ఉక్రెయిన్(Ukraine)లో చిక్కుకుపోయిన భారతీయుల్ని సురక్షితంగా స్వదేశానికి చేర్చే అంశంపైనే కేంద్రప్రభుత్వం తీవ్రంగా కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగానే ఇవాళ ప్రధానమంత్రి నరేంద్రమోదీ (Narendra Modi)ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. కేంద్ర మంత్రి పీయుష్గోయల్(Piyush Goyal), విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్ జైశంకర్(S Jaishankar)తో పాటు మరికొందరు ఉన్నతాధికారులు ఈ హైలెవెల్ మీటింగ్‌కి అటెండ్ అయ్యారు. రష్యా ఉక్రెయిన్‌పై దాడులు చేస్తున్న నాటి నుంచి ప్రస్తుతం వరకు కీవ్, ఖార్కివ్‌లో చిక్కుకున్న 1300 మంది భారతీయ విద్యార్ధులను ఇండియాకు చేరవేశారు. ఇక సుమీలో చిక్కుకున్న 700మంది విద్యార్దుల్ని సేఫ్‌గా భారత్‌కు చేరవేయమే కేంద్ర ప్రభుత్వం తమ ప్రధాన బాధ్యతగా భావిస్తోంది. ప్రస్తుతం ఉక్రెయిన్‌లో నెలకొన్న పరిస్థితి ..అక్కడ చిక్కుకుపోయిన భారతీ విద్యార్దులు ఎదుర్కొంటున్న తరలింపు సమస్యపైనే ఈ ఉన్నతస్థాయి సమావేశంలో ప్రధానంగా చర్చించారు. గత నెల 24వ తేది నుంచి రష్యా ఉక్రెయిన్‌పై బాంబులు విసరడం, వైమానిక దాడులకు పాల్పడుతూ వస్తోంది. సుమారు 9రోజులకుపైగా జరుగుతున్న మారణహోమం నుంచి బయటపడేందుకు ..పోరాడుతున్న భారతీయ విద్యార్దుల్ని తీసుకురావడానికి కేంద్రం అన్ని విధాలుగా కృషి చేస్తున్నట్లు సమావేశంలో ప్రధాని అభిప్రాయపడ్డారు. భారత ప్రభుత్వం 13వేల 300 మందిని సేఫ్‌గా ఇండియాకు చేర్చింది. ఆపరేషన్ గంగా పేరుతో ఈ ఆపరేషన్ని మొదలుపెట్టింది కేంద్రం. పరిస్థితిని సమన్వయ పరచడానికి ఉక్రెయిన్ పొరుగు దేశాలకు ప్రత్యేక దూతలుగా నలుగురు కేంద్ర మంత్రులను పంపారు ప్రధాని మోదీ.
ఉక్రెయిన్‌లో మనోళ్లందరిని రప్పిస్తాం..
సుమీలో చిక్కుకున్న 700మంది భారతీయ విద్యార్దుల్ని సాధ్యమైనంత త్వరగా ఇండియాకు తరలించే అంశంపైనే కేంద్రం దృష్టి పెట్టింది. మరో 24గంటల్లో స్టూడెంట్స్‌ని రప్పించేందుకు 13విమానాల్ని పంపుతున్నట్లుగా విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి అరిందమ్ బాగ్చి తెలిపారు. పిసోచిన్, సుమీ నుంచి కూడా మిగిలిన వాళ్లను భారతదేశానికి రప్పిస్తామని వెల్లడించారు. ఉక్రెయిన్‌లో భారతీయ విద్యార్దులు ఎవరూ లేకుండా తరలించే మార్గాల కోసమే అన్వేషిస్తున్నామని ఇప్పటికే స్పష్టం చేశారు.
కేంద్రం ముందున్న బాధ్యత..
భారతీయ విద్యార్ధుల్ని తీసుకొచ్చేందుకు చేపట్టిన ఆపరేషన్ గంగా కింద మరో 13 విమానాలు ఈరోజు పంపించడం జరిగిందన్నారు విదేశీ వ్యవహారాల మంత్రి జైశంకర్ ఉక్రెయిన్‌లో చిక్కుకున్న మరో 2500 మంది భారతీయ పౌరులను ఇండియాకు తరలిస్తామని ట్వీట్ చేశారు.ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన ఉన్నతస్థాయి సమావేశంలో భారతీయ విద్యార్ధుల్ని ఇండియాకు రప్పించడమే కేంద్రం ముందున్న లక్ష్యమన్నారు.
Another 13 flights under #OperationGanga today carrying approximately 2500 Indian nationals. https://t.co/QwPsIeXAqx
— Dr. S. Jaishankar (@DrSJaishankar) March 5, 2022
మళ్లీ మొదలైన యుద్ధం..
అటు యుద్ధానికి కొంత విరామం ప్రకటించిన రష్యా సుమారు ఆరు గంటల తర్వాత మళ్లీ యుద్ధాన్ని మొదలుపెట్టింది. నగరాలపై రష్యా సేనలు భీకర దాడులకు దిగారు. కీవ్ సమీపంలోని గ్రామాలపై రష్యా వైమానిక దాడులు జరపడంతో చిన్నారులు సహా పలువురు మృతి చెందినట్టు తెలుస్తోంది. వోల్నావోఖా నగరంపై క్షిపణులతో రష్యా దళాల దాడి చేశాయి. వోల్నావోఖా 90 శాతం నాశనమైందని స్థానిక ఎంపీ ప్రకటించారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Narendra modi, Russia-Ukraine War