విమానం కూలి 157 మంది దుర్మరణం

149 మంది ప్రయాణికులు ఎనిమిది మంది సిబ్బంది ఉన్నట్టు తెలిసింది. స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 8.44 గంటలకు ఇథియోపియా విమానం కూలిపోయింది.

news18-telugu
Updated: March 10, 2019, 4:12 PM IST
విమానం కూలి 157 మంది దుర్మరణం
ఇథియోపియన్ ఎయిర్‌లైన్స్ విమానం
news18-telugu
Updated: March 10, 2019, 4:12 PM IST
ఇథియోపియన్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానం కుప్పకూలింది. అదిస్ అబాబా నుంచి నైరోబీకి వెళ్తున్న విమానం కుప్పకూలినట్టు ఆసంస్థ అధికార ప్రతినిధి రాయిటర్స్ వార్తాసంస్థకు తెలిపారు. ఆ విమానంలో 157 మంది ప్రయాణిస్తున్నారు. 149 మంది ప్రయాణికులు ఎనిమిది మంది సిబ్బంది ఉన్నట్టు తెలిసింది. స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 8.44 గంటలకు ఇథియోపియా విమానం కూలిపోయింది. విమానంలో ఉన్న అందరూ చనిపోయినట్టు రాయిటర్స్ వార్తాసంస్థ ధ్రువీకరించింది. మరోవైపు విమానం కూలిన ఘటనపై ఇథియోపియా ప్రధాని కార్యాలయం సంతాపం ప్రకటించింది. ‘ఇథియోపియన్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన బోయింగ్ 737 విమానం కూలిపోయింది. ప్రమాదంలో బాధిత కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నాం.’ అని ప్రధానమంత్రి కార్యాలయం ట్వీట్ చేసింది.First published: March 10, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...