జపాన్‌లో అక్షరాలా 84 లక్షల ఇళ్లు ఖాళీగా ఉన్నాయి. అవును... వందలు, వేలు కాదు... ఏకంగా 84,60,000 ఇళ్లు ఖాళీగా ఉన్నాయని తాజా లెక్కలు చెబుతున్నాయి. జపాన్‌లో ఉన్న మొత్తం ఇళ్లల్లో ఇది 13.6 శాతం. నిక్కీ ఏసియాన్ రివ్యూ తేల్చిన నిజాలివి. ఖాళీ ఉన్నవాటిలో కొన్ని అమ్మకానికి సిద్ధంగా ఉండగా, ఇంకొన్ని అద్దెకు వచ్చేవారి కోసం ఖాళీగా ఉంచారు. ఇంకొన్ని వెకేషన్ కోసం వచ్చేవారు బుక్ చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాయి. మౌంట్ ఫుజీలోని ఉత్తర భాగంలో అద్దె రేట్లు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఆ ప్రాంతం హాలిడే హోమ్స్‌కు ప్రసిద్ధి కావడమే కారణం. జపాన్‌లో ప్రతీ ఏడు ఇళ్లకు ఒక ఇల్లు ఖాళీగా ఉంది. లక్షల్లో ఇళ్లు ఖాళీగా ఉన్న దేశం ఇదే కావచ్చన్న వాదన వినిపిస్తోంది. 2017లో చైనాలో ఓ సర్వే నిర్వహిస్తే పట్టణ ప్రాంతంలో ఐదు ఇళ్లకు ఒక ఇల్లు ఖాళీగా ఉన్నట్టు తేలింది.
జపాన్‌లో ఇలా లక్షల్లో ఇళ్లు ఖాళీగా ఉండటానికి ప్రజలు గ్రామాల నుంచి పట్టణాలకు వలస వెళ్లడం ఒక కారణమైతే, జనాభా తగ్గుతుండటం మరో కారణమన్న వాదన వినిపిస్తోంది. లక్షల్లో ఇళ్లు ఖాళీగా ఉన్నా వాటిని కొనేవాళ్లు, అద్దెకు వచ్చేవాళ్లు లేరు. కొన్ని ఇళ్లు శిథిలావస్థకు చేరాయి. దీంతో వాటిని కూల్చివేయక తప్పట్లేదు. కూల్చి వేస్తున్నప్పుడు ఆ ఇళ్లల్లో నగదు బయటపడ్డ సందర్భాలు ఉన్నాయి. 2018లో టోక్యోలో కూల్చివేతలు చేపడితే సుమారు సుమారు కోటిన్నర రూపాయలు బయటపడ్డాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.