అబార్షన్ నిషేధ చట్టాన్ని వ్యతిరేకిస్తూ.. న్యూడ్ ఫోటో పోస్ట్ చేసిన హీరోయిన్

తమ శరీరాలు తమ ఇష్టమని.. స్త్రీలకు వారి శరీరంపై పూర్తి హక్కు ఉంటుందని రాటజ్‌కోవ్స్‌కి అన్నారు. కానీ అబార్షన్ నిషేధం వంటి చట్టాల ద్వారా స్త్రీలు తమ శరీరంపై హక్కులను కోల్పోతారని చెప్పారు. మహిళల అభిప్రాయాలను, హక్కులను గౌరవించాలని విజ్ఞప్తి చేశారు.

news18-telugu
Updated: May 17, 2019, 5:22 PM IST
అబార్షన్ నిషేధ చట్టాన్ని వ్యతిరేకిస్తూ.. న్యూడ్ ఫోటో పోస్ట్ చేసిన హీరోయిన్
మోడల్ రాటజ్‌కోవ్స్‌కి ఫైల్ ఫోటో (Image : Instagram)
news18-telugu
Updated: May 17, 2019, 5:22 PM IST
అమెరికా ప్రభుత్వం తీసుకొచ్చిన 'యాంటీ అబార్షన్ లా-HB 314'ను వ్యతిరేకిస్తూ మోడల్ రాటజ్‌కోవ్స్‌కి(27) నగ్న ప్రదర్శనతో నిరసన వ్యక్తం చేశారు. అబార్షన్‌పై మహిళల సొంత నిర్ణయానికి అవకాశం లేకుండా చేసే ఈ చట్టం వల్ల వారి హక్కులకు భంగం వాటిల్లుతుందని ఆమె ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో నగ్న ఫోటోను ఒకటి పోస్ట్ చేసి తన నిరసన వ్యక్తం చేశారు.

అబార్షన్‌ను నిషేధించాలని ఈ వారం 25మంది శ్వేత వర్ణ పురుషులు ఓటు వేశారు. ఇది అమలులోకి వస్తే.. రక్త సంబంధీకులతో సంభోగం, అత్యాచారాలకు గురైన సందర్భాల్లో వచ్చే ప్రెగ్నెన్సీని కూడా తొలగించుకోవడానికి అవకాశం ఉండదు. అబార్షన్ నిషేధం కోసం ఓటేసినవారు తమ అభిప్రాయాలను, ఉద్దేశాలను మహిళల శరీరాలపై రుద్దుతున్నారు. ఏ స్టేట్స్ అయితే అబార్షన్‌ను నిషేధించాలని భావిస్తున్నాయో.. అక్కడ నల్లజాతి స్త్రీల సంఖ్య ఎక్కువగా ఉంది. కాబట్టి ఇది రేసిజంతో ముడిపడి ఉన్న సమస్య. ఇది మానవ హక్కులపై దాడి చేయడమే.
రాటజ్‌కోవ్స్‌కి, అమెరికన్ మోడల్

తమ శరీరాలు తమ ఇష్టమని.. స్త్రీలకు వారి శరీరంపై పూర్తి హక్కు ఉంటుందని రాటజ్‌కోవ్స్‌కి అన్నారు. కానీ అబార్షన్ నిషేధం వంటి చట్టాల ద్వారా స్త్రీలు తమ శరీరంపై హక్కులను కోల్పోతారని చెప్పారు. మహిళల అభిప్రాయాలను, హక్కులను గౌరవించాలని విజ్ఞప్తి చేశారు.
First published: May 17, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...