news18-telugu
Updated: November 16, 2020, 9:19 AM IST
నంబర్ 2 మొహమ్మద్ అల్ మస్రీ హతం (credit - twitter)
Al Qaeda: ఈ ప్రపంచంలో మోస్ట్ పవర్ఫుల్, డేంజరస్ ఉగ్రవాద సంస్థ ఏది అని అడిగితే... ఎవరైనా సరే అల్ ఖైదా అని చెబుతారు. నిజమే... ఆ సంస్థ చాలా డేంజరస్. నేరాలను కూడా వ్యవస్థీకృత పద్ధతిలో చేస్తూ... ప్రపంచానికి పెను సవాలుగా మారింది. ఒకప్పటి చీఫ్ బిన్ లాడెన్‌ను అమెరికా దళాలు లేపేయడంతో... ఇక అల్ ఖైదా పని అయిపోయిందనుకున్నారు. కానీ ఆ సంస్థ ఏమాత్రం వెనక్కి తగ్గలేదు. ఆయా దేశాల్లో తన కార్యకలాపాలు సాగిస్తూ... ముఖ్యంగా అరబ్ దేశాల్లో తిష్టవేసింది. ఆ సంస్థంలో బిన్ లాడెన్ తర్వాత నెంబర్ 2గా ఉన్నాడు అబూ మొహమ్మద్ అల్ మస్రీ. త్వరలోనే సింహాసనం ఎక్కుదామనుకున్నాడు. అంతలోనే అమెరికా-ఇజ్రాయెల్ దళాలు జాయింట్ ఆపరేషన్ చేసి... కాల్చిచంపాయి. మస్రీతోపాటూ... ఆయన కూతురు మిరియమ్ను కూడా చంపేశాయి.
కారుపై కాల్పులు:మిరియమ్... బిన్ లాడెన్‌కి కోడలు. ఆమె భర్త హమ్జాను అమెరికా ఇదివరకే లేపేసింది. తాజాగా ఆగస్టులో... ఇరాన్లో మిస్రీ, మిరియం... కారులో వెళ్తుండగా... ఆమెరికా... ఇజ్రాయెల్ నిఘా సంస్థ మొసాద్కి మేటర్ చెప్పింది. వెంటనే కమాండో యూనిట్‌కి చెందిన ఇద్దరు బైక్‌పై బయల్దేరారు. కారు పక్కనుంచి వెళ్తూ... కాల్పులు జరిపారు. అంతే... బాడీల్లోకి బుల్లెట్లు దూసుకెళ్లాయి. కారంతా రక్తం చిందింది. ఇద్దరూ స్పాడ్ డెడ్ అయ్యారు.
డేంజరస్ మిస్రీ:
ఈజిఫ్ట్కి చెందిన మస్రీ వయసు 58 ఏళ్లు. అసలు పేరు అబ్దుల్లా మొహమ్మద్ అబ్దుల్లా. అల్ ఖైదాలో వ్యూహరచనా ఎక్స్‌పర్ట్‌గా పేరుంది. లాడెన్ చచ్చాక... అల్ జవహరి ఆ పోస్టులోకి ఎంటరయ్యాడు. రెండేళ్ల కిందట అనారోగ్యంతో మంచం పట్టాడు. ఆ తర్వాత మస్రీ ఎంటరయ్యాడు. సింహాసనం ఎక్కకపోయినా... అన్నీ తనే చూసుకుంటున్నాడు. సైలెంట్‌గా పని చేసే మిస్రీ... టూ డేంజరస్. చాలా రకాల ఉగ్రవాద దాడుల వెనుక అతని హస్తాలున్నాయి. అందుకే ఇప్పుడు అతన్ని లేపేశారు.
అల్‌ఖైదాకు ఏటా వేల కోట్ల రూపాయలు అడ్డగోలుగా వస్తున్నాయి. ఆ సంస్థకు ఇరాన్ అన్ని రకాలుగా అండగా ఉంటోందని అమెరికా మొదటి నుంచి మండిపడుతూనే ఉంది. బలమైన సపోర్ట్ ఉండటం వల్ల ఆ సంస్థ రెచ్చిపోతోంది. మిస్రీ లాంటి వాళ్లను లేపేయడం ద్వారా... అల్‌ఖైదా పని పూర్తిగా అయిపోకపోయినా... కొంతవరకూ దెబ్బతిన్నట్లే అనుకోవచ్చు.
ఇది కూడా చదవండి: సీఎం పదవి నుంచి జగన్‌ను తొలగించాలని పిల్. నేడు సుప్రీంకోర్టులో విచారణ
నెక్ట్స్ ఎవరు:
మిస్రీ ఇక లేడు కాబట్టి... నెక్ట్స్ ఎవరన్నది ఇప్పుడు తేలితే... అమెరికాకు కొత్త టార్కెట్ ఫిక్సవుతుంది. మిస్రీకి సమానమైన ర్యాంకుతో సైఫ్ అల్ ఆదిల్ అనే మరో ఉగ్రవాది క్యూలో ఉన్నాడు. అతనే నెక్ట్స్ చీఫ్ అవుతాడనే అంచనా ఉంది. ఐతే... అతను అంత సమర్థుడేమీ కాదన్న వాదన కూడా ఉంది. ఇదే సమయంలో... సిరియాలో ఐసిస్ (ISIS) ఉగ్రమూకలు రెచ్చిపోతున్నాయి. క్రమంగా అల్‌ఖైదా నుంచి ఉగ్రవాదాన్ని ఆ మూకలు లాక్కుంటున్నాయి. అందువల్ల త్వరలో అల్‌ఖైదా పని అయిపోయి... ఐసిస్ కీలక ఉగ్రవాద సంస్థగా మారొచ్చనే అంచనాలున్నాయి. ఈ రెండింటినీ అణచేసేలా అమెరికా ప్రయత్నిస్తోంది. జనవరి నుంచి జో బిడెన్ అమెరికా అధ్యక్షుడు కాబట్టి... మరి ఆయన ఈ ఉగ్రవాదం విషయంలో ఎలా వ్యవహరిస్తారన్నదాన్ని బట్టీ... ఈ సంస్థల మనుగడ ఆధారపడి ఉంటుంది.
Published by:
Krishna Kumar N
First published:
November 16, 2020, 9:18 AM IST