Twitter: టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్ (Elon Musk) ట్విట్టర్ (Twitter) కొనుగోలు చేసిన తర్వాత అందులో చాలా మార్పులు తీసుకొస్తున్నారు. ముఖ్యంగా వెరిఫైడ్ అకౌంట్ (Verified Account) లేదా బ్లూ టిక్ (Blue Tick) కోరుకునే వారి నుంచి ఫీజులు వసూలు చేయాలని మస్క్ భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ట్విట్టర్ ద్వారా వెరిఫైడ్ అకౌంట్ పొందేందుకు ఎవరైనా సరే మంత్లీ 8 డాలర్లు చెల్లిస్తే చాలని ప్రకటించారు. ఈ అమౌంట్ చాలా ఎక్కువ అని నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. నిజానికి ఇప్పటివరకు వెరిఫికేషన్ అకౌంట్ అందించేందుకు ఏ యాప్ కూడా ఫీజు వసూలు చేయడం లేదు.
ఇండియన్ రూల్స్‌కు అనుకూలమేనా?
సోషల్ ప్లాట్‌ఫామ్‌లలో యూజర్లందరూ స్వచ్ఛందంగా వెరిఫైడ్ అకౌంట్స్ అందించాలని భారత ప్రభుత్వం ప్లాన్ చేస్తోంది. ఈ ప్లాన్‌కి సరిగ్గా సూట్ అయ్యేలా మస్క్ తన ట్విట్టర్ యూజర్లందరికీ వెరిఫైడ్ అకౌంట్ పొందేందుకు ఆఫర్ ఇచ్చారు. అయితే భారతదేశ నియమాలు వెరిఫికేషన్ ఫీజు గురించి ఏం ప్రకటించలేదు. గతేడాది నోటిఫై చేసిన కొత్త ఐటీ నిబంధనలు ప్రకారం, సోషల్ మీడియా సైట్స్ స్వచ్ఛందంగా వెరిఫైడ్ అకౌంట్ కోసం దరఖాస్తు చేసుకోవాలనుకునే ప్రతి వ్యక్తికి ఆ అకౌంట్‌ను అందించాయి. దీనివల్ల సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో అనానమిటీ తగ్గుతుంది.
ఫీజు గురించి లేని ప్రస్తావన
వెరిఫైడ్ అకౌంట్ పొందేందుకు ఫీజు లేదా సబ్స్క్రిప్షన్ వసూలు చేయడం గురించి ఐటీ రూల్స్ ఎక్కడా ప్రస్తావించలేదు. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, కూ వంటి ఇతర సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లు యూజర్లను వెరిఫై చేయడానికి ఛార్జీలు వసూలు చేయడం లేదని ప్రభుత్వ అధికారి ఒకరు న్యూస్18కు తెలిపారు. ఐటీ నిబంధనల ప్రకారం, ఇండియాలో యూజర్లు 8 డాలర్ల ఫీజును సవాలు చేస్తే ప్రభుత్వం ఈ విషయంలో ఓ నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని అధికారి తెలిపారు. మరో ప్రభుత్వ అధికారి మాట్లాడుతూ.. వెరిఫికేషన్ కోసం ట్విట్టర్ ఛార్జీలు వసూలు చేయడం అనేది కంపెనీ, వినియోగదారులకు మాత్రమే సంబంధించిన విషయమని.. ప్రభుత్వం జోక్యం చేసుకోవలసిన అవసరం లేదని అన్నారు. అయితే ట్విట్టర్ వసూలు చేసే ఈ ఫీజును, కొనుగోలు శక్తి సామర్థ్యాలకు అనుగుణంగా దేశం వారీగా అడ్జస్ట్ చేస్తామని మస్క్ చెప్పారు.
ఐటీ నిబంధనలు ఏం చెబుతున్నాయి?
ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రూల్స్, 2021లోని సెక్షన్ 4 (7) ప్రకారం.. సోషల్ మీడియా సైట్స్ భారతదేశం నుంచి తమ సేవల కోసం నమోదు చేసుకునే లేదా భారతదేశంలో తమ సేవలను వినియోగించుకునే వినియోగదారులను స్వచ్ఛందంగా వెరిఫై చేయడానికి వీలు కల్పించాలి. వెరిఫికేషన్ కోసం కోరే వినియోగదారులకు ప్రదర్శించదగిన, కనిపించే వెరిఫికేషన్ మార్క్ అందించడానికి యాక్టివ్ ఇండియన్ మొబైల్ నంబర్‌తో సహా ఏదైనా తగిన యంత్రాంగాన్ని ఉపయోగించొచ్చు. ఇది వినియోగదారులందరికీ కనిపిస్తుంది. కాగా మస్క్ ట్విట్టర్ పైన చెప్పినట్లుగా వసూలు చేస్తే ఇండియన్ న్యూజిలాండ్ ఇండియన్ ట్విట్టర్ యాప్‌గా పిలిచే మైక్రో బ్లాగింగ్ ఫ్లాట్‌ఫామ్ కూ (Koo)కి మారిపోయే అవకాశం ఉంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.