EMMANUEL MACRON IS RE ELECTED AS FRANCE PRESIDENT PVN
Emmanuel Macron : రికార్డులు తిరగరాస్తూ..ఫ్రాన్స్ అధ్యక్ష పీఠం మళ్లీ మెక్రాన్ దే
ఇమ్మాన్యుయేల్ మెక్రాన్(ఫైల్ ఫొటో)
Emmanuel Macron Re Elected : ఐదేళ్ల క్రితం జరిగిన ఎన్నికల్లో మరీన్ లీపై గెలిచి 39 ఏళ్ల మెక్రాన్ ఫ్రాన్స్ లో అతిపిన్న వయసు గల అధ్యక్షుడిగా రికార్డులకెక్కిన విషయం తెలిసిందే. కేవలం ఐదేళ్లలో అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ రాజకీయాల్లో యువనేతగా ఎదిగారు. యూరోపియన్ యూనియన్‌లో కీలక నిర్ణయాలు తీసుకునే ప్రధాన ప్రపంచ నాయకుడిగా ఎదిగిన మెక్రాన్.. ఉక్రెయిన్- రష్యా యుద్ధాన్ని ముగించే ప్రయత్నాలలో దౌత్యవేత్తగా పాల్గొన్నాడు.
France Election Results : ఫ్రాన్స్ అధ్యక్ష పీఠం మరోసారి ప్రస్తుత అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మెక్రాన్(Emmanuel Macron) నే వరించింది. ఇటీవల జరిగిన ఫ్రాన్స్ అధ్యక్ష ఎన్నికల్లో ప్రత్యర్థి మెరీన్ లీ పెన్‌పై మెక్రాన్ స్పష్టమైన విజయం సాధించారు. మాక్రాన్‌కు 58 శాతం ఓట్లు రాగా, పెన్కు 42 శాతం ఓట్లు పడ్డాయి.అధికారిక ఫలితాలు వెలువడక ముందే ప్రత్యర్థి మరీన్ లీపెన్ ఓటమిని అంగీకరించారు.ప్రెసిడెంట్ ఎన్నికల్లో ఫ్రెంచ్ రైట్ రైట్ వింగ్ నేత మెరైన్ లీ పెన్ విజయం సాధిస్తారని ఇటు మీడియా సంస్థలు, ఎక్జ్సిస్ట్ పోల్స్ ప్రకటించిన విషయం తెలిసిందే. లీ పెన్ కూడా తానే అఖండ విజయం సాధిస్తానని పెన్ పేర్కొన్నారు. ఈ అంచనాలన్నింటీని మెక్రాన్ తిరగరాస్తూ ఘన విజయం సాధించారు. కాగా, గడిచిన 20 ఏళ్లలో వరుసగా రెండు సార్లు ఫ్రాన్స్(France) అధ్యక్షుడైన వ్యక్తిగా మాక్రాన్ రికార్డు సృష్టించారు. మెక్రాన్ విజయం సాధించడంతో ఆయన మద్దతుదారులు ఈఫిల్ టవర్ ముందు జాతీయ గీతాన్ని పాడుతూ ఫ్రాన్స్, యూరోపియన్ జెండాలను ఊపారు.
తాజా విజయంతో మరో ఐదేండ్ల పాటు ఫ్రాన్స్ అధ్యక్షడిగా మెక్రాన్ కొనసాగనున్నారు. మెక్రాన్ విజయంపై పలువురు ప్రముఖులు అభినందులు తెలిపారు. కాగా, ఉక్రెయిన్ పై రష్యా యుద్ధం చేస్తున్న వేళ మెక్రాన్ రెండోసారి ఎన్నికవడం కీలకంగా మారింది. మెక్రాన్ రెండోసారి ఎన్నికవడం ఫ్రాన్స్ సహా యూరోపియన్ యూనియన్ లో నాయకత్వ స్థిరత్వానికి హామీ ఇచ్చినట్లు అయిందని పలువురు అభిప్రాయపడుతున్నారు.
ఐదేళ్ల క్రితం జరిగిన ఎన్నికల్లో మరీన్ లీపై గెలిచి 39 ఏళ్ల మెక్రాన్ ఫ్రాన్స్ లో అతిపిన్న వయసు గల అధ్యక్షుడిగా రికార్డులకెక్కిన విషయం తెలిసిందే. కేవలం ఐదేళ్లలో అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ రాజకీయాల్లో యువనేతగా ఎదిగారు. యూరోపియన్ యూనియన్‌లో కీలక నిర్ణయాలు తీసుకునే ప్రధాన ప్రపంచ నాయకుడిగా ఎదిగిన మెక్రాన్.. ఉక్రెయిన్- రష్యా యుద్ధాన్ని ముగించే ప్రయత్నాలలో దౌత్యవేత్తగా పాల్గొన్నాడు. బాహాటంగా మాట్లాడే మాక్రాన్, తన కనికరంలేని దౌత్య క్రియాశీలతతో తన స్వంత మార్గాన్ని ఎంచుకున్నారు. అంతర్జాతీయంగా తనకంటూ ఒక సముచిత స్థానాన్ని ఏర్పరచుకున్నాడు. రెండవసారి ఫ్రెంచ్ అధ్యక్షుడిగా తిరిగి ఎన్నికైన మెక్రాన్‌కు ప్రపంచవ్యాప్తంగా నాయకుల నుండి అభినందనలు వెల్లువెత్తాయి. మెక్రాన్‌తో కలిసి ఫ్రాన్స్, ఐరోపాలను మరింత అభివృద్ధి చేస్తామని ఈయూ చీఫ్ ఉర్సులా వాన్‌డర్ లేయెన్ ట్వీట్ చేశారు. ఈయూ, నాటోలో విస్తృతమైన సహకారాన్ని కొనసాగించాలని ఆశిస్తున్నట్లు తెలిపారు.
రెండవసారి ఫ్రెంచ్ అధ్యక్షుడిగా తిరిగి ఎన్నికైన మెక్రాన్ కు..బ్రిటన్ ప్రధాన మంత్రి బోరిస్ జాన్సన్ అభినందనలు తెలిపారు. "ఫ్రాన్స్ మా అత్యంత సన్నిహిత, అత్యంత ముఖ్యమైన మిత్రదేశాలలో ఒకటి. ఫ్రాన్స్ అధ్యక్షుడిగా మెక్రాన్ మళ్లీ ఎన్నికైనందుకు అభినందనలు" అని బోరిస్ అన్నారు. ఫ్రాన్స్ తమకు అత్యంత సన్నిహితమైన, అత్యంత ముఖ్యమైన మిత్రదేశాలలో ఒకటని, అత్యంత ముఖ్యమైన సమస్యలపై కలిసి పని చేయాలని ఎదురుచూస్తున్నామని బోరిస్ తెలిపారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనామ్.. మెక్రాన్ ను అభినందించారు. ఆరోగ్యకరమైన, సురక్షితమైన, న్యాయమైన ప్రపంచం కోసం ఫ్రాన్స్, WHO మధ్య భాగస్వామ్యాన్ని కొనసాగించడానికి ఎదురుచూస్తున్నామని టెడ్రోస్ పేర్కొన్నారు. కెనడా ప్రధాన మంత్రి జస్టిన్ ట్రూడో మాట్లాడుతూ.. అత్యంత ముఖ్యమైన సమస్యలపై కెనడా, ఫ్రాన్స్ లు కలిసి పని చేయలని ఎదురుచూస్తున్నామనీ, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడం, వాతావరణ మార్పులతో పోరాడటం, ఉపాధి మార్గాలను సృష్టించడంపై కలిసి పని చేద్దామని ఆశించారు.
Published by:Venkaiah Naidu
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.