ఫ్యాషన్ డిజైనర్ కేట్ స్పెడ్ ఆత్మహత్య!

తన అపార్ట్ మెంట్ భవనంలో ఆత్మహత్యకు పాల్పడిన అమెరికన్ ఫ్యాషన్ డిజైనర్

Chinthakindhi.Ramu | news18
Updated: June 6, 2019, 2:23 PM IST
ఫ్యాషన్ డిజైనర్ కేట్ స్పెడ్ ఆత్మహత్య!
తన అపార్ట్ మెంట్ భవనంలో ఆత్మహత్యకు పాల్పడిన అమెరికన్ ఫ్యాషన్ డిజైనర్
  • News18
  • Last Updated: June 6, 2019, 2:23 PM IST
  • Share this:
ఫ్యాషన్ ప్రపంచంలో తిరుగులేని ఇమేజ్ సొంతం చేసుకున్న అమెరికన్ ఫ్యాషన్ డిజైనర్ కేట్ స్పెడ్ ఆత్మహత్యకు పాల్పడింది. తన అపార్ట్ మెంట్ భవనంలో అనుమానాస్పదంగా మృతి చెందిన ఆమెను, హౌస్ కీపింగ్ సిబ్బంది గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. ఆమె కూతురికి సూసైడ్ నోటు రాసిపెట్టిన కేట్ స్పెడ్ ఆకస్మిక మరణానికి ఇంకా కారణాలు తెలియరాలేదు.

ఓ మహిళా ఫ్యాషన్ మ్యాగజైన్లో యాక్ససరీ డిజైనర్ గా కెరీర్ మొదలెట్టిన కేట్ స్పెడ్, అసలు పేరు ‘కేట్ వాలెంటైన్’. 1993లో స్వంతంగా ‘కేట్ స్పెడ్ న్యూయార్క్’ పేరుతో ఓ ఫ్యాషన్ హ్యాండ్ బ్యాగ్ తయారీ సంస్థను స్థాపించింది. భర్తతో కలిసి స్థాపించిన ఈ సంస్థ కొద్ది కాలంలోనే మంచి పాపులారిటీ సంపాదించింది. మొదట్లో స్టైలిష్, లగ్జరీ హ్యాండ్ బ్యాగులను మాత్రమే తయారుచేసినా తర్వాత వస్త్రాలు, జ్యూవెలరీ, షూస్ వంటి అనేక వస్తువులను విక్రయించడం మొదలుపెట్టింది. అత్యంత ఖరీదైన కేట్ స్పెడ్ వస్తువులను వాడడం లగ్జరీగా ఫీల్ అయ్యేవారు అమెరికన్ వాసులు. ‘కేట్ స్పెడ్ అట్ హోమ్’ పేరుతో ఇంటికి కావల్సిన వస్తువుల ఉత్పత్తి కూడా మొదలెట్టింది కేట్. కంపెనీ స్థాపించిన ఆరేళ్ల తర్వాత దాన్ని అమ్మేసింది కేట్ స్పెడ్.ఆ తర్వాత ఆమె స్థాపించిన ‘ఫ్రాన్సెస్ వాలెంటైన్’, ‘ఎంపానమస్’ సంస్థలకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు లభించింది. ప్రస్తుతం దాదాపు 315 స్టోర్స్ కేట్ స్పెడ్ పేరిట ఉన్నాయి. వాటి విలువ 2.4 బిలియన్ డాలర్స్ ఉంటుందని అంచనా. ఫ్యాషన్ ఉత్పత్తుల తయారీలో తనదైన ముద్ర వేసిన కేట్ స్పెడ్ అనేక అవార్డులను కూడా సొంతం చేసుకుంది. 55 ఏళ్ల కేట్ స్పెడ్ ఆకస్మిక మరణంతో ఫ్యాషన్ ప్రపంచం షాక్ కు గురయ్యింది.
Published by: Ramu Chinthakindhi
First published: June 6, 2018, 1:11 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading