Home /News /international /

EXOTIC WHITE SPOT VIRUS KILLING PRAWNS AND CRABS IN AUSTRALIA DETAILS HERE MS GH

White Spot Virus: అక్కడ ఆక్వాకల్చర్ ఢమాల్.. స్పాట్ వైరసే కారణం.. ఏమిటీ వైరస్..?

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

White Spot Virus: పలు దేశాల్లో బర్డ్ ఫ్లూ (bird flu) ప్రబలి పౌల్ట్రీ రంగం చావుదెబ్బ తింటుండగా.. ఆస్ట్రేలియా (Australia) ఆక్వాకల్చర్ (Aquaculture) ఇప్పుడు సంక్షోభంలో కూరుకుపోతోంది. ఆస్ట్రేలియాలో ఆక్వాకల్చర్ ను పలు రోగాలు పట్టిపీడిస్తున్నాయి.

ఇంకా చదవండి ...
  • News18
  • Last Updated :
ఓవైపు కరోనా వైరస్ (Coronavirus) మరోవైపు బర్డ్ ఫ్లూ వైరస్ ఇవి చాలదన్నట్టు మరో వైరస్ కూడా శరవేగంగా వ్యాపిస్తోంది. పలు దేశాల్లో బర్డ్ ఫ్లూ (bird flu) ప్రబలి పౌల్ట్రీ రంగం చావుదెబ్బ తింటుండగా.. ఆస్ట్రేలియా (Australia) ఆక్వాకల్చర్ (Aquaculture) ఇప్పుడు సంక్షోభంలో కూరుకుపోతోంది. ఆస్ట్రేలియాలో ఆక్వాకల్చర్ ను పలు రోగాలు పట్టిపీడిస్తున్నాయి. ఇక్కడి సౌత్-ఈస్ట్ క్వీన్స్ ల్యాండ్ లో రొయ్యలు, పీతలకు తెల్ల మచ్చల వ్యాధి పెద్ద ఎత్తున సోకుతోంది. ఈ వైట్ స్పాట్ వైరస్ తో (white spot virus) ఇక్కడి ఆక్వాకల్చర్ నష్టాల్లో మునిగిపోతుండగా విదేశాల నుంచి రొయ్యలు, పీతల దిగుమతికి విపరీతంగా డిమాండ్ పెరుగుతోంది. బయోసెక్యూరిటీ లోపించటంతోనే మెరైన్ ఫుడ్ ఇలా విషపూరితంగా మారుతోందనే ఆందోళన ఇప్పుడు ఆస్ట్రేలియాను పట్టిపీడిస్తోంది.

2016లోనూ ఇలాంటి వైట్ స్పాట్ వైరస్ ఇక్కడి ఆక్వా రంగాన్ని కుదేలు చేసింది. ముఖ్యంగా ఇక్కడ ఉన్న లోగన్ నది పరివాహక ప్రాంతంలో ఇప్పుడు ఈ వైరస్ కబళించేసింది. అయితే ఇప్పట్లో ఈ వ్యాధి తగ్గదని ఆస్ట్రేలియాలో మెరైన్ ఫుడ్ ఎక్స్ పర్ట్స్ రైతులను అప్రమత్తం చేస్తున్నారు.

ఏమిటీ వైట్ స్పాట్ వైరస్?

రొయ్యలు, పీతలు వంటి వాటి శరీరం, మొప్పలు ఎరుపు లేదా గోధుమ రంగులోకి మారతాయి. చెరువు గట్ల దగ్గరకువచ్చి రొయ్యలు ఎక్కువగా చనిపోతాయి. ఈ వ్యాధికి చిక్సిత లేదు. కాబట్టి ఉత్తమ మార్గంగా పంటల మధ్య కనీసం 2 నెలలు విరామం ఇస్తారు. ఈనేపథ్యంలో ఇక్కడి చాలా రొయ్యల చెరువులు ఇప్పుడు పంట పెట్టడాన్ని నిలుపుదల చేశారు.

బయోసెక్యూరిటీ లోపం..

బయోసెక్యూరిటీ లోపిస్తే ఆక్వా పంట ఇలా వైరస్ పాలవుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రస్తుతం ఆస్ట్రేలియా ఎదుర్కొంటున్న అతి పెద్ద సమస్యల్లో బయోసెక్యూరిటీ కూడా వచ్చి చేరింది. నీటిలో సేంద్రియ పదార్ధాలు పేరుకు పోకుండా జాగ్రత్తలు తీసుకునే పనుల్లో ఇప్పుడు ఇక్కడి ఆక్వారంగం ప్రత్యేక దృష్టిసారిస్తోంది. దీంతో ఇక్కడి ఆక్వా రంగంలో బయో సెక్యూరిటీ వంటి చర్యలు చేపట్టేందుకు ఇక్కడి ఫెడరల్ సర్కారు ప్రయత్నాలు జోరుగా చేస్తోంది. రొయ్యల సాగు నిర్వహణలో లోపాలు ఇలాంటి భారీ నష్టాలకు దారితీస్తుంది. శాస్త్రీయ సాగు చేయకపోవటంతో ఈ వైట్ స్పాట్ వ్యాధి ప్రబలుతున్నట్టు శాస్త్రజ్ఞులు చెబుతున్నారు. ఆంధ్రప్రదేశ్ కోస్తా తీర ప్రాంతాల్లో రొయ్యల సాగు విస్తారంగా ఉండగా ఇక్కడ కూడా తెల్ల మచ్చల వ్యాధి సాగు రైతులను ఆందోళనకు గురిచేస్తోంది.

మనుషులకేం ప్రమాదం లేదు..

అయితే ఈ వ్యాధి సోకిన రొయ్యలు, పీతలను బాగా ఉడికించుకుని వండుకుని తింటే మనుషులకు ఎలాంటి హాని జరగదని వైద్యులు స్పష్టంచేస్తున్నారు. కానీ బాగా ఉండికించకపోతే మాత్రం అనారోగ్య సమస్యలు తలెత్తవచ్చు. ఇక ఈ తెల్లమచ్చల వ్యాధి సోకిన రొయ్యలున్న తోటలో వెంటనే క్రిమిసంహారక మందులు పిచికారీ చేయకపోతే మాత్రం గంటల్లోనే సమీపంలోని రొయ్యల చెరువులన్నీ ఈ వైరస్ బారినపడటం ఖాయం.
Published by:Srinivas Munigala
First published:

Tags: Australia, Bird Flu, Corona virus, International news, Virus

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు