3 నెలలు... 3800 కి.మీ... మక్కాకు సైకిళ్లపై ఇండియన్స్...

Krishna Kumar N | news18-telugu
Updated: May 26, 2019, 10:38 AM IST
3 నెలలు... 3800 కి.మీ... మక్కాకు సైకిళ్లపై ఇండియన్స్...
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
మహ్మద్ సలీమ్ (53), అతని ఫ్రెండ్ రిజ్వాన్ అహ్మద్ ఖాన్... అనితర సాధ్యమైనది ఏదైనా చెయ్యాలనుకున్నారు. సైకిళ్లపై తన ప్రయాణం ప్రారంభించారు. అసలే తీవ్రమైన ఎండలు, ఆపై ఉపవాస దీక్ష చేస్తూ వాళ్లు తమ యాత్ర సాగిస్తుండటం విశేషం. మధ్యలో ఓ చోట బందార్ అబ్బాస్ నుంచీ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE)కి ఫెర్రీ బోట్‌లో వెళ్తున్నప్పుడు సైకిళ్లు మాయమయ్యాయి. సరిగ్గా ఆ రోజే వాళ్లు రంజాన్ ఉపవాసం మొదలుపెట్టారు. పైగా ఆ రోజు తీవ్ర ఎండ ఉంది. షార్జా పోర్టులో ప్రజలు... ఆ సైకిళ్లను కనిపెట్టేందుకు సహకరించారు. అలా వారు పోగొట్టుకున్న సైకిళ్లు తిరిగి దొరికాయి. ఈ 3800 కిలోమీటర్ల జర్నీలో వాళ్లిద్దరూ రకరకాల సంస్కృతులు, సంప్రదాయాల్ని చూశారు. రకరకాల ఆహారాలు తిన్నారు. ఎంతో ఆనందంగా ఉందన్నారు సలీమ్.

సలీమ్, అహ్మద్ ఖాన్... ఇండియాలో దాదాపు 1300 కిలోమీటర్లు వెళ్లారు. ఆ తర్వాత ఒమన్ దేశంలో ప్రవేశించి మరో 800 కిలోమీటర్లు వెళ్లారు. అక్కడి నుంచీ ఇరాన్‌లో 1700 కిలోమీటర్లు ప్రయాణించారు. నిజానికి వాళ్లు ఇండియా, పాకిస్థాన్, ఇరాన్, ఇరాక్, కువైట్, సౌదీ అరేబియాకు సైకిళ్లపై వెళ్లాలనుకున్నారు.

పాకిస్థాన్, ఇరాన్‌కి వీసా పొందడం అంత తేలిక కాదు. అందువల్ల వాళ్లు ఒమన్‌కి సైకిళ్లపై వెళ్లి... ఇరాన్ రాజధాని టెహ్రాన్‌కు విమానంలో వెళ్లి, బందార్ అబ్బాస్ చేరుకోవాలనుకున్నారు. అక్కడి నుంచీ UAE మీదుగా సౌదీ అరేబియా వెళ్లాలనుకున్నారు. ఆగస్టు 9న హజ్ ప్రారంభమవుతుండగా అంతకంటే ముందు జులై 25న వాళ్లు మక్కా చేరుకోవాలనుకున్నారు.

ప్రస్తుతం వాళ్లు సౌదీ సరిహద్దులకు వెళ్లబోతున్నారు. అక్కడి నుంచీ రియాద్, ఆపై మదీనాకు వెళ్లి... మక్కా చేరనున్నారు. ఇలాంటి సాహసాలు సలీమ్ ఇంతకు ముందు కూడా చేశారు. 35 ఏళ్లుగా సైకిల్ తొక్కుతున్న ఆయన... మూడుసార్లు స్టేట్ చాంపియన్‌గా నిలిచారు. 1989లో కువైట్ నుంచీ దుబాయ్‌కి సైకిల్‌పై వెళ్లారు. ప్రస్తుతం సలీమ్, అహ్మద్ ఖాన్... రోజూ 75 నుంచీ 100 కిలోమీటర్లు సైకిళ్లపై వెళ్తున్నారు.

 

ఇవి కూడా చదవండి :

విమానంలో మహిళతో ఆకతాయి వెకిలిచేష్టలు... ఆమె ముందు పాంట్స్ జిప్ తీసి...పాపం చిన్నారి... మరో గుడ్డు అడిగితే... సలసలా కాగే కిచిడీని మీద పోసి...

ఈ ఇంజెక్షన్ రేటు రూ.14 కోట్లు... ఎందుకో తెలుసా...

వైసీపీ ప్రభుత్వ సలహాదారుగా ఉండవల్లి... పోలవరం కోసం ఆయన సేవల్ని వాడుకుంటారా?
First published: May 26, 2019, 10:38 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading