Home /News /international /

EX AFGHANISTAN MINISTER SYED AHMAD SHAH SADAT NOW PIZZA DELIVERY BOY HERE PHOTOS NS

Ex-Afghanistan Minister: పాపం.. పరాయి దేశంలో పిజ్జాలు డెలివరీ చేస్తున్న ఆఫ్గనిస్తాన్ మాజీ మంత్రి.. వైరల్ గా మారిన ఫొటోలు..

పిజ్జా డెలివరీ చేస్తున్న అఫ్గనిస్తాన్ మాజీ మంత్రి

పిజ్జా డెలివరీ చేస్తున్న అఫ్గనిస్తాన్ మాజీ మంత్రి

అఫ్గనిస్తాన్ మంత్రి పిజ్జా డెలివరీ బాయ్ గా మారి కుటుంబాన్ని పోషిస్తున్నారు. ఏ ఉద్యోగం దొరకకపోవడంతో కుటుంబం కోసం ఈ పని చేయాల్సి వచ్చిందని ఆయన చెబుతున్నారు.

    సాధారణంగా ఎవరైనా ఒక్క సారి మంత్రిగా పని చేశారంటే వాళ్ల రేంజ్ మారిపోతుంది. పదవి పోయినా.. జీవితాంతం ఓ లెవల్ మాత్రం మెయింటేన్ చేస్తూ ఉంటారు. కానీ దేశానికే మంత్రిగా పని చేసిన ఓ వ్యక్తి మాత్రం పదవి పోయిన తర్వాత పిజ్జా డెలివరీ బాయ్ గా మారారు. కుటుంబ పోషణ కోసం సైకిల్ పై తిరుగుతూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. మంత్రి పదవి నుంచి పిజ్జా డెలివరీ బాయ్ గా మారినా తాను మాత్రం సంతోషంగానే ఉన్నానని ఆయన చెబుతున్నారు. ఇంతకు ఆయన ఎవరు? ఆయన కథేంటి? తదితర వివరాలు.. సయ్యద్ అహ్మద్ షా సాదత్ అనే వ్యక్తి 2018 వరకు ఆఫ్గనిస్తాన్ ఐటీ శాఖ మంత్రిగా పని చేశారు. అయితే ఆ సమయంలో ఆఫ్గాన్ ఘనీతో విభేదాలు రావం, తాలిబన్ల అజెండాకు భయపడడం తదితర కారణాలతో ఆయన తన మంత్రి పదవిని వదులుకోవాలని నిర్ణయానికి వచ్చారు. ఈ నేపథ్యంలో 2018లో తన మంత్రి పదవికి రాజీనామా చేశారు. అనంతరం మంత్రిగా పని చేసిన దేశాన్ని సైతం విడిచిపెట్టారు. దీంతో ఇక కుటుంబంతో సహా జర్మన్ దేశానికి వెళ్లి అక్కడ ఉద్యోగాల కోసం ప్రయత్నించాడు. అయితే ఎన్ని ఉద్యోగాలకు ట్రై చేసిన ఫలితం దక్కలేదు. దీంతో ఆయన ఆర్థిక సమస్యలు రెట్టింపయ్యాయి.  ఇక చివరికి పిజ్జా డెలివరీ బాయ్ గా మారారు. దీంతో వచ్చిన డబ్బులతో కుటుంబాన్ని పోషిస్తున్నాడు సయ్యద్.

    టెలికాం కంపెనీలో పని చేయాలన్నది తన లక్ష్యమని చెబుతున్నారు. తన లక్ష్యాన్ని చేరుకుంటానని ఆయన ధీమాగా ఉన్నారు కూడా. అయితే సయ్యద్ పెద్దగా చదువుకోలేదు అనుకుంటే మాత్రం పొరపాటే. ఆయన ప్రపంచంలోనే అత్యంత ప్రముఖ విశ్వవిద్యాలయమైన ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీలో ఉన్నత విద్యను అభ్యసించడం విశేషం. ఎలక్ట్రానిక్ ఇంజనీరింగ్ విభాగంలో మాస్టర్స్ డిగ్రీతో కమ్యూనికేషన్ డిగ్రీని ఆయన పొందారు. 13 దేశాల్లో కమ్యూనికేషన్ విభాగంలో 23 ఏళ్ల పాటు ఆయన పని చేయడం మరో రికార్డు.
    Afghanistan: అఫ్గాన్‌లో భారత్‌ ఆస్తుల విధ్వంసానికి ఐఎస్‌ఐ కుట్ర.. రంగంలోకి కొత్త ఉగ్రవాద సంస్థ



    కానీ ఇంత అనుభవం ఉన్నా.. ఇన్ని విద్యార్హతలు ఉన్నా.. కూడా ఆయన ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో పిజ్జా డెలివరీ బాయ్ కాన్నా పెద్ద ఉద్యోగాన్ని పొందలేకపోవడం దురదృష్ట్యకరమని నెటిజన్లు స్పందిస్తున్నారు. సయ్యద్ పిజ్జా డెలివరీకి తిరుగుతున్న ఫొటోలతో పాటు ఆయన మంత్రిగా పని చేసినప్పటి ఫొటోలు తాజాగా వైరల్ గా మారాయి. అనేక మంత్రి నెటిజన్లు సయ్యద్ మీరు సూపర్ అంటూ కామెంట్లు పెట్టి అభినందిస్తున్నారు. చదవిని చదువుకు తగిన ఉద్యోగాలు రాలేదని బాధపడే వారు ఆయనని ఆదర్శంగా తీసుకుని దొరికిన పనిని చేసుకుని జీవించాలని మరి కొందరు కామెంట్లు పెడుతున్నారు.
    Published by:Nikhil Kumar S
    First published:

    Tags: Afghanistan, Food delivery, Germany

    తదుపరి వార్తలు