హోమ్ /వార్తలు /అంతర్జాతీయం /

emergency in new york : న్యూయార్క్​లో ఎమర్జెన్సీ.. ప్రకటించిన గవర్నర్​ కాథీ హెచూల్​.. ఎందుకంటే 

emergency in new york : న్యూయార్క్​లో ఎమర్జెన్సీ.. ప్రకటించిన గవర్నర్​ కాథీ హెచూల్​.. ఎందుకంటే 

న్యూయార్క్​ (Photo: PRADAXBBY/ twitter)

న్యూయార్క్​ (Photo: PRADAXBBY/ twitter)

ప్రపంచం అంతా మళ్లీ కరోనా పడగపై భయపడుతోంది. దక్షిణాఫ్రికాలో కొత్త వేరియంట్​ బయటపడటంతో మళ్లీ కరోనా ఊబిలో చిక్కుకుంటామని భయపడుతోంది ప్రపంచం. ఇదే సమయంలో న్యూయార్క్​లో ఎమర్జెన్సీ ప్రకటించారు. ఎందుకంటే

కరోనా (Corona) ఏడాదిన్నరగా ప్రపంచాన్ని కుదిపేసిన సంగతి తెలిసిందే. చాలా దేశాలు కూడా ఇప్పటికీ పూర్తిగా ఆంక్షలు ఎత్తివేయలేదు. అయితే కరోనా తగ్గుముఖం పడుతుండటంతో కొద్దికొద్దిగా ఆయా రంగాలు ఆర్థిక ఊబిల్లోంచి ఇప్పుడిప్పుడే బయటకొస్తున్నాయి. ఈ సమయంలో మరో పిడుగు వచ్చి పడింది. సౌతాఫ్రికా (South Africa)లో బయటపడిన B 1.1.529 కరోనా వేరియంట్​ ప్రపంచ దేశాలను వణికిస్తోంది. ఈ కరోనా వేరియెంట్‌ మిగతా వాటితో పోల్చితే అత్యంత ప్రమాదకరమని, వేగంగా వ్యాప్తి  (Spread)చెందుతుందని శాస్త్రవేత్తలు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇందులో చాలా ఉత్పరివర్తనాలు ఉన్నాయని, ఇప్పటి వరకు చూసిన వైరస్‌ (virus)లో ఇదే ఘోరమైదని చెబుతున్నారు.

ఇజ్రాయెల్‌, బెల్జియంలోనూ కేసులు..

కొద్దిరోజుల కిందట దక్షిణాఫ్రికాలో కనిపించిన ‘బి.1.1.529’ వేరియంట్‌ (variant) .. ఆ తర్వాత పొరుగుదేశం బోట్స్‌వానాతో పాటు హాంకాంగ్‌ (Hong Cong)కూ వ్యాపించింది. తాజాగా ఇజ్రాయెల్‌, బెల్జియంలోనూ కేసులు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో గురువారం ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) టెక్నికల్ అడ్వైజరీ సమావేశమయింది. బీ.1.1.529ను ఆందోళనర వేరియెంట్‌గా గుర్తించింది. అంతేకాదు ఈ కొత్త వేరియెంట్‌కు 'ఒమిక్రాన్ (Omicron)' అని పేరుపెట్టింది.

తీవ్రతను దృష్టిలో పెట్టుకొని..

ఈ నేపథ్యంలోనే ముందు జాగ్రత్తగా అమెరికాలోని న్యూయార్క్‌ రాష్ట్రం ఎమర్జెన్సీ (emergency in new york )ని ప్రకటించింది. న్యూయార్క్‌ గవర్నర్ కాథీ హోచుల్ ఓ ప్రకటనలో శుక్రవారం పేర్కొన్నారు. అయితే న్యూయార్క్‌లో ఇప్పటివరకు కొత్త వేరియంట్‌ (new variant)కు సంబంధించి ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాలేదని తెలిపారు. కానీ, పలు దేశాల్లో ఒమిక్రాన్‌ తీవ్రతను దృష్టిలో పెట్టుకొని ముందు జాగ్రత్త ఎమర్జెన్సీ  (emergency in new york )నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. వచ్చే శీతాకాలంలో (winter) కరోనా వైరస్‌ కేసులు పెరిగే అవకాశం ఉందని, కోవిడ్‌ చికిత్సలకు ఆస్పత్రులు ప్రాధాన్యం ఇవ్వాలని ప్రభుత్వానికి సూచించారు.

ఇజ్రాయెల్‌లో 4 ఒమిక్రాన్ వేరియెంట్ కేసులు..

దక్షిణాఫ్రికాలో సగటున రోజూ 200 మంది కరోనా బారిన పడుతున్నారు. కానీ గత ఐదు రోజులుగా కొత్త కేసులు భారీగా పెరుగుతున్నాయి. ఐతే కొత్త వేరియెంట్ వల్లే కేసులు పెరుగుతున్నాయా? అనే విషయాన్ని అక్కడి ప్రభుత్వం వెల్లడించలేదు. మరోవైపు సౌతాఫ్రికా నుంచి ఇప్పటికే పలు దేశాలకు వ్యాపించింది. అక్కడి నుంచి వెళ్లిన వారిలో కొత్త వేరియెంట్ బయటపడుతోంది. ఇజ్రాయెల్‌లో నాలుగు ఒమిక్రాన్ వేరియెంట్ కేసులు నమోదయ్యాయి. సౌతాఫ్రికా నుంచి వచ్చిన 32 ఏళ్ల మహిళలో మొదట ఈ వేరియెంట్‌ను గుర్తించారు. ఐతే ఆమె ఇప్పటికే మూడు డోసుల ఫైజర్ వ్యాక్సిన్ తీసుకుంది. ఐనప్పటికీ కొత్త వేరియెంట్ బారినపడింది. ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్‌ ప్రధాని నఫ్తాలీ బెన్నెట్‌ అత్యవసరంగా కేబినెట్‌ సమావేశం ఏర్పాటుచేసి.. కొత్త వేరియంట్‌పై సమీక్షించారు. తమ దేశం అత్యయిక పరిస్థితి ఆరంభంలో ఉన్నట్టు ఆయన వ్యాఖ్యానించారు.

Published by:Prabhakar Vaddi
First published:

Tags: Corona cases, New york

ఉత్తమ కథలు