Home /News /international /

EXPERTS SAYS THAT NEW CORONA OMICRON VARIANT HAS SIX TIMES HIGHER POTENTIAL TO SPREAD THAN THE DELTA PRV

omicron variant: ఒమిక్రాన్​ డెల్టా కంటే ఆరు రెట్లు వేగంగా వ్యాప్తి చెందుతుందట.. శాస్త్రవేత్తలు ఏమంటున్నారంటే..

corona

corona

గతంలో వచ్చిన అన్ని కరోనా వైరస్​ల కంటే డెల్టా రకం అత్యంత ప్రమాదకరమైనదిగా గుర్తించిన సంగతి తెలిసిందే.  ఇదే క్రమంలో శాస్త్రవేత్తలు ఒమిక్రాన్​ వైరస్​పై పరిశోధనలు మొదలుపెట్టారు. అయితే ఈ ఒమిక్రాన్​ వేరియంట్​ డెల్టా కంటే ఆరు రెట్లు వేగంగా వ్యాప్తి చెందుతోందని శాస్త్రవేత్తలు తెలియజేయడం ఆందోళన కలిగిస్తోంది.

ఇంకా చదవండి ...
    కరోనా వైరస్ కొత్త వేరియంట్​ ఒమిక్రాన్ (Omicron variant) రూపాంతరం చెంది పలు దేశాలను కలవరపెడుతోంది. ఒమిక్రాన్ ట్రాన్స్మిసిబిలిటీని వ్యాక్సిన్‌లు ఏమాత్రం తట్టుకుంటాయో ప్రస్తుతానికైతే తెలియదు. ఈ నెల ప్రారంభంలో దక్షిణాఫ్రికాలో వెలుగుచూసిన ఈ కొత్త వేరియంట్.. ఇప్పటికే ఆ దేశాన్ని గడగడలాడిస్తోంది. అయితే ఈ కేసులు పలు దేశాల్లోనూ గుర్తించడంతో ప్రపంచదేశాలకు వణుకు మొదలైంది. గతంలో వచ్చిన అన్ని కరోనా వైరస్​ల కంటే సెకండ్​ వేవ్​లో భారత్​లో అల్లకల్లోలం సృష్టించిన డెల్టా రకం (delta variant) అత్యంత ప్రమాదకరమైనదిగా గుర్తించిన సంగతి తెలిసిందే.  ఇదే క్రమంలో శాస్త్రవేత్తలు ఒమిక్రాన్​ వైరస్​పై పరిశోధనలు మొదలుపెట్టారు. ఈ కొత్త రకం వేరియంట్‌తో అప్రమత్తంగా ఉండాలని ఆగ్నేయాసియా దేశాలను ప్రపంచ ఆరోగ్య సంస్థ (World Health Organization) హెచ్చ‌రించింది. ఈ దేశాలు క‌రోనా వైర‌స్ వ్యాప్తిపై నిఘా పెంచాలని, వ్యాప్తి అడ్డుకొట్ట‌కు త‌క్ష‌ణ‌మే చ‌ర్య‌లు చేప‌డితే మంచిద‌ని ఆగ్నేయాసియా ప్రాంత డబ్ల్యూహెచ్ఓ డైరెక్టర్ డాక్టర్ పూనం ఖేత్రపాల్ సింగ్ సూచించారు. అయితే ఈ ఒమిక్రాన్​ వేరియంట్​ డెల్టా కంటే ఆరు రెట్లు వేగంగా వ్యాప్తి చెందుతోందని ( six times higher potential to spread ) శాస్త్రవేత్తలు తెలియజేయడం ఆందోళన కలిగిస్తోంది.

    మోనోక్లోనల్ యాంటీబాడీ థెరపీ పనిచేస్తుందా?

    అంతేకాదు ఒమిక్రాన్​ వేరియంట్​ మోనోక్లోనల్ యాంటీబాడీ థెరపీ (monoclonal antibody therapy)కి లేదా కాక్‌టెయిల్ ట్రీట్​మెంట్ (cocktail treatment) ​కు కూడా ప్రతిస్పందించకపోవచ్చని నిపుణులు తెలిపారు. ఇది రోగనిరోధక వ్యవస్థ నుంచి కూడా తప్పించుకోగలదని చెబుతున్నారు. దీనిపై వ్యాక్సిన్ ఏ మేరకు పనిచేస్తుందో ఇపుడే చెప్పలేమని అంటున్నారు.

    మోనోక్లోనల్ యాంటీబాడీ థెరపీ (monoclonal antibody therapy) కోవిడ్​ సోకిన ప్రారంభ దశలో అద్భుతమైన చికిత్సగా పరిగణించాం. సెకండ్​ వేవ్​లో వచ్చని డెల్టా వేరియంట్​పై కూడా ఈ చికిత్స పనిచేసింది. అయితే డెల్టా ప్లస్​ వేరియంట్​ మాత్రం ఈ చికిత్సకు ప్రతిస్పందించలేదు. ఇపుడు ఇలాంటి వేరియంట్​ ఒమిక్రాన్​ కావొచ్చని నిపుణులు అభిప్రాయ పడుతున్నారు.

    32 మ్యుటేషన్‌లతో..

    IGIBలోని రీసెర్చ్ స్కాలర్ మెర్సీ రోఫినా (Mercy Rophina, research scholar at IGIB) వివరాలు వెల్లడిస్తూ.. ఈ ఒమిక్రాన్​ వేరియంట్​ స్పైక్ ప్రోటీన్ (spike protein) లో 32 మ్యుటేషన్‌లతో కలిపి దాదాపు 53 వేరియంట్​లలో వ్యాప్తి చెందవచ్చని తెలిపారు.  రోగ నిరోధక శక్తి, ఇతర క్రియాత్మక చర్యలకి వ్యతిరేకంగా పనిచేసే విధంగా రూపాంతరం చెందిందని అన్నారు. ఒమిక్రాన్​ వేరియంట్లలో G339D, 5373P.04965, Q498R మరియు Y505Hలలో స్పైక్ రిసెప్టర్ బైండింగ్ డొమైన్‌తో కూడిన ఆరు వేరియంట్‌లు మోనోక్లోనల్ యాంటీబాడీస్ (mAbs)కు నిరోధకతను కలిగి ఉన్నాయని రోఫినా ఆందోళన వ్యక్తం చేశారు.

    ఇతర వేరియంట్​ల కంటే ఇది అత్యంత వేగంగా వ్యాప్తి..

    జీనోమ్ సైన్సెస్‌లో నిపుణుడైన స్కారియా స్పందిస్తూ.. ఇజ్రాయెల్​లో వెలుగుచూసిన B.1.1.529 వేరియంట్​ బాధితుల్లో వ్యాక్సిన్​ వేసుకున్న వారు ఉన్నారని తెలిపారు. B.1.1. 529 వేరియంట్‌లు దక్షిణాఫ్రికాలో వేగంగా వ్యాప్తి చెందుతున్నట్లు అనిపించిందని, మనం గతంలో చూసిన ఇతర వేరియంట్​ల కంటే ఇది అత్యంత వేగంగా వ్యాప్తి చెందుతోందని వివరించారు. అంతేకాకుండా రెండు వారాల్లోనే దక్షిణాఫ్రికాలో దీని వ్యాప్తి 75 శాతం పెరిగిందని తెలిపారు.
    Published by:Prabhakar Vaddi
    First published:

    Tags: Corona, Delta Variant, Omicron corona variant

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు