ఈమెయిల్ ను కూడా ఆమెకు పంపారు. కాగా, ఎన్నికల ఫలితాల అనంతరం ట్రంప్ చేసిన నిర్వాకాలకు సోషల్ మీడియానే ట్రంప్ ను బ్యాన్ చేసింది. క్యాపిటల్ భవన్ పైకి తన అనుచరులను దాడి చేసేలా ప్రోత్సహించేందుకు సామాజిక మాధ్యమాలనే ట్రంప్ వాడుకున్నారు.
    Published by:Hasaan Kandula
    First published:

    అగ్ర కథనాలు